పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట- 9 ____________________ఆర్క్యూబ్ అది పీడనకు పాడెలు గట్టిన యౌవన పర్వం ఆంబోతులకు ముకుదాల్లేసిన సాహసకాండ ఒంటిగ మునిగిన మోటారును గడ్డకు గుంజి కరెంటు పెట్టె ఉడుకుడుకు స్కందం కాలం పంటిమీదే జారిపోయే నవ నవోన్మేష సూక్తం అవి ఏ గుగ్గిల్లైన వాతాపి జీర్ణమే ఆ పంటిని తలచుకుంటే సీసాను బిగపట్టుకున్న మూత తాడు విడిచిన బొంగరమైద్ది పట పట పండ్లు కొరికితే ఉక్కే పిడికిలైద్ది తెల్లగుడ్డు నెత్తుటి చిత్తడైద్ది ఎక్కడికక్కడ నరందేలి పెయ్యి ఫిరైంగైద్ది మోరా గీరా అంతా ఇత్తడిత్తడైద్ది పొద్దు పుత్తడైద్ది ఊరంతా వీడుసరె అన్నారా అది పల్లతో కొట్టిన ఫస్ట్ ఇంప్రెషనే అంతెందుకు పగడం నవ్వుకు యుద్దమే చిచ్చు బుడ్డైద్ది పాలిపగ కాకరపుల్లైద్ది నోట్లే పండ్లున్నట్టు అన్నదమ్ములంతా పక్కపక్కనే ఉంటే రోజూ దసరనే మన తాతల పంటి చక్రం చూడు ! బొక్క కంకుతనే ఉంటది ఆ మీసాన్ని చూడు పిల్లనిస్తే ఇంకా చేసుకుందామనే అంటది పటుత్వం పరాచికం నాలుగు పాదాల నడుస్తుంటది నిజం! ముప్పొద్ద్దులా 'బొల్క బొల్క ' అట్టిగ పుక్కలిస్తనే చుచ్చూ పుచ్చూ చెంగోబిల్ల నిమ్మ తొక్కతో రుద్దుకుంటే ప్రియురాలికి పండ్లే చెక్కర బిల్ల పండ్లు అయస్కాంతం ! దుక్కలా ఎద్ద్దులా రంకెవేసే పన్ను ఏనుగుకున్న పన్ను అది ఖడ్గ మౄగం కొమ్ము వేనోళ్ళ పొగడ్తలు పాశ్చాత్యానికి కన్నుకుట్టింది నిమ్మలాన్ని ఆగంజేసి నిలబడి తింటేనే నాగరికతని ఊదరగొట్టింది ఇగేంది ? పొట్టల పేంటకు 'సై' అన్నంక ఇంటివంట 'సై'ఉంటదా? సాయమాను కూలింది ( ఇంకాఉంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTHqzf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి