పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఏప్రిల్ 2014, బుధవారం

Ravela Purushothama Rao కవిత

మౌన రాగం ----------------- రావెల పురుషోత్తమ రావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ఆమె వెళ్ళిపోయినా ఆ మె అందించి వెళ్ళిన అనురాగ పరీమళం నన్నింకా కట్టిపడేస్తూనే వుంటున్నది పులకిత గాత్రుడిగానే ఉంచుతూ పునీతం గావిస్తున్నది. అందుకే ఆమె ఓ ఆనంద నందన వనం కాoక్షలనీడేర్చే కల్పవృక్షం. అనునిత్యం అభిమానించదగిన అపూర్వమౌ ఆమృతకలశం. ఆమె అనుస్యూతంగా నినదిస్తూ ప్రహించే ఓ సుమధుర గాత్రం వీనులకు విందుగా కనులకు పండుగగా కనిపించే ఓ పున్నమి వెన్నెల పురస్కారం అందంగా నడయాడుతూ వెల్లువై పొంగి పొరలుతూ సమ్మోహన పరిచే సౌందర్య సౌమనస్య శిఖరo శోభాయమానమై తళ్కొత్తే తనూ లతికగల అద్భుత కళాఖండపు చిత్తరువు. ఆమె స్మృతుల్లోనే నేను ఆశలపల్లకినై ఊరేగుతాను. జీవనదిగా నిరంతరం శోభిస్తూ అనునిత్యం ప్రవహిస్తాను. ఓ వెన్నెలలో వెలుగొందే కాళిందినౌతాను పచ్చని పంటపొలాలకు నీరందించే పవిత్ర గోదావరినౌతాను. సౌరభాలను ప్రసరించే సుమదళమై సోయగాలుపోతాను.16-4-14 ========================

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hTq7hj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి