*నోటా ఛాయిస్* నువ్వూ చూస్తున్నావ్! అరవై ఏళ్ళుగా ఎన్నికల్నీ ఎన్నికైన నాయకుల్నీ నిన్నూ, నీ దేశాన్నీ ప్రేమిస్తున్నామంటూ వాళ్ళు చేసే ప్రతిష్టాత్మకమైన పనుల్నీ నువ్వూ చూస్తున్నావ్! నువ్వు చూసే ఉన్నావ్! ఐదేళ్ళకింద నీ పొలంలో నాగలి పట్టుకొని నీ తువ్వాలను నడుముకు చుట్టుకొని నీతో నాలుగు అడుగులు నడిచి ఫోటోలు దిగిన వాళ్ళని విరిగిన నీ గుడిసె నిట్టాడును చూసి కళ్ళ నీళ్ళ పర్యంతమైన వాళ్ళని కూలిన నీ బతుకు బంగారం చేస్తానన్నవాళ్ళని నువ్వు చూసే ఉన్నావ్! నువ్వు అనుభవిస్తూనే ఉన్నావ్ ! ప్రజాసేవ పేర వ్యాపారీ, దళారీ, స్థానికుడూ, సామ్రాజ్యవాదీ నువ్వేసే ఓటుకు వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అంగడి సరుకుచేసి కులాన్నీ, మతాన్నీ, సంఘాన్నీ క్వింటాళ్ళ కొద్దీ డబ్బులతో తూకం వేస్తున్న స్థితినీ నువ్వు ఐదేళ్ళూ అడుక్కునే పరిస్థితినీ రెండు రూపాయల బియ్యంతో మొదలుపెట్టి ఇప్పుడు రెండు పడకగదుల దాకా నీ బిచ్చగాని వేషాన్ని డెవలప్ చేసిన దుస్థితినీ నువ్వు అనుభవిస్తూనే ఉన్నావ్ ! వాళ్ళు నీ ఒక్క ఓటునే అడుక్కునీ వీలైతే కొనుక్కొనీ నిన్నేం చేశారో నువ్వు చూస్తూనే ఉన్నావ్! చూస్తూ చూస్తూ ఊరికే ఉంటావా! నువ్వూ ఒక చూపు చూడు! ఈతాకులిచ్చి తాటాకులు దొబ్బే నాయకులకు షాకిచ్చెయ్! ఆ నోటా ఈ నోటా పాకిన గాలిబుడగ వార్తలు పేల్చేయ్! ఏ నోటూ వద్దని ఈ“నోటా” మీటెయ్! ఎందుకంటే! భారతదేశం నీ మాతృభూమి ప్రజాస్వామ్య రక్షణ నీ ఆజన్మ విధి తేదీ: 16.04.2014
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l5G5sz
Posted by Katta
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l5G5sz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి