మితృలార ,విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్సింగ్ పై సుమారు 30 యేళ్లక్రిందటి రాసిన నాపాట రెడ్డి రామకృష్ణ//భగత్సింగ్// అక్కలార మీరు ఉయ్యాలో సక్కంగ యినరమ్మ ఉయ్యాలో అన్నలారా మీరు " ఆలించ రారండి " భరత ఖండము కొరకు " బలిజేసి ప్రాణాలు " వేగుసుక్కాలయ్యి " మనల వెలిగేటి వీరుల " గాధలు వినరండి ఉయ్యాలో గబగబ నడవండి ఉయ్యాలో "అక్కలారా" అట్టి వీరులలోన ఉయ్యాలో విప్లవ వీరులు " జాతి మనుగడకొరకు " చేత రైఫిలు పట్టి " ప్రాణాలు విత్తులుగ " త్యాగాలు పండించి " దేశభక్తుల కన్న " త్యాగధనులే మిన్న " చాటిచెప్పిన వీరుల ఉయ్యాలో వీరగాధలు వినుడి ఉయ్యాలో "అక్కలారా" విప్లవ వీరులలొ ఉయ్యాలో జాతిరత్నము తల్లి " వురికొయ్య కేలాడి " జాతి కూపిరిపోసె " వీరుని కధ వినుడి " పేరు భగత్సింగ్ " ఆ భగత్సింగ్ కధ వినుడి ఉయ్యాలో నాటి భారత కధ వినుడి ఉయ్యాలో "అక్కలారా" ఉత్తరా దేశాన " పశ్చిమా దిక్కునా " పంజాబు రాష్ట్రాన " పల్లెటూరులోన " పుట్టెనీ బాలుడు ఉయ్యాలో పుడమి పులకింపగా ఉయ్యాలో "అక్కలారా" నాడు దేశము తీరు " ఏ రీతిగున్నాది " పరదేశ దొరలంత " ఢిల్లీ పాదుషాలైనారు " కష్టాల సంద్రములొ " జనులు కడకీదలేకను " ఉప్పెనై పొంగొచ్చి " ఉద్యమాలే చేసె " ఖద్దరు నాయకులు " ఆ ఉద్యమాలను నడిపి " స్వాతంత్ర్యమను పంట " తాము పండిస్తమన్నారు " దొరలవద్దకు పోయి " దొడ్డవారని పొగిడి " స్వాతంత్ర్య మిమ్మాని ఉయ్యాలో చెయిచాపి అడిగేరు ఉయ్యాలో "అక్కలారా" బాధలతొ బాటుగా " భగత్సింగు పెరిగె " దేశాన్ని చూసాడు " లోకాన్ని చదివాడు " గాంధి నెహ్రూ కాదు " గన్ను పట్టాలనెను " కొండమాటున సూర్యుడు " ఉండి ఫలమేమానె " జనము సంద్రములోనె " తూరేటి సూర్యుడు " పేదోళ్ళ ముంగిళ్ళు " పలకరిస్తాడాని " బాటయిది కాదాని ఉయ్యాలో బాంబు చేపట్టాడు ఉయ్యాలో "అక్కలారా" భగత్సింగంటేను " భయపడి దొరలంత " అరగజము పరుగెత్తి " వారు తిరిగి చూసేవారు " భగత్సింగంటేను " జై అంటు జనులంత " ఉరికి పరుగులు తీసి ఉయ్యాలో వారు ఉప్పొంగి పోయారు ఉయ్యాలో "అక్కలారా" భయపడిన దొరలంత " భగత్సింగుని పట్టి " కుట్రకేసులు పెట్టి " కుత్తుకులు తెంచగా " కుట్రలు పన్నేరు " చరఖాల నాయకులు " నొరు మెదపక కూచుంటె " ఆశయానికి ప్రాణం " అడ్డుకారాదాని " చిరునవ్వుతో ఉరిని ఉయ్యాలో చేరనడిచెను వీరుడు ఉయ్యాలో "అక్కలారా" నడిచిన నడకలు " నదిని పోలినవయ్య " సూసేటి సూపులు " సుక్కలిని పోలేను " పెదవిపై చిరునవ్వు " ఉదయన్ని పోలింది " తలపులన్ని జనుల ఉయ్యాలో మదిల మొలకలై నిలిచాయి ఉయ్యాలో "అక్కలారా" *** 08/09/1986 (ప్రజాసాహితి)
by Rama Krishna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f6WBoc
Posted by Katta
by Rama Krishna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f6WBoc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి