జాస్తి రామకృష్ణ చౌదరి ఆరాటం అందమైన మూడు గదుల ఇల్లు కానీ మరో ఇల్లు కోసం ఆరాటం మంచి హోదా జీతమూ ఉన్న ఉద్యోగం కానీ ఇంకా గొప్ప ఉద్యోగం కోసం ఆరాటం జీవితం హాయిగా సాగడానికి సరిపడే సంపద కానీ ఇంకా కోట్లకి పడగెత్తాలని ఆరాటం చక్కని గుణమూ రూపామూ గల భార్య కానీ మరో అందమైన ప్రేయసి కోసం ఆరాటం సుఖమూ శాంతి సమృద్దిగా ఉన్న జీవితం కానీ ఇంకా ఏదో ఆనందం కోసం ఆరాటం ఈ పోరాటంలో జీవితం అలసిపోయింది ఐనా ఇంకా పోరాటం కోసం ఆరాటం ఆఖరు ఘడియలు వచ్చేశాయి లోకం వదిలి వెళ్లిపోవాలి, తప్పదు ఆ ఆరాటంలో మనశ్శాంతిని పోగొట్టుకుని ఇక ఏ ఆరాటం లేకుండా కొద్ది రోజులు ఇక్కడే బ్రతకాలని నిజమైన ఆరాటం పడుతోంది మనసు ఇప్పుడు కానీ చాలా ఆలస్యమైపోయింది ఇక ఆయుస్షు తీరిపోయింది ఆరాటం ఆగిపోయింది 23Mar2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q4nTX0
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q4nTX0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి