పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || స్వేద నాదం ..! || రుధిర మధనం నుండి ఘర్మజలం ఉప్పొంగుతుంది ఆకలి మంట మాత్రం ఆరనే ఆరదు ...!! కొండల్ని పిండి చేయగల నీ అఖండ శక్తి అయినా ‘దోపిడీ బండలు’ నీ బ్రతుకుని ముక్కలు చేస్తుంటాయి ...! చిరిగిన నీ వస్త్రాల్లోనుండి ఆధునిక గగనం అందంగానే కనిపిస్తుంది ! యుగాల నీ అశృగీతాన్ని పడమటి గానం పరిహసిస్తుంది ..!! అన్నం మెతుకుల చుట్టూ అల్లిన నీ జీవితం అల్లకల్లోలమవుతుంది అప్పులకు, ఆకలికి చావుతప్పని బాధామయ సాదృశ్యం !! అద్దాల మేడలు కట్టి మట్టి ముద్దలపై నిద్రిస్తావు! ‘ఏసీ’లను నిర్మించిన నీదేహం మండుటెండల్లో మాడుతూనే ఉంటుంది !! నింగి న౦టే ఆధునిక జగతి కి నీ రుధిరాశృవులే పునాదిరాళ్ళు !! సమాంతర పట్టాల్లా పీడిత వర్గం –పీడించే వర్గం !! చీకట్లోనుండి చిట్ట చివరిగా విప్లవాగ్ని సూర్యుడివై కదలిరా దోచుకుతినే రాబంద రాక్షస సంహారానికై ..... నాకలం నీ బలమై ఉంటుందిక !! -------- 4 – 5- 14

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fKbMtz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి