పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మే 2014, గురువారం

Pardhasaradhi Vutukuru కవిత

!! ఒంటరి పోరాటం !! అందరు వున్నా ఒంటరి బ్రతుకు కొందరిది ప్రతిదానికి సున్నితం గా స్పందించే జీవితాలకు భరించ వలసిన భర్త బాధ్యతా రాహిత్యం తో వుంటే ఇంటికి తానె మగడై బజారు కు వెళితే ప్రతి వాడు పలకరించే వాడే ప్రేమ కురిపించే వాడే ఆత్మాభిమానం తో వుండే అతివ అణిగి మణిగి వుంటే చేతకాని తనమని భావించే జనం ఇంకా చేతికి అంది రాని పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం మృగాలతో పోరాటం పుట్టింటికి వెళ్ళాలంటే స్వాభిమానం ప్రతి చూపు , ప్రతి పలకరింపు ఆకలివే సమాజం కోసం నవ్వుతు స్వగతం లో కుళ్లి కుళ్ళి ఏడుస్తూ చస్తూ బ్రతుకుతూ ... తనకోసం బ్రతకలేక కుటుంబం కోసం చావలేక ఎందుకీ బ్రతుకు అనే వేదన ఆకలి గొన్న అడవి మృగాల కైనా జాలి ఉందేమో కాని ఈ మానవ మృగాల మధ్య సామాన్య వనిత మన గలదా కుటుంబం నాది అనుకోవటం శాపమా ఒంటరి పోరాటం చేయాటం పాపమా .... పుణ్యభూమి నాదేశం నమో నమామి !!పార్ధ !!22/05/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWX2FC

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //వేటూరి// తన కలాం నుండి జారిన ప్రతి అక్షరం ఒక వరం తను అల్లిన ప్రతి పదం ఎంతో మధురం తను పాటగా మలిచిన ప్రతి అక్షరం ఒక చిత్రకారుడు చేతిలో ఉండే కుంచె లాగా కదిలే అందమైన సాధనం అ పాటలు విన్న మనం ఎంతో అదృష్టవంతులం,ఎందుంటే మరో అన్నమయ కదా మన వేటూరి గారు, అయిన రాసిన ప్రతి పాట మన మదిలో ఎప్పటికి నిలిచిపోవాలని కోరుకుంటూ ........ 22may2014

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWB0HW

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

ఏమో గుర్రం ఎగురా వచ్చు ---------------------- /శ్రీనివాసు గద్దపాటి/ ఏమో ఇండియా వెలిగిపోతుందేమో...!? పడమటిగాలిమోజులో వలసబోయిన పక్షిపిల్లలు మళ్ళీ గూటికి చేరుతాయేమో..! బక్కచిక్కిన రూపాయికాస్తా బరువెక్కుతుందేమో వరాలజల్లుకు మోసపోయి ఆశలవిత్తులుజల్లుకున్నాక రుతుపవనం కాస్తా తీరం దాటకుంటేనో...!? ఏమో....! ఇండియా వెలిగిపోతుందేమో.... స్కామ్ లో... స్కీమ్ లో.... తేడాతెలియని జనాలు మోడీలను త్రీడీలలో చూసి మోసపోతున్నంత కాలం ఏమో.... ఏనుగు దుముకావచ్చు... గుర్రం ఎగురావచ్చు 22.05.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n4r0tZ

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

ఏమో గుర్రం ఎగురా వచ్చు ---------------------- /శ్రీనివాసు గద్దపాటి/ ఏమో ఇండియా వెలిగిపోతుందేమో...!? పడమటిగాలిమోజులో వలసబోయిన పక్షిపిల్లలు మళ్ళీ గూటికి చేరుతాయేమో..! బక్కచిక్కిన రూపాయికాస్తా బరువెక్కుతుందేమో వరాలజల్లుకు మోసపోయి ఆశలవిత్తులుజల్లుకున్నాక రుతుపవనం కాస్తా తీరం దాటకుంటేనో...!? ఏమో....! ఇండియా వెలిగిపోతుందేమో.... స్కామ్ లో... స్కీమ్ లో.... తేడాతెలియని జనాలు మోడీలను త్రీడీలలో చూసి మోసపోతున్నంత కాలం ఏమో.... ఏనుగు దుముకావచ్చు... గుర్రం ఎగురావచ్చు 22.05.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nuQpvj

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి అధ్యయనవేదిక 18.5.2014 నివేదిక || మే 2014 మూడవ ఆదివారం 18 తేదీన సాయంత్రం బి.వి.కె. గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయనవేదిక మల్లాది సుబ్బమ్మ గారి నిర్యాణానికి సంతాప తెలుపుతూ మౌనం పాటించిన పిదప అధ్యయన వేదిక కార్యక్రమం ప్రారంభంలో ఈ సమావేశానికి కొత్తగా వచ్చిన పి. వెంకటేశ్వర్లు, బయ్యారం జూనియర్ కళాశాల తెలుగు లెక్చరఋ పరిచయమయ్యారు. తాను రాసిన కవిత '' చుండూరు దళితుల మారణకండ '' ఆలోచింపచేసేదిగా వుందని అందరూ అభిప్రాయపడ్డారు. తదుపరి ఖమ్మానికి చెందిన సన్‌ ఆఫ్ మాణిక్యంగా పిలువబడే డా. సీతారాం ని '' రెజ్యూరాం కవి '' అని తన కవితలో చక్కగా విశ్లేషించారు. ' రండి మీరింక ఆలస్యం చేయొద్దు ' - అనే కవితలో కార్పొరేట్ స్కూళ్ళు, కాన్వెంట్‌లు చేసే హడావుడిని వ్యంగ్య కవితను చదివి వినిపించారు సునంద. యడవల్లి శైలజ ' నగరం ' అనే కవితలో రోజూవారి నగర జీవన గమనాన్నీ తనదైన శైలిలో్ వినిపించారు. దానిపై చర్చ జరిగింది. ఆధునిక జీవనంలో సంప్రదాయాలు ఎలా మారిపోతున్నాయో వివరించే కవిత నాగేశ్వరావు వినిపించారు. ఈ శకం నాది అనే కవితలో దళిత ధిక్కర స్వరంతో పాటు, ఆత్మ స్థైర్యం ప్రతిబింబించింది ' మానవతా వాదం నా మదినిండ వుంది ' అనే ముగింపు కవితకు పృఆణం అని చర్చలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. అలాగే ' బంగారు తల్లి ' అనే కథానికను ' అమ్మాయి ' ని వస్తువుగా తీసుకుని (ఆడపిల్ల - అక్కడపిల్లా ?) నేటి సామాజిక పరిస్థితులు, అమ్మాయిలపైని ఎటువంటి సానుకూల, ప్రతికూల ప్రభావాలు పడతాయో, తండ్రి ఆలోచన, తల్లి ఆరాటం ఎలా ఊగిసలాటలో వుంటాయో చాల చక్కగా చదివి వినిపించారు సంపటం దుర్గా ప్రసాద్. రౌతు రవి, కన్నెగంటి వెంకటయ్య, తమ తమ సందేశాలను అందిచారు. సాహితీ స్రవంతి అధ్యన వేదిక నిర్వాహణలో మరింత సహాయ సహకారాలు కపిల రాంకుమార్, కన్నెగంటి వెంకటయ్య గార్లకు అందించాలని వేదిక అభిప్రాయపడింది. రాబోయే సెప్టెంబరు 2014 కు సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేక సంచిక తేవాలని అందులో ఇంతవర్కు జరిగిన కార్యక్రమాల నివేదిక, చదివిన కవితలు, ప్రసంగాల సంక్షిప్త సమాచారం వుండేలా చక్కటి ప్రణాళిక రచించాలని తీర్మానించారు. అలాగే సాహితీ స్రవంతి 15 వ వార్షికోత్సవం జూన్‌ 14-15 తేదీలలో జరుగవచ్చునని దానికి ఒక ప్రత్యేక సంచికకై కవితలను, వ్యాసాలను, జూన్‌ నెల 5 వ తేదీలోగా బి.వి,.కె. గ్రంథాలయ నిర్వహకుడు, సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు కపిల రాంకుమార్ అందించాలని తెలియచేసారు. కె. ఆనందాచారి మాట్లాడుతూ కాలానికి, కవిత్వానికి వున్న బంధం, సంబంధం రాజకీయలాకి, సాహిత్యానికి కూడ అవినాభావ సంబంధం వుండటం నేడు అనివార్యం అని నొక్కి చెప్పారు. మతం, కులం, స్త్రీ పురుష తేదాలు, వివక్షతలపై పోరాటం మన సాహితీకారులు చేయాలన్నారు. రెండు నెలల వ్యవధిలో వివిధ మాధ్యమాల ద్వారా దేశాన్ని ఊదరగొట్టి, ప్రభావితంచేసిన రాజకీయ ప్రకంపనం ఓ వ్యక్తి చుట్టూనే తిరిగి రాజకీయాలను ప్రబావితం చేసి కోట్లాదిమందికి ఆరాధ్యుడుగా ఎదగటంలో సఫలీకృతుడవడం ఎంత ఆశ్చర్యం. ఏండ్ల తరబడి ఉద్యమాలు చేసిన వారిని ఎవరూ పట్టించుకోలేదంటే మీడియా ప్రభావం ఎంతుందో అలోచించాలి. సాంస్కృతికంగా కేంద్ర బిందువుగా ఇపుడు వారణాశి నెలవుకాబోతోంది. ప్రస్తుత సాంస్కృతిక వ్యవస్థపై దాడిచేయడానికే మతచాందసుల లక్ష్యంగా కనబడుతోంది. మనం సాహితీ సృజనకారులంగా ఆ దుష్ట వైఖరిని ముక్త కంఠంతో ఖండించాలి, పదునైన సాహిత్యంతో కలాలను నడిపించాలి. మన అధ్యయన వేదిక మరింత పరిపుష్టం చేసుకోవాలి. గత అనుభవాలను వర్తమానాలుగా మార్చుకొని మరింత మెళుకవతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఒక సూచన ఏదైనా కథా సంకలనం, కవితా సంకలనం, నవల, లేదా విమర్శనా గ్రంథం చదివి, దానిని అధ్యయన వేదికకు ఒకరు పరిచయం చేయటం, తదుపరి ఇతరులు చర్చించటం ఒక ఒరవడిగా పెట్టుకుందాం అని తన సందేశాన్ని ముగించారు. చివరగా ఆసు ప్రసాద్‌ పోలవరం ముంపు బాధితులపై ఒక పాట ఆలపించాడు. రౌతు రవి వందన సమర్పణ చేసారు. ---22.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ksD7QH

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

//సూర్యుడి...తాపం// పుడమి...భగ్గుమంటుంది.... సన్ స్ట్రోకుతో....షోకిస్తూ.... మందువేసేవాడు...లేక...విలపిస్తూ..... ధరిచేరే...సూరీడును....ఆగమన్న....ఆగడు.... కాల్చేస్తానంటూ....కసిగా...వడిగా.... వున్న..నీరు..ఇంకేదాకా... పచ్చని..చెట్టు...వాడిపోయేదాకా.... పుడమిపై....సుఖభోగాలతో....అంతా..సాధించాననుకున్న...మనిషిని...మాడ్చేసేదాకా..... ఆగడు....సూరీడు...ఆగడు.... ఋతువు..ఋతువుకూ...ఉగ్రుడై.... భగ...భగ...మండిపోతూ.... కలికాలం...ముగించేద్దామని...బహు..ఆసక్తుడై.... పుడమి....కన్నీరు..కానరాకపాయే.... ధన..దాహాంతో...కాలుష్యపు...పొగలు...పోకపాయే.... నేలమీద...నడక..లేకపాయే... పేడ...అలుకు...సొగసు...లేకపాయే.... వద్దన్నా...కాంట్రాక్టరు...కాంక్రీటు...రోడ్లైపాయే... నీడనిచ్చే...చెట్లు...మోడుబారిపాయే.... చిట్టి...పొట్టి..చెట్లతో...జనాలకు...సోకులేక్కువైపాయే.... నేనూ...ఇంతే........సూరీడు...దెబ్బకి... తాపంతో సెలైను...బాటిల్లు...ఎక్కించుకున్న...పిచ్చితో నా...భావానికి....అక్షర..రూపమై...ఇలా...దొర్లింది... నేనూ...ఇంతే //22-05-2014//

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1toCZ7v

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//నానీలు-3 ************************* ఎగిరేపతంగాన్ని దారంశాసిస్తే తెగిన పతంగాన్ని గాలిశాసిస్తుంది **** ఆకాశంలో జిగేల్ మన్న మెరుపుఖడ్గం భయంతో మేఘంచాటున చంద్రుడు **** ఆకాశంలో మేఘాలతో వర్షపునీరు జీవితంలో మేఘాలతో కంట్లోనీరు **** విద్య మొక్కదశలో వంచుతుంది చట్టం ముదిరినచెడును త్రుంచుతుంది ***** 22-5-2015 *************15

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sYls46

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

// అబ్బో...ఎండ// ఏమన్నా..సూర్యన్న... ఏం...కోపమన్న...సల..సల..మసిలిపోతున్నవ్.. అబ్బా...ఏం..దెబ్బన్న..నీది... పెట..పెటమనుకుంటూ ....జీవులు..జువ్వాలు..రాలిపోతుండే.... కొబ్బరి..బోండాం...నీల్లు...ధరెక్కువాయే ఊరెనక....శెలిమలెండిపాయే... ఊర్ల..నీల్లు...మినరల్..నీల్లైపాయే కల్లునీల్లు ...మన్ధెక్కువాయే..నిషా..తక్కువాయే.. బీర్ల..సీసాలు...పైషలబరువెక్కువాయే... యేప...షట్ల...నీడనే..నయం... పొద్దటి...పూట...గంజి..నీరు...ఉల్లి..ముక్కే...నయం... స్నానానికి....బాయి..నీల్లే...నయం.. సాలాయిన..నేషిన...తుండు...గుడ్డే...నయం... మెరిసే..పూల..చొక్కలకన్నా...తెల్ల..చొక్కాలే..నయం.. ...........అనా....సూర్యన్నా...కొద్దిసేపు... మబ్బులమాటున.....ఆడరాదా...పాడరాదా.. జెరసేపు...సేద..తీరరాద..... నీ..తాపంలోనే...మేము...ఇలావుంటే.. రోజంతా...కాలిపోయే...నువ్వేట్లుండాల్నే..... ..మంచిదే...చంద్రన్న..వచ్చేదాకా..ఇంట్లోనేవుంట................ //తేదీ: 22-05-2014//

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gmUina

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//అమ్మ//14 **************************** అమ్మ ఓ అనురాగ స్రోతస్సు మూర్తీభవించిన శ్రేయస్సు బతుకు ప్రపంచాన పరచుకొన్న భాగ్యోషస్సు పూర్వపుణ్యయాగావిష్కృత విమలహవిస్సు జీవన ఎడారిదారుల్లో చల్లనిఆశీస్సై సదావెన్నంటినిలిచే సహనామృత ఒయాసిస్సు ***** 11-5-2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lVu6hk

Posted by Katta

Chi Chi కవిత

_ఇంకా_ మారు..మార్చు మారకు..మార్చు మారు..మార్చకు మారకు..మార్చకు మార్పుంది మార్పులేదు.. మారుతుంది మారదు.. ఇంతే..ఇలానే మారలేరు మారలేదు!! __(22/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n3zhyp

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అభయం ఒంటరిగా ఉన్న నన్ను ఎత్తుకుని బలవంతంగా ప్రకృతి బయటకి తీసుకెళ్లింది విషాదంలో ఉన్న నన్ను పుష్పాలు తమ నవ్వులతో పలకరించి నన్ను నవ్వించాయి మాట్లాడలేని నన్ను పక్షులు తమ కుహూరావాలతో నా నోట్లోనుండి రాగాలు పలికించాయి నడవలేని నా చుట్టూ అందమైన సీతాకోకచిలుకలు చేరి తమ నాట్యాలతో నన్ను ఆకర్షించి తమతో పరుగెత్తించాయి నిరాశలోకూరుకుపోయిన నన్ను ఆకాశం పైకి లేపి నా భుజం మీద తన మృదువైన చేయి వేసి భవిష్యత్తులోకి నడిపించింది ఇప్పుడు నేను ఒంటరిగా లేను నిర్వేదంలో అస్సలు లేను మనసు తేలికై మరో ప్రపంచంలో ఉన్నాను అదే నా ప్రపంచమై దానికి నేనే రాజునై నేనే ఒక నాయకుడినైనట్టు ఎంత అందమైన వాస్తవం ఒకప్పుడు ఈ జీవితం ముగిసిపోతే ఎంత బావుణ్ణు అనుకున్నవాడిని ఇప్పుడేమో ఈ జీవితం శాశ్వతం అయితే ఎంత బాగుంటుందని ఆనుకుంటున్నాను నన్ను మ్రింగేయాలని నాలో ఉండి ఎదురుచూసిన చీకటి నాలోని వెలుగులో అంతరిస్తుంటే ఎంత హాయిగా ఉంది జీవితం శాపం కాదు అదొక వరం అని అర్ధమయ్యకా నా లోంచి నేను అగ్నిలా ప్రజ్వరిల్లుతుంటే లోకం వింతగా నా వైపే చూస్తుంటే నాలో ఎంత గర్వం! 22May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RWNmBS

Posted by Katta

కాశి రాజు కవిత

||తెలుసు || దీపాలార్పేసిన గాలితో గొడవాడి భారంగా మారిన దాని హోరంతా కళ్ళకికట్టి సూపుతున్నపుడు సీకటి ముసుగు తీసేసి మామిడాకులు మెరుస్తాయని మా ఊళ్ళో ఎండాకాలం ఎన్నెలకి మనుసులతో మాటాడ్డం తెలుసు. దూరంగా ఉన్న ఎద్దునో , గేదినో అక్కడెవరో ఉన్నారని బ్రమింపసేసి తీరా సేరి సూశాక చేతులు నాకే ఎద్దునీ, గేదినీ మనుసుల్లాగా నీతో మాటాడించడం మాఊరి ఎన్నెలకి ఎప్పుడో తెలుసు 22/ 05/ 2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tnWFIJ

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tnWE7y

Posted by Katta

Prasad Atluri కవిత

ప్రసాద్ అట్లూరి.. || తరగని దూరం || పెద్దచెఱువు గట్టున చింతచెట్టుపై చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడుతుంటే దొంగ పెట్టాల్సొస్తుందన్న అక్కసుతో చెయ్యితగిల్నా తగల్లేదన్న చిన్నఅబద్దం ముప్పైఏళ్ళయినా దగ్గరకాలేని దూరాలకు మనిద్దరినీ విసరబోతోందని ఆక్షణం తెలిసుంటే ఒకరికోసం ఇంకొకరు మళ్ళీ దొంగమయ్యేవాళ్ళమేమో !! అయినా ..ఎన్నిసార్లు ప్రయత్నించలేదు మనం ఒకరికొకరం దగ్గరవ్వాలని ఆ తరువాత ... గోలీలాటలో నాకోసం నువ్వు ఓడిపోతూ గోడుంబిళ్ళ క్యాచ్ నీకోసం నేనొదిలేస్తూ పంటలేయడానికి చేతులు పట్టుకున్నప్పుడు అవకాశాన్ని వదలకుండా ఎంతసేపు వుండిపోలేదలా ... కానీ ఎందుకనో.. ఓ సన్నని తెర మనల్నివేరుచేస్తుండేది !! బ్రుతుకు బాటలు మనల్ని చెరోవైపుకు చేర్చాక మాటలు రాని పెళ్లి సుభలేఖల్ని మాత్రం ఒకరికొకరం పోస్టుచేసుకుని మురిసిపోయామే .. చొరవతీసుకుని ఎవ్వరమైనా ఒక్క ఫోన్ చేసుంటే దూరమైన పలకరింపు.. దగ్గరై ఆశ్వీరదించకుండేదా పారేసుకున్న మధుర క్షణాల్ని కానుకివ్వకుండా ఉండేదా ? మరెందుకో అలాజరగలేదు ... అప్పుడు కూడా!!!! యంత్రాల మధ్య యాంత్రికమైపోయిన జీవితంలో తలపైకెత్తి చుక్కల్ని చూసే వీలుచిక్కినప్పుడల్లా నువ్వెక్కడో తలుక్కున మెరుస్తూనే ఉంటావ్ నేస్తం ఆరుబయట ఆటల్లో పిల్లలు గొడవపడుతుంటే దగ్గరకుపిలిచి సర్దిచెబుతున్నప్పుడల్లా ఎవరో కుర్రాడు బుంగమూతి పెట్టుకుని రుసరుసలాడుతూ వెళుతుంటే నిన్నునేనో నన్నునువ్వో వదిలేసి వెలుతున్నట్లేవుంటుంది దోస్త్ !! చిన్నతప్పుకు మనం అనుభవిస్తున్న ఇంత పెద్దశిక్ష ఏ న్యాయస్థానమూ ఖరారు చేసింది కాదుగా... మరెందుకింకా అహం జైళ్ళలోనే మగ్గిపోవటం!!! ప్రక్కవాడికి చెయ్యితగిలితేనే పదిసార్లు సారీ చెప్తామే ప్రాణస్నేహితుడికి చెయ్యందించి చేరువ కాలేమా వస్తున్నానేస్తం .. వదిలిన చోటుకే మళ్ళీ తరగని దూరాన్ని .. దగ్గర చేసుకుందామని !! )-బాణం-> 22MAY14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TxfQU8

Posted by Katta

Srinivas Yakkala కవిత

***పసిపాప*** పుట్టింది పుట్టింది పసిపాప పువ్వల్లె నవ్వింది పసిపాప మగబిడ్డ కోసమని పసిపాప మొక్కులు మొక్కారె పసిపాప ఆడపిల్లవని పసిపాప ఆడోల్లే ఏడ్చారే పసిపాప బంతి పువ్వులాంటి పసిపాప బడి బాట పట్టింది పసిపాప ఆటలు ఆడింది పసిపాప పాటలు పాడింది పసిపాప అల్లరి చేసింది పసిపాప ఆనందంగ ఎదిగింది పసిపాప పెరిగింది పెరిగింది పసిపాప పెద్దమనిషి అయ్యింది పసిపాప పైట వేసిందమ్మ పసిపాప పనులెన్నొ నేర్చింది పసిపాప అమ్మకు సాయంగ పసిపాప అండగ నిలిచింది పసిపాప… ఇక్కడి నుండి పెద్దవాల్లు పసిపాపని ఏమంటరంటే……. ఫద్దతిగ ఉండని అంటరూ పకపక నవ్వద్దని అంటరూ పరుగులు పెట్టద్దని అంటరూ బయటకి పొవద్దంటారూ చదివింది చాలని అంటారు సంబంధం చుస్తామంటారు….. ఇంకా రాయల్సి ఉంది …….తప్పులుంటే క్షమించండి. శ్రీనివాస్ యక్కల

by Srinivas Yakkala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXjADf

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కవి సంగమానికి వందనం ॥ నడవాలన్న ఆశే తప్ప నడిచే శక్తి లేని నిస్సహాయత తో నిత్యం యుద్ధం చేస్తూ బుడి బుడి అడుగులేస్తూ పడుతూ లేస్తూ వచ్చానిక్కడికి భూమాత అదిరిపడేలా అంగలేస్తూ మహోన్నత శిఖరాల వైపుకి మహా వేగం గా పయనించే మహానుభావులని అబ్బురంగా చూసాను ఉన్నత శిఖరాలని చేరాక కూడా ఎదురొస్తున్న అపరిచితులకి చేతి ఊతమిచ్చే పనిలో అహరహము శ్రమిస్తున్న మహామహుల్ని మహాశ్చర్యం తో తిలకించాను నేను కూడా నడవాలని నీలాకాశాన్ని అందుకోవాలని కలలు కంటూ, కలంతో కుస్తీ పడుతూ తప్పులెన్నో చేసాను తప్పటడుగులు వేసాను పారాడే పసి పాపని చూసినట్టు పడి లేచే నా కవితల్ని మురిపెంగా చూసారు అడుగెందుకు తడబడిందని అడగనైనా అడగక చిటికెన వేలందించారు నచ్చితే ఓ మెచ్చుకోలు బహుమానమిచ్చారు నచ్చనప్పుడు మౌనంగానే చెప్పి నా తప్పులు నన్నేతెలుసుకోనిచ్చారు మాటల తూటాలు పేల్చకుండానే మంచి దారుల వైపుకి ప్రేమగా మళ్ళించారు ముఖ పరిచయమైనా లేకుండానే మదినిండుగా ఆత్మ స్థైర్యాన్ని నింపారు నడుస్తున్నానో ఇంకా పారాడుతున్నానో తెలీదు కానీ... పరుగులు తీస్తున్న అనుభూతిని కానుక గా అందించారు ఎక్కడెక్కడో గాయపడిన మనసుకి ఇక్కడి జ్ఞాపకాల లేపనం పూసి మళ్ళీ మునుపటిలా మార్చుకుంటూ ఉంటాను నీకేమీ కాకపోయినా నీకంటూ కొందరున్నారనే భరోసా నర నరానా నింపుకుని నన్ను నేను ముందుకు నడిపించుకుంటాను !!! కవి సంగమం మిత్రులకి మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 22. 05. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXgnng

Posted by Katta

Katta Srinivas కవిత

పద్యలక్షణాలను తెలుసుకునేందుకూ, గణవిభజనకు సాప్ట్ వేర్ వుంది గమనించారా? Dileep Miriyala గారూ మీ టెక్నికల్ పరిజ్ఞానాన్ని చాలా సమయాన్నీ శ్రమనీ తీసుకుని తెలుగుకోసం వినియోగించటం చాలా గొప్ప విషయం సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే పారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మ ని స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ ఇలా పద్యాలను ఇచ్చి గణవిభజన చేయమంటే కొంచెం కష్టమే అనుకుంటున్నారా? గణవిభజనను సరిచూసుకునేందుకూ, పద్య లక్షణాలు తెలుసుకునేందుకూ సాప్ట్ వేర్ http://ift.tt/SmeN8N

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SmeN8N

Posted by Katta

Sreekanth Yadav Talasani కవిత

http://ift.tt/TwSCxz

by Sreekanth Yadav Talasani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TwSCxz

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత



by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Sm3Wf0

Posted by Katta

Ravi Rangarao కవిత



by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7MhBS

Posted by Katta