కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి అధ్యయనవేదిక 18.5.2014 నివేదిక || మే 2014 మూడవ ఆదివారం 18 తేదీన సాయంత్రం బి.వి.కె. గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయనవేదిక మల్లాది సుబ్బమ్మ గారి నిర్యాణానికి సంతాప తెలుపుతూ మౌనం పాటించిన పిదప అధ్యయన వేదిక కార్యక్రమం ప్రారంభంలో ఈ సమావేశానికి కొత్తగా వచ్చిన పి. వెంకటేశ్వర్లు, బయ్యారం జూనియర్ కళాశాల తెలుగు లెక్చరఋ పరిచయమయ్యారు. తాను రాసిన కవిత '' చుండూరు దళితుల మారణకండ '' ఆలోచింపచేసేదిగా వుందని అందరూ అభిప్రాయపడ్డారు. తదుపరి ఖమ్మానికి చెందిన సన్ ఆఫ్ మాణిక్యంగా పిలువబడే డా. సీతారాం ని '' రెజ్యూరాం కవి '' అని తన కవితలో చక్కగా విశ్లేషించారు. ' రండి మీరింక ఆలస్యం చేయొద్దు ' - అనే కవితలో కార్పొరేట్ స్కూళ్ళు, కాన్వెంట్‌లు చేసే హడావుడిని వ్యంగ్య కవితను చదివి వినిపించారు సునంద. యడవల్లి శైలజ ' నగరం ' అనే కవితలో రోజూవారి నగర జీవన గమనాన్నీ తనదైన శైలిలో్ వినిపించారు. దానిపై చర్చ జరిగింది. ఆధునిక జీవనంలో సంప్రదాయాలు ఎలా మారిపోతున్నాయో వివరించే కవిత నాగేశ్వరావు వినిపించారు. ఈ శకం నాది అనే కవితలో దళిత ధిక్కర స్వరంతో పాటు, ఆత్మ స్థైర్యం ప్రతిబింబించింది ' మానవతా వాదం నా మదినిండ వుంది ' అనే ముగింపు కవితకు పృఆణం అని చర్చలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. అలాగే ' బంగారు తల్లి ' అనే కథానికను ' అమ్మాయి ' ని వస్తువుగా తీసుకుని (ఆడపిల్ల - అక్కడపిల్లా ?) నేటి సామాజిక పరిస్థితులు, అమ్మాయిలపైని ఎటువంటి సానుకూల, ప్రతికూల ప్రభావాలు పడతాయో, తండ్రి ఆలోచన, తల్లి ఆరాటం ఎలా ఊగిసలాటలో వుంటాయో చాల చక్కగా చదివి వినిపించారు సంపటం దుర్గా ప్రసాద్. రౌతు రవి, కన్నెగంటి వెంకటయ్య, తమ తమ సందేశాలను అందిచారు. సాహితీ స్రవంతి అధ్యన వేదిక నిర్వాహణలో మరింత సహాయ సహకారాలు కపిల రాంకుమార్, కన్నెగంటి వెంకటయ్య గార్లకు అందించాలని వేదిక అభిప్రాయపడింది. రాబోయే సెప్టెంబరు 2014 కు సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేక సంచిక తేవాలని అందులో ఇంతవర్కు జరిగిన కార్యక్రమాల నివేదిక, చదివిన కవితలు, ప్రసంగాల సంక్షిప్త సమాచారం వుండేలా చక్కటి ప్రణాళిక రచించాలని తీర్మానించారు. అలాగే సాహితీ స్రవంతి 15 వ వార్షికోత్సవం జూన్ 14-15 తేదీలలో జరుగవచ్చునని దానికి ఒక ప్రత్యేక సంచికకై కవితలను, వ్యాసాలను, జూన్ నెల 5 వ తేదీలోగా బి.వి,.కె. గ్రంథాలయ నిర్వహకుడు, సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు కపిల రాంకుమార్ అందించాలని తెలియచేసారు. కె. ఆనందాచారి మాట్లాడుతూ కాలానికి, కవిత్వానికి వున్న బంధం, సంబంధం రాజకీయలాకి, సాహిత్యానికి కూడ అవినాభావ సంబంధం వుండటం నేడు అనివార్యం అని నొక్కి చెప్పారు. మతం, కులం, స్త్రీ పురుష తేదాలు, వివక్షతలపై పోరాటం మన సాహితీకారులు చేయాలన్నారు. రెండు నెలల వ్యవధిలో వివిధ మాధ్యమాల ద్వారా దేశాన్ని ఊదరగొట్టి, ప్రభావితంచేసిన రాజకీయ ప్రకంపనం ఓ వ్యక్తి చుట్టూనే తిరిగి రాజకీయాలను ప్రబావితం చేసి కోట్లాదిమందికి ఆరాధ్యుడుగా ఎదగటంలో సఫలీకృతుడవడం ఎంత ఆశ్చర్యం. ఏండ్ల తరబడి ఉద్యమాలు చేసిన వారిని ఎవరూ పట్టించుకోలేదంటే మీడియా ప్రభావం ఎంతుందో అలోచించాలి. సాంస్కృతికంగా కేంద్ర బిందువుగా ఇపుడు వారణాశి నెలవుకాబోతోంది. ప్రస్తుత సాంస్కృతిక వ్యవస్థపై దాడిచేయడానికే మతచాందసుల లక్ష్యంగా కనబడుతోంది. మనం సాహితీ సృజనకారులంగా ఆ దుష్ట వైఖరిని ముక్త కంఠంతో ఖండించాలి, పదునైన సాహిత్యంతో కలాలను నడిపించాలి. మన అధ్యయన వేదిక మరింత పరిపుష్టం చేసుకోవాలి. గత అనుభవాలను వర్తమానాలుగా మార్చుకొని మరింత మెళుకవతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఒక సూచన ఏదైనా కథా సంకలనం, కవితా సంకలనం, నవల, లేదా విమర్శనా గ్రంథం చదివి, దానిని అధ్యయన వేదికకు ఒకరు పరిచయం చేయటం, తదుపరి ఇతరులు చర్చించటం ఒక ఒరవడిగా పెట్టుకుందాం అని తన సందేశాన్ని ముగించారు. చివరగా ఆసు ప్రసాద్ పోలవరం ముంపు బాధితులపై ఒక పాట ఆలపించాడు. రౌతు రవి వందన సమర్పణ చేసారు. ---22.5.2014
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ksD7QH
Posted by Katta
by Kapila Ramkumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ksD7QH
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి