పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

5, మే 2014, సోమవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

సాగిపో.... | విష్వక్సేనుడు వినోద్ కష్టం నష్టం వచ్చాయంటూ ఒంట్లో సత్తువ వదలొద్దు... బాధా ధు:ఖం తరిమాయంటూ కంట్లో నెత్తురు రాల్చొద్దు... ఆవేశం కోపం కలిగాయంటూ శీఘ్రమే కుత్తుక కదపొద్దు... అలుపూ సలుపూ వచ్చాయంటూ గమ్యం తలుపులు మూయొద్దు... వెలుగూ నీడా కలిశాయంటూ వేదన కట్టలు తెంచొద్దు... వానకి వరద తోడైందంటూ తర్కానికి తిలోదకాలొదలొద్దు... చేతులు కట్టుకు కూర్చోకుండా చకచక ఎత్తులు సిద్ధం చెయ్... కాళ్ళకు బుద్ధిని చెప్పేయకుండా కుదురుగా నిలబడి యుద్ధంచేయ్... వెలుగుకు నువ్వే వాహనమయ్యి లోకం మొత్తం ప్రసరించేయ్... చిరునవ్వుకే నువ్వు బానిసవయ్యి చిగురించిన ఆశలను పాలించెయ్... 05/05/2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1saMvuv

Posted by Katta

Poornima Siri కవిత

పూర్ణిమాసిరి II సంచారి - పథికుడుII ఒక బాటసారిలా ముందుకు నడుస్తావో ఒక సాహసిలా జీవిస్తావో, ఆలోచనల్లోనే తేలియాడుతావో, ఆలోచనలకు ఆధ్యుడవవుతావో దారపుకండె వేరొకరికిచ్చి గాలిపటంలా ఎగురుతావో గమనవేగాన్ని పెంచే మలయమారుతంగా పరిణమిస్తావో అడుగులే వేస్తావో,అడుసులోకి కూలిపోతావో బాధ్యత నాదంటావో,హక్కులకే వాపోతావో నిన్ను నీవు తెలుసుకొని నిబ్బరంగా ఉంటావో ఊకదంపుడు మాటలకే నీఉర్విని రాసిస్తావో ఎవరూ తేల్చిచెప్పరూ...తేల్చుకోడానికీ రహదారినివ్వరూ కేవలం సంద్రపు తడి తెలిస్తేనే చాలదు దాని అలజడీ తెలిసినవాడే సమర్థ నావికుడు సమయపాలన స్వయంపాలన కొరవడి పథికులు కాలేనే జీవన సంచారులెందరో.. 5.5.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icIKl2

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

*కోర్ట్ చౌరస్తా అను ప్రేయసికి* ఓ మేరీ ప్యారీ బుల్ బుల్! కహా గయే ఓ దిన్! మూడు దారుల పాయల్ని కలిపి ఎంత సొగసైన నల్లటి జడ వేస్కుంటివి నువ్వు నిన్ను చూస్తూ చూస్తూ స్వప్నా కేఫ్ ల చాయ్ సిగరెట్ తాగుతూ తాగుతుంటే యవ్వనం రెండింతలై బుసలు కొట్టేది లేత మీసాన్ని మెలిపెట్టించి పొగల్లోంచి ఏ గాంధర్వ లోకాల్లోకో లాక్కు పొయ్యే దానివి లచ్చన్న పాన్ టేలాల మీటా ఇంటి కెళ్ళే దాకా రెండు పెదవుల్నితడిమి తడిమి అద్దేది కదే! నిత్తెం పెళ్లి కూతుళ్ళతో ముస్తాబైన రాజరాజేశ్వర కళ్యాణ మండపం ఎంత వైభవంగా మన గుండెల్లో మంగళ వాయిద్యాలు మొగించేదే! హాయ్ మేరీ ఖూబ్ సూరత్! చక్కదనాల నీ మొకం వక్కలు వక్కలై అర్థం గాని పజిల్ ఐపాయె గదా! ఎప్పుడూ కొన్ని తుపాకులు ముందూ వెనకా రాగా అనామక ఖైదీలు బేడీల్తో వెళ్తుంటే నిన్ను ముద్దాడుతారని సంకెళ్ళు వేసినట్టుండేది. ధర్నాలూ,రాస్తా రోకోలు జరుగుతుంటే అంబేద్కర్ నడిరోడ్డు మీదికచ్చి వాదిస్తున్నట్టుండేది. అబ్ తేరా చహరా అన్ జాన్ హో గయా! ఇప్పుడిక్కడ చాయ్ బిస్కట్లమ్మితే బతకలేం ఇప్పుడిక్కడ జాన్ ప్లేయర్స్, అడిడాస్, రీబాక్, లివైస్ లు చాలా వైజ్ గా జేబులు కత్తిరిస్తరు. హియర్ ఇటీజ్ రెడ్డీస్ రెసిడెన్సి ఓన్లీ! ఇప్పుడిక్కడ మాఊరి ఐలయ్య ఒంటి తువ్వాల తోటి పిచ్చి లేసి తిరుగుతుండు ఐనోడూ కానోడూ దండలేస్తుంటే అసలు దొంగలు వీళ్ళేనని అంబేద్కర్ వేలెత్తి చూపిస్తుండు శవాలకు చికిత్స చేసే ఆస్పత్రి చుట్టూ అభాగ్యులు మృత సంజీవని కోసం తిరుగుతుండ్రు కానీ మేరీ జాన్! జనాలు ఇవేవీ పట్టకుండా నీ కొత్త అందం వెనుక కుట్రలు తెల్వక పరుగు పరుగున పైసల కోసం ఉరుకుతుండ్రు హాయ్ మేరీ జాన్! నౌ యూ ఆర్ డెవలప్ద్ విత్ రూపీ ఫేస్ నౌ యూ ఆర్ కల్చర్డ్ విత్ మల్టీ నేషనల్ రోజ్ 05.04.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rUG2Sy

Posted by Katta

Rama Murthy Panuganti కవిత

andariki ide maa aahvanam!!!

by Rama Murthy Panuganti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss3210

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fLcFSF

Posted by Katta

Sriarunam Rao కవిత

"భారత రాజ్యాంగం అతుకులబొంత" అంటూ గాన్ విల్ ఆస్టిన్ భారతరాజ్యాంగాన్ని నిర్వచించాడని చదివినప్పుడు నేనెంతో బాధపడేవాడిని. దానికితోడుగా నెహ్రూ, ఆజాద్, పటేల్, అంబేద్కర్ వంటివారి నియంత్రణలో సాగిన మండలిగా కూడా ఆయన వర్ణిoచాడు దాన్ని. కానీ రాజ్యాంగం మనకు చెప్పిందీ, మనం దాన్ని అడ్డుగా పెట్టుకుని చేస్తున్నదానికి మద్యనున్న తేడాని చూస్తుంటే... ఆయన నిర్వచనాలే నిజమనిపిస్తుంటాయి అప్పుడప్పుడూ. దేశాన్ని సమూలనంగా మార్చగలిగే అవకాశం మనకు రాజ్యాంగం వలన లభించివుండొచ్చు. కానీ మరలా దాన్నీ..... దేశంలో వున్న "అన్నిటికీ" వ్రేలాడుతూ బ్రతుకీడ్చేచేలా చేశారేమో అనిపిస్తుంది ఇప్పటి దుస్థితి చూస్తుంటే. మనకు ఒక ఇల్లు కట్టే అవసరం ఏర్పడింది. దానికొరకు మనముందు కొత్త ఇటుకలూ, సిమెంట్ ఇంకా కావలిసినవన్నీ సమకూర్చుకునే అవకాశం కూడా వుంచబడింది. వాటితోపాటూ అంతకు ముందే కూల్చివేయబడిన పాత ఇంటి అవశేషాలూ ఆ పక్కగా వున్నాయి "మనం ఏం చెయ్యాలనుకుంటాం?" నూతనంగా కట్టే ఆ ఇంటిని అన్నీ నూతనాలే వాడి మరింత బలంగా కొత్తగా రూపొందించాలనుకుంటామా? లేక... పాతవి ఎలాగూ మిగిలిపోయాయిగా అనుకుంటూ ఆ అవశేషాలనీ కలిపి కడతామా? లేక... ఇవేమీకాదులే ఆ కట్టడం ప్రారంభిస్తూ మద్యలో మనకు ఏవి దొరికితే వాటితో కట్టేసుకుపోదామనుకుంటామా??? ఈ మూడింటిలో మీరైతే ఎలా కట్టాలనుకుంటారో అదే మీ కట్టడపు భవిష్యత్తు కదా. దాన్ని ముందు నమ్మండి. తరువాత మీకే కనుక రాజ్యాంగం రాసే అవకాశం వస్తే ఏది కోరుకుంటారో నిర్ణయించుకుని నిజాన్ని తెలుసుకోండి. ఇవి రెండూ మీరు మనస్ఫుర్తిగా ఆవాహాన చేసుకోగలిగితే రేపటి ఎన్నికల కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా బ్రతికించుకున్నట్లే. ప్రయత్నించిచూడండి. త్వరలో విడుదల కానున్న నా రచన "నా భారతీయం" నుండి శ్రీఅరుణం 9885779207

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ju9iP6

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBsyqR

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBnpPt

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fKFSNM

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట- 9 ____________________ఆర్క్యూబ్ అది పీడనకు పాడెలు గట్టిన యౌవన పర్వం ఆంబోతులకు ముకుదాల్లేసిన సాహసకాండ ఒంటిగ మునిగిన మోటారును గడ్డకు గుంజి కరెంటు పెట్టె ఉడుకుడుకు స్కందం కాలం పంటిమీదే జారిపోయే నవ నవోన్మేష సూక్తం అవి ఏ గుగ్గిల్లైన వాతాపి జీర్ణమే ఆ పంటిని తలచుకుంటే సీసాను బిగపట్టుకున్న మూత తాడు విడిచిన బొంగరమైద్ది పట పట పండ్లు కొరికితే ఉక్కే పిడికిలైద్ది తెల్లగుడ్డు నెత్తుటి చిత్తడైద్ది ఎక్కడికక్కడ నరందేలి పెయ్యి ఫిరైంగైద్ది మోరా గీరా అంతా ఇత్తడిత్తడైద్ది పొద్దు పుత్తడైద్ది ఊరంతా వీడుసరె అన్నారా అది పల్లతో కొట్టిన ఫస్ట్ ఇంప్రెషనే అంతెందుకు పగడం నవ్వుకు యుద్దమే చిచ్చు బుడ్డైద్ది పాలిపగ కాకరపుల్లైద్ది నోట్లే పండ్లున్నట్టు అన్నదమ్ములంతా పక్కపక్కనే ఉంటే రోజూ దసరనే మన తాతల పంటి చక్రం చూడు ! బొక్క కంకుతనే ఉంటది ఆ మీసాన్ని చూడు పిల్లనిస్తే ఇంకా చేసుకుందామనే అంటది పటుత్వం పరాచికం నాలుగు పాదాల నడుస్తుంటది నిజం! ముప్పొద్ద్దులా 'బొల్క బొల్క ' అట్టిగ పుక్కలిస్తనే చుచ్చూ పుచ్చూ చెంగోబిల్ల నిమ్మ తొక్కతో రుద్దుకుంటే ప్రియురాలికి పండ్లే చెక్కర బిల్ల పండ్లు అయస్కాంతం ! దుక్కలా ఎద్ద్దులా రంకెవేసే పన్ను ఏనుగుకున్న పన్ను అది ఖడ్గ మౄగం కొమ్ము వేనోళ్ళ పొగడ్తలు పాశ్చాత్యానికి కన్నుకుట్టింది నిమ్మలాన్ని ఆగంజేసి నిలబడి తింటేనే నాగరికతని ఊదరగొట్టింది ఇగేంది ? పొట్టల పేంటకు 'సై' అన్నంక ఇంటివంట 'సై'ఉంటదా? సాయమాను కూలింది ( ఇంకాఉంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTHqzf

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1iTHor2

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTHor2

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nXAmtj

Posted by Katta

Pulipati Guruswamy కవిత

బతుకుతున్న నీడలు // డా.పులిపాటి గురుస్వామి // నిజమే కదా? మనుషుల కంటే మనం ఇంక దేన్నో ప్రేమిస్తున్నాం మొత్తం నాటకమంతా గ''మ్మత్తు''గా నడవటానికి అసూయ నింపిన పాత్ర ఒక్కటి చాలు చిందర వందర వ్యక్తిత్వం పరుచుకోవటానికి పిసరంత ద్వేషం అంటుకుంటే మహా వలలు చాలా పరుచుకున్నాక హృదయానికి శ్వాస దొరకదు ఏ జీవీ భూమ్మీద ఇట్లాంటిది పోల్చుకోవటానికి నిలవదు అన్నీ ఎరికే ప్రకృతి మీదనో పచ్చనాకు మీదనో పూల గుత్తి మీదనో పాల మీగడ మీదనో పోటీకి దిగలేం పక్కనుండి చెయ్యందిచ్చిన వాన్నే వీపు వెనక నుండి విరిచేస్తాం ఎన్ని యుగాలు మారితేనేం ? సౌలభ్యం కోసమే పెనుగులాట ఎన్ని చదువులు పారితేనేం? స్వభావం విడువని ముసుగుబాట కేవలం జీవించటం లో దాగిన ఆనందాన్ని అవతలికి తిప్పి నటిస్తూ జీవిత కథను రక్తి కట్టిస్తున్నాం విషాదమైన విషాదం ఇంతకు మించి లేదేమో! ..... 4-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1igTgn5

Posted by Katta

Raghu Banda కవిత

నీవు కలవని అందరూ చెప్తున్నా.. కలవని నీకోసం చిరునవ్వుతో వేచిచూస్తున్నా.. నీ ఆలోచనలో కలకాలం నేనుంటా.. నీజీవితంలో కాకపోయినా నీ ఙ్ఞాపకాల్లో మాత్రం సజీవంగా నిండునూరేళ్ళు కొలువుంటా!!

by Raghu Banda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rTWeDv

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RjMmaE

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || స్వేద నాదం ..! || రుధిర మధనం నుండి ఘర్మజలం ఉప్పొంగుతుంది ఆకలి మంట మాత్రం ఆరనే ఆరదు ...!! కొండల్ని పిండి చేయగల నీ అఖండ శక్తి అయినా ‘దోపిడీ బండలు’ నీ బ్రతుకుని ముక్కలు చేస్తుంటాయి ...! చిరిగిన నీ వస్త్రాల్లోనుండి ఆధునిక గగనం అందంగానే కనిపిస్తుంది ! యుగాల నీ అశృగీతాన్ని పడమటి గానం పరిహసిస్తుంది ..!! అన్నం మెతుకుల చుట్టూ అల్లిన నీ జీవితం అల్లకల్లోలమవుతుంది అప్పులకు, ఆకలికి చావుతప్పని బాధామయ సాదృశ్యం !! అద్దాల మేడలు కట్టి మట్టి ముద్దలపై నిద్రిస్తావు! ‘ఏసీ’లను నిర్మించిన నీదేహం మండుటెండల్లో మాడుతూనే ఉంటుంది !! నింగి న౦టే ఆధునిక జగతి కి నీ రుధిరాశృవులే పునాదిరాళ్ళు !! సమాంతర పట్టాల్లా పీడిత వర్గం –పీడించే వర్గం !! చీకట్లోనుండి చిట్ట చివరిగా విప్లవాగ్ని సూర్యుడివై కదలిరా దోచుకుతినే రాబంద రాక్షస సంహారానికై ..... నాకలం నీ బలమై ఉంటుందిక !! -------- 4 – 5- 14

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fKbMtz

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆదాన ప్రదానాలతో ఎడద విశాలం Posted on: Mon 05 May 01:35:51.258821 2014 - కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్‌ ఆసక్తి, కఠోర పరిశ్రమ కలిస్తే నలిమెల భాస్కర్‌. అందుకు సాక్ష్యంగా మలయాళ నవల అనువాదం 'స్మారక శిలలు' నిలుస్తుంది. ఈ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భాస్కర్‌ పద్నాలుగు భాషలు నేర్చుకొని, ఇరుగుపొరుగు సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఆదాన ప్రదానాలు భాషల్ని సంపన్నం చేస్తాయి. అలాంటి ప్రక్రియను చేపట్టి సాహితీసేవ చేస్తున్న భాస్కర్‌ మంచి కార్యకర్త, నాయకుడు. అఖిల భారత తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షునిగా పని చేస్తున్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఎంతోమంది శిష్యుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన భాస్కర్‌, సాహితీరంగాన అనేకుల్ని ప్రోత్సహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రజాశక్తి 'సవ్వడి' పాఠకులకోసం ఆయనతో సంభాషణ... భాషలు నేర్చుకోవాలనే మీ ఆలోచనకు మూలం ఏమిటి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచీ కొంత విలక్షణంగా ఆలోచిస్తాను. మూస పద్ధతులు అసలు ఇష్టం ఉండవు. మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన పాశ్చాత్యులు భారతీయ భాషలు నేర్చుకొని ఆ భాషల్లో విశేష కృషి చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు దూరంగా ఉన్న విదేశీయులు భాషలు నేర్చుకొని ఇంత సేవ చేయగా లేనిది భారతీయులై ఉన్న మనం కొంతైనా అలాంటి పని చేయలేమా అన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా సాగింది నా భాషాధ్యయనం. పైగా నేను పనిచేసిన (ఉపాధ్యాయుడిగా) ఊళ్లో నాకు బోలెడంత సమయం. చదువుకోవడానికి ఒక గ్రంథాలయం లేని ఊరు. పత్రికలు రాని ఊరు (కొలినూరు). మరి అక్కడ కాలక్షేపం చేయడం పెద్ద సమస్య. అందుకని '30 రోజుల్లో కన్నడ భాష' అనే పుస్తకం పట్టుకున్నాను. ఏడాదికి ఒక భాష చొప్పున నేర్చుకున్నాను. నాకివాళ భారతదేశంలోని భాషలతో పరిచయం ఉంది. సంస్క ృత, ద్రావిడ భాషల మధ్యగల భేదం ఏమిటి? ఈ రెండూ భిన్నమైన సంస్కృతులకు సంబంధించిన భాషలు. సంస్కృతం చాలా భాషలకు తల్లి భాష కావచ్చునేమో కానీ ద్రావిడ భాషలకు కాదు. ద్రావిడ భాషలు ప్రధానంగా నాలుగు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. వీటిల్లో ఎక్కువగా సాహిత్యం వచ్చింది. ఇవి సోదర ద్రావిడ భాషలు. తెలుగు మధ్య ద్రావిడం. ఇంకా తుళ, కువి, కుయి, గోండు, బ్రాహాయీ వంటి భాషలు అనేకం ఉన్నాయి. సంస్కృతం ఇండో యూరోపియన్‌ భాష. సంస్కృతం, ఆంగ్లం, ఫ్రెంచ్‌, లాటిన్‌, గ్రీకు వంటి భాషలు సారూప్య సామీప్యాలు కలిగిన భాషలు. ప్రత్యేకించి మన దేశంలో ఉత్తరాది భాషలన్నీ సంస్కృతానికి దగ్గరే! సంస్కృతమూ, మూల ద్రావిడమూ (ద్రావిడ భాషలు ఇందులోంచే వచ్చాయంటారు) రెండూ భిన్న నేపథ్యాలు కలవి. వాటి వాక్య నిర్మాణ పద్ధతులు సైతం వేరు. సంస్కృతంలో కర్మణి వాక్యాలు ఎక్కువ. ద్రావిడ భాషల్లో కర్తరి వాక్యాల సంప్రదాయం ఉంది. 'ఏ రాముడైతే రావణున్ని సంహరించాడో అతడు అరవీర భయంకరుడు' వంటి యత్తదర్థక వాక్య పద్ధతి సంస్కృతానికి నప్పుతుంది. ఇదే వాక్యం ద్రావిడ భాషల్లో 'రావణుని సంహరించిన రాముడు అరవీర భయంకరుడు' అన్న విధంగా ఉంటుంది. కర్త, కర్మ, క్రియ... ఈ వరుసలో ద్రావిడ వాక్యం ఉంటుంది. సంస్కృతంలో ఏక, బహువచనాలేగాక ద్వివచనం అదనంగా ఉంటుంది. ద్రావిడ భాషల్లో ఈ వచనం లేదు. సంస్కృతంలో పదాలకు లింగం ఆపాదించే తీరు హేతువుకు అందదేమో అన్పిస్తుంది. ద్రావిడ భాషల్లో పురుషులైతే పుంలింగం, స్త్రీలయితే స్త్రీ లింగం, మిగిలినవన్నీ నపుంసక లింగాలు. ద్రావిడ భాషల అధ్యయనంలో లింగ విభజన పెద్దగా ఇబ్బందిని కలిగించదు. ఆదాన ప్రదానాల వల్ల భాషలకు జరిగే లాభ నష్టాలు ఏమిటి? ఆదాన ప్రదానాలు ఏ భాషకైనా లాభదాయకంగా ఉంటాయికానీ నష్ట సంధాయకాలు కావు. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి సాహిత్యం వచ్చినప్పుడు చాలా ప్రయోజనం కల్గుతుంది. ఉదాహరణకు మూల భాష నుంచి లక్ష్య భాషలోనికి సాహిత్యాన్ని దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ఇతరులతో పోల్చినప్పుడు ఎంతగా ముందుండిపోయాం, ఎంతగా వెనకబడిపోయామో తెలిసివస్తుంది. వెనుకబడ్డాము అనుకున్నప్పుడు మరిన్ని ఆదానాలు జరుగుతాయి. ముందున్నప్పుడు మన ద్వారా ఇతర భాషల్లోకి ప్రదానాలు జరుగుతాయి. ఈ ఎగుమతి దిగుమతులూ, ఇచ్చి పుచ్చుకోవడాలూ లేకపోతే మనిషి విశాల ప్రపంచంలో అడుగుపెట్టలేదు. ఆదాన ప్రదానాలకు మూలం అనువాదమే కదా! గోర్కీ 'అమ్మ'ను ఆస్వాదించడం అనువాదం వల్లనే కదా! ఇచ్చి పుచ్చుకునే ఈ ధోరణి వల్లనే ఒక సువిశాల సుసంస్కార సమాజం ఏర్పడుతుంది. మనిషి లోపలి సంకుచితత్వం కరిగిపోతుంది. ఎడద విశాలమవుతుంది. అనువాదం, అనుసృజనల అర్థాలు చెప్పండి? అనువాదం అంటే ఒక్క ముక్కలో మక్కీకి మక్కీ. అనుసృజన అంటే మక్కీకి మక్షికం, మక్కీకి ఈగ అని చెప్పడం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విషయానికి చ్యుతి జరగకుండా యధాతథంగా అనువదించాలి. ఇక్కడ స్వేచ్ఛానువాదం పనికిరాదు. అక్కడ అనువాదకుడు ఫ్రీ హ్యాండ్‌ తీసుకోలేడు. కానీ సాహిత్యానువాదంలో ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఒక మేరకున్నాయి. ముఖ్యంగా కాల్పనిక సాహిత్యంలో అనుసృజన మంచిది. నుడికారాలు, సామెతలకు మక్కీకి మక్కీగా అనువదించరాదు. ఉదాహరణకు మలయాళంలోని 'మూత్తోర్‌ చొల్‌ వాక్కుం ముతనెలిక్కయుం ముంబిల్‌ కైక్యుం పింబిల్‌ ఇనిక్కుం' అన్న సామెతను తెలుగులోనికి 'పెద్దలు చెప్పిన మాటా, ముదిరిన ఉసిరికాయా ముందు చేదుగా ఉంటాయి.. తర్వాత తియ్యగా ఉంటాయి' అని అనువదించాం అనుకోండి.. పాఠకులు నవ్వుకుంటారు. దాన్ని మనం తెలుగులోనికి 'పెద్దల మాట చద్దన్న మూట' అని అనుసృజించాలి. అనుసృజన అనేది సృజనను అనుసరించి సాగుతుంది. అనువాదమేమో మూలాన్ని అనుకరించి ఉంటుంది. కాల్పనిక సాహిత్యంలో అనుసృజనే మేలైనది. తెలంగాణా పదకోశం నిర్మాణ క్రమాన్ని చెప్పండి? ఈ పదకోశం ఒక పద్ధతి ప్రకారం నిర్మించింది కాదు. ప్రామాణిక భాషకు ఏ భాషా, యాసా, మాండలికమూ తీసిపోవు. దేని సొగసు దానిదే! తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా వచ్చిందే నా పదకోశం. దానికి ఒక పరిమితమైన ప్రయోజనం ఉంది. తెలంగాణ ప్రాంతంలోని చాలా పదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తయారైన, లేదా అంతకుముందు నిర్మితమైన నిఘంటువుల్లో చేరలేదు. అందుకని నేను కేవలం ఒక ఆరునెలల వ్యవధిలో నా జ్ఞాపకశక్తిని నమ్ముకొని ప్రామాణిక భాషలోని పదాన్ని తెలంగాణలో ఏమంటారు అని గుర్తుకు తెచ్చుకొని చేసిన పని ఇది. తెలంగాణ రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుగు అంటే మళ్లీ ఇప్పటిదాకా రాజ్యమేలిన ప్రామాణిక తెలుగు కాదు. తెలంగాణ రాష్ట్రంలో విధిగా అన్ని వ్యవహారాలు తెలంగాణ తెలుగులో జరగాలి. ఉదాహరణకు ప్రామాణిక భాషలోని 'జరగాలి' అన్న మాట తెలంగాణలో 'జరుగాలె' అని ఉంటుంది. 'క్యాబినెట్‌ భేటీ' అన్న సమాజం 'క్యాబినెట్‌ బైఠక్‌' కావాలి. తెలంగాణలో ఆ మాట చలామణీలో ఉంది. తెలంగాణ తెలుగులోనే పాలనా వ్యవహారాలు ఉన్నప్పుడు ప్రజల భాగస్వామ్యం సహజంగా ఉంటుంది. పరాయి మాట మన భావాన్ని అంతగా సరఫరా చేయదు. కన్వే చేయదు. అయితే తెలంగాణ తెలుగులోనే పాలనా వ్యవహారాలు, పాఠ్య పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండాలనేది అందరూ సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలో పరిపాలనలోనికి వచ్చే పాలకులు ఈ విషయాన్ని బాగా పట్టించుకోవాలి. సాహితీ ప్రపంచంలో నాయకుడిగా, కార్యకర్తగా పని చేశారు కదా? ఏది ఇష్టం? కార్యకర్తగా ఉండడమే ఇష్టం. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కింది స్థాయిలో పుష్కలంగా ఉంటాయి. బాధ్యతలు కూడా తక్కువే. నాయకులం అయినాక బరువు బాధ్యతలు ఇబ్బంది పెడతాయి. అలంకారప్రాయ నాయకత్వం అందరూ విమర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత అధ్యక్షుడిగా తెలంగాణ మలి దశ పోరాటంలో భాగంగా వచ్చిన 52 కవితల్ని 'ఉడాన్‌' పేరిట హిందీలోనికి అనువదింపజేశాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరం సభను నిర్వహించాం. ఇన్ని చేసినా నాకు ఇష్టమైంది మాత్రం ఒక మంచి కార్యకర్తగా ఉండటమే! వర్ధమాన రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి? బాగా అధ్యయనం చేయాలి. ఈర్ష్యలూ, అసూయలూ దరికి చేరనివ్వరాదు. ఒక కవిత రాస్తున్నామంటే.. ఆ విషయమ్మీద అంతకుముందు వచ్చిన కవితలన్నీ చదివి ఉండాలి. విలక్షణమైన పనులు చేయాలి. మనకు బాగా నచ్చిన, వచ్చిన పనులే చేయాలి. కీర్తికండూతుల కోసం వెంపర్లాట తగని పని. మనం సాహిత్యాన్ని సీరియస్‌గా భావించి కృషి చేస్తూ పోతున్న సందర్భంలో అవార్డుల్లాంటి గుర్తింపు వస్తే మంచిది. అంతేగానీ అవార్డుల కోసమే రాయడం అనే బలహీనతను అధిగమించాలి. సంభాషణ : డాక్టర్‌ బివిఎన్‌ స్వామి http://ift.tt/1j0apXj

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0aqKK

Posted by Katta

Chi Chi కవిత

_8_ ప్రాణులన్నై పరుచుకుని కుట్టబడిన తాడేదో ముడులేసుకోకున్నా అసలు తాకినా తాకకున్నా కలయికలో విడిపోని యుద్దాలే కథలన్నీ!! ప్రాణ పాలనలో తరిస్తున్న భూతాల మధ్య దూరమెంతంటే ప్రాణమే!! ప్రాణంతో కలిపి ఆరనుకోవాలి.. ఈ ఆరులేని చోటేదో యోచించే వీలిక్కడ లేదేమో ఉన్నదంతా ఈ ఆరింటికై అన్వేషణే మనమై!! దాటిపోదామనే తలపులో ఏముందో కానీ తలపైతే ఉంది ఆరింటికవతల!! >ఇప్పుడేంటి!! ఎంత పీక్కున్నా ఇంతేనని తెలిసాకే దైవమనే మోసం పుట్టిందేమో ఏమీ లేదనలేక ,లేదనుకోలేక!! అక్కడింకేదో ఉందన్న నమ్మకం లేకపోతే ఇక్కడుండలేమా? నమ్మకమే మోసమని తెలిసాక మోసాన్నేమనగలం? పాపం మోసం!! చేస్కోగలమని తెలియకపోతే మోసముండేది కాదేమో!! అది కూడా ఉంది ఏడో భూతమై ఆరింటికవతలకు మన తలపు దాటిపోకుండా!! >ఇంకేంటి!! ఏడింటెనక్కెల్తే?? ఒరిగేదేముండదు మోసపోకుండా ఉండగలమంతే కానీ మోసం చెయ్యగలం!! చా!! అయినా అంతగా మోసపోటానికి ఇక్కడంత తలకుమాసినోళ్లెవరూ లేర్లే!! అందరూ ఏడింటికవతలే ఉండి మోసం చేస్కుంటున్నారు ముందున్న ఆరింటి మీద ఆశతో.. అంటే మనిషి తలపు ఎనిమిదో భూతమనమాట అంతేనా!! తలపింకా వెనక్కెల్తే ముందుకు రాలేమెహే.. అక్కడున్నదే ఇక్కడంతా..8.. అంతే!!_______(5/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s8l0le

Posted by Katta

Swatee Sripada కవిత

1 ఎలా నడిచి వచ్చానో మరి నన్ను నేను చిటికెన వేలట్టుకు నడిపించుకుంటూ దుఃఖాలు వడబోస్తున్న చీకటి కనుపాపల మినుకు మినుకు వెలుగుల్లో తడబాటు అలలై చుట్టేసే తమకాలను వదిలించుకు సైకత స్వప్నాల హోరు గాలిలో తమాయించుకుంటూ ఎలా నడిచి వచ్చానో మరి ! కరిగి కరిగి నీరై ప్రవహిస్తూ, నిలువరించుకుంటూ రెపరెపల మధ్య పూరెక్కల పరవశాల పులకరింతల మధ్య కంటి రెప్పలకింద వికసించకుండానే వాడిపోయిన కసరు క్షణాలూ లోలోపల పొరల మధ్య అలసి అలసి కుప్ప కూలిన భావాలను పేర్చుకుంటూ, ఓదార్చుకుంటూ, సవరించుకుంటూ మైనపు ముద్దలా మరుగుతూ , చల్లారుతూ కాస్త కాస్త కాలం నీడల్లోకి నిశ్సబ్దంగా అదృశ్యమవుతూ ఎంత మిగిలి వచ్చానో ....... 2. ఇప్పుడిక రంగూ రుచీ వాసనా కోల్పోయి నిస్తేజంగా గుడ్లప్పగించి చూస్తున్న శీతాకాలపు సాయంసంధ్య నై ఉపరితలం పొడుగునా మౌనం గాజు అద్దాలు పరచుకు పలకరి౦తల వెచ్చని వెలుగు కిరణాలు వెనక్కి తిప్పి కొడుతూ లోలోపల నాకు నేనే ఒక ఆవిష్కరి౦చని ప్రపంచాన్నై’’ ౩. ఈ కొనకూ ఆ కోనకూ ఆద్యంతాలకు ముడివేసిన ఉలిపిరి సిల్కు దారపు వంతెన మీద వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచొచ్చిన అడుగులకూ ముందు నడవవలసిన దూరానికీ ఒకటే కొలమానం వెనక్కు నడిచినా ,ముందుకు కదిలినా దూరం ఒకటే అయినప్పుడు ఎలా నడిచి వెళ్ళాలో చివరి అడుగు వరకూ

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWD4PP

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // తనూ ఒక పొయినే.... // రాలిపోయే ఒక కాలం పొయి పువ్వులు నా కాళ్ళ కింద పచ్చని తివాచీలై మెత్తగా స్వాగతిస్తుంటాయి అనిపిస్తుంది తనూ ఒక పొయి నేనని పూసే కాలంలో మరింత స్వేచ్ఛగా పట్టరాని అందంతో ఆనందంగా విశృంఖలంగా విరగ పూస్తాడు అవధులులేని స్వేచ్చా కాంక్షల సౌందర్యంతో సమ్మోహన పరుస్తాడు రాలే కాలానికి చిగురించేదేమి లేనట్లు ఒక్కసారి ఆకాశ మంతా పరుచుకున్న పువ్వులను క్షణకాలంలో నేల రాల్చి నివ్వెరపరుస్తాడు ఆగిపోనివంటూ ... రాలిపోనివంటూ ....కాలంతో కరిగిపోని వంటూ లేవని దుఖిస్తానా ఇక ఎక్కడో జీవం తనలో . చిగురించే కాలంలో పొయి కొమ్మకి ఆకుపచ్చని ఆకులా ఇప్పుడు నాకు ఖచ్చితం గా తెలుసు తనూ ఒక పొయి నేనని ..... Date: 05/04/2014 (The amazing Poui tree spotted in jamaica .there are natuarally three blooms a year. (scientific name Tabebuia)

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWD3v3

Posted by Katta