తిలక్/చీకటి పూలు ::::::::::::::::::::::::::::::::: కొన్ని ఆలోచనలు కరగాలి ఆవేశాల వెనుక మరికొన్ని అవశేషాలు మిగలాలి ఆత్మల అర్పణం తరువాత నిన్నల్లోని క్షణాలు నేటిలోకి అనుభవాలుగా తోడుకుంటూ బ్రతకాలి కొన్ని చీకటి పూలు పూయాలి ప్రతి రాత్రి పగటి చొక్కా విడిచేశాక శూన్యంలో కొన్ని అక్షరాలు పదే పదే గుర్తొస్తూ/గుర్తుచేస్తూ కొన్ని పక్షులు అప్పుడేపుట్టి రెక్కలు విదల్చకుండా కళ్ళతో లోకాన్ని వీక్షించే యత్నం మళ్ళీ కొన్ని ఊహలు అనిశ్చితంగా ఈరోజు నా ముందు... తిలక్ బొమ్మరాజు 16.04.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iZlJyv
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iZlJyv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి