పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఊరు నా వెనుక నుండి ఆమె రాగాలు సమీపించి నా పాదాల్ని చుట్టేస్తున్నాయ్ నన్ను వెళ్లొద్దని ప్రాధేయపడుతూ నన్ను చుట్టిన ఆ వనిత వంట్లో మాంసమే లేదు ఆమె నరాల్లో శక్తీ లేదు ఆమె కళ్ళల్లో ప్రేమ తప్ప ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది ఎంతమంది ఆమెతో జీవిస్తూ ఎంత పైకి ఎదిగారు అందరూ ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు పక్షులైనా గూటికి తిరిగొస్తాయ్ కానీ వాళ్ళు రారు ఇక మిగిలింది నేనే అయినా గానీ నా కోసం నన్ను తనతోనే ఉంచుకోవడం కోసం పరుగెత్తుకుంటూ వచ్చి ఎంతో హృదయవిదారకంగా విలపిస్తోంది తను నేనసలు బ్రతికి ఉన్నానో లేనో నాకే తెలియదు అందుకే బ్రతకడం కోసం తనని మ్రింగిన శూన్యం నుండి పారిపోతూ ఉన్నాను తనని వదిలేసి స్వార్ధంతో కానీ తను నన్ను పట్టుకుని తనని వీడొద్దని బ్రతిమలాడుతూ నా గుండెలో తన ఊపిరిని నింపుతూ నన్ను బ్రతికిస్తూ తనలోనే బ్రతికి తనని బ్రతికించమని కోరుతూ స్పృహ కోల్పోతోంది ఆ వనిత నా కళ్ళల్లో నీళ్ళు అప్పుడు నాలోంచి ఒక మనిషి లేచాడు నాలో ధైర్యం నింపాడు నేనొక శక్తినయ్యాను అప్పుడు నన్ను నేను ఆ కభంధ హస్తాలనుండి విడిపించుకుని ఆ వనితని నా చేతులతో కావలించుకుని నా గుండెలో దాచుకుని వెనక్కి తిరిగాను నిజమైన జీవితంలోకి ఆమెతో ఉంటే మరణమైనా జీవితమే అని తెలుసుకుని నేను ఒక కుటుంబమే కానీ అదే తనకి ప్రపంచం నాకూ తనే ప్రపంచం ఇప్పుడు ఇక్కడ నేనూ తనే ఇది గ్రామమే కానీ నాకు అదే స్వర్గం దేవతలు మాతో కలిసి కష్టపడ్డారు ఇప్పుడు మా చుట్టూ పచ్చదనం మా ఇల్లొక హరితవనం ఆ వనితే మా దేవత మాకు దూరంగా శూన్యం ఓడిపోయిన నగరం 31May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hIBs5h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి