కొన్ని జ్ఞాపకాలు.... బెల్లంపల్లి బొగ్గు పుప్పొడి హన్మకొండ నూతి గుండె లోతూ చొప్పదండి వాసుల బుష్ కోటు ఆల్ఫా లో దమ్ బిర్యాని హెడ్డాఫీసులో లెమన్ టీ ..... కొన్ని జ్ఞాపకాల్ని వదిలించుకోలేం బుట్టలోని పాములా బద్దకంగా మెదులుతూంటాయ్. టాంక్ బండ్ పై అతిశయంతో అటూ ఇటూ తిరిగిన ఆంధ్రతేజాలు గద్దరన్న పాట, కెసియార్ అన్నమాట కాళోజీ, ఆశారాజు, అఫ్సర్, స్కైబాబ, గోరటి వెంకన్నల జ్ఞాపకాల్ని ఎలా చెరుపుకోవాలి? అయినా ఎందుకు చెరుపుకోవాలి? నీ తప్పేముంది నీకేంకావాలో ముందునించీ స్పష్టంగానే చెపుతున్నావ్! మాకే అర్ధం కాలేదు ఇంత జరిగేదాకా. నీకూ ఏవో జ్ఞాపకాలు ఉండే ఉంటాయిలే చెప్పుకోవటం లేదు కానీ! కొన్ని జ్ఞాపకాల్ని చెరుపుకోవాలనుకొన్న కొద్దీ నత్తగుల్ల మెలికల్లా వెలుగులోకే తెరుచుకొంటాయి పూల చుంబనాలలో చెట్లు అమరత్వం పొందినట్లు ఈ స్వప్నాలలోనే జీవిస్తాను నేను. బొల్లోజు బాబా
by Bolloju Baba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJz049
Posted by Katta
by Bolloju Baba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJz049
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి