పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Boorla Venkateshwarlu కవిత

*కోర్ట్ చౌరస్తా అను ప్రేయసికి* ఓ మేరీ ప్యారీ బుల్ బుల్! కహా గయే ఓ దిన్! మూడు దారుల పాయల్ని కలిపి ఎంత సొగసైన నల్లటి జడ వేస్కుంటివి నువ్వు నిన్ను చూస్తూ చూస్తూ స్వప్నా కేఫ్ ల చాయ్ సిగరెట్ తాగుతూ తాగుతుంటే యవ్వనం రెండింతలై బుసలు కొట్టేది లేత మీసాన్ని మెలిపెట్టించి పొగల్లోంచి ఏ గాంధర్వ లోకాల్లోకో లాక్కు పొయ్యే దానివి లచ్చన్న పాన్ టేలాల మీటా ఇంటి కెళ్ళే దాకా రెండు పెదవుల్నితడిమి తడిమి అద్దేది కదే! నిత్తెం పెళ్లి కూతుళ్ళతో ముస్తాబైన రాజరాజేశ్వర కళ్యాణ మండపం ఎంత వైభవంగా మన గుండెల్లో మంగళ వాయిద్యాలు మొగించేదే! హాయ్ మేరీ ఖూబ్ సూరత్! చక్కదనాల నీ మొకం వక్కలు వక్కలై అర్థం గాని పజిల్ ఐపాయె గదా! ఎప్పుడూ కొన్ని తుపాకులు ముందూ వెనకా రాగా అనామక ఖైదీలు బేడీల్తో వెళ్తుంటే నిన్ను ముద్దాడుతారని సంకెళ్ళు వేసినట్టుండేది. ధర్నాలూ,రాస్తా రోకోలు జరుగుతుంటే అంబేద్కర్ నడిరోడ్డు మీదికచ్చి వాదిస్తున్నట్టుండేది. అబ్ తేరా చహరా అన్ జాన్ హో గయా! ఇప్పుడిక్కడ చాయ్ బిస్కట్లమ్మితే బతకలేం ఇప్పుడిక్కడ జాన్ ప్లేయర్స్, అడిడాస్, రీబాక్, లివైస్ లు చాలా వైజ్ గా జేబులు కత్తిరిస్తరు. హియర్ ఇటీజ్ రెడ్డీస్ రెసిడెన్సి ఓన్లీ! ఇప్పుడిక్కడ మాఊరి ఐలయ్య ఒంటి తువ్వాల తోటి పిచ్చి లేసి తిరుగుతుండు ఐనోడూ కానోడూ దండలేస్తుంటే అసలు దొంగలు వీళ్ళేనని అంబేద్కర్ వేలెత్తి చూపిస్తుండు శవాలకు చికిత్స చేసే ఆస్పత్రి చుట్టూ అభాగ్యులు మృత సంజీవని కోసం తిరుగుతుండ్రు కానీ మేరీ జాన్! జనాలు ఇవేవీ పట్టకుండా నీ కొత్త అందం వెనుక కుట్రలు తెల్వక పరుగు పరుగున పైసల కోసం ఉరుకుతుండ్రు హాయ్ మేరీ జాన్! నౌ యూ ఆర్ డెవలప్ద్ విత్ రూపీ ఫేస్ నౌ యూ ఆర్ కల్చర్డ్ విత్ మల్టీ నేషనల్ రోజ్ 05.04.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rUG2Sy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి