పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

Pusyami Sagar కవిత

బాల్యం నానీలు ... _______ మిత్రుడు ఇచ్చిన పాత మాస పత్రిక లో ("పత్రిక ") నానీలు కనిపించాయి ...అవి ఎంత గా హత్తుకున్నాయి అంటే .వాటి గురించి ఏదైనా రాయాలి అనిపించిది ...శేషం సుప్రసన్నచార్యులు గారు రాసిన నానీ లు బాల్యం ఎంత దురవస్థ లో ఉన్నదో తెలియ చెప్పే ప్రయత్నం కన్పించిది ....ముఖ్యం గా కార్మికుడికి (బాల ) ..మరి కాన్వెంటు విద్యార్ధి కి అట్టే తేడా లేదు ఇద్దరు మోస్తున్నారు బరువు లు అంటారు ఓ చోట .... కాన్వెంటు స్టూడెంట్ //బాల కార్మికుడు తేడా లేదు ///ఇద్దరు బస్తాలు మోస్తారు ....!! నిజమే కదః ....చిన్న వయసు లో నే బండెడు బరువు లను మోయిస్తున్న మన విద్యా వ్యవస్థ ...భావి పౌరులను తాయారు చేస్తున్నదో లేదో తెలియదు కాని ఖచ్చింతంగా కూలి లను మాత్రం తాయారు చేసే కర్మాగారం అయిపోతున్నది కదా... లేత బాల్యం వీపు పై //పుస్తకాల బురువు పర్వాలేదు ఫ్యూచర్ లో //కూలి నెంబర్ వన్... పేదరికం లో ఉన్నవాడికి జబ్బు వస్తే ....గుండె కి చిల్లు పడి దీనావస్థ లో ఉన్నవాడికి ప్రేమా తో అనురాగం తో వాడి జీవితాన్ని ..గుండె ను రెండి టి ని ప్రేమ తో పూడ్చాలి ..అది నిజంగా జరిగితే ఎంత బాగుండు ను కదా... డబ్బు కరిచిన బాల్యం //గుండెకు చిల్లు పొడిచింది ... ప్రేమాబ్ఘిమానలతో //పూడ్చాలి ... నేతలు మాటలను కోటలను దాటిస్తారు ...ఎక్కడ ఏ అన్యాయం జరిగిన ముందు ఉంటారు ఎప్పుడైనా వారి దృష్టికి బాల కార్మికుల వెతలను తీసుకు వస్తే ...చర్యలు తీసుకుంటాము అంటారు ...కాని చిత్రం ఏమిటి అంటే..అదే ఇంట్లో బోలెడు మంది పిల్లలు పని చేస్తూ వుంటారు ...డబ్బు ఉన్నవాడి చేతి లో బాల్యం మరి చితికిపోతుంది ....ఒక మనిషి లా గ కూడా చూడరు !!!! బాల్యం నేతల //కోతల్లో నే కాదు ఉన్నవారి చేతల్లో //కూడా బంది అయింది ...!! ఆద్యంతం మనసు కరిగించేలా వున్నా ఈ నానీ లను అక్కున చేర్చుకోవడం నాకు చాల ఆనందం గా వున్నది ..శేషం సుప్రసన్న చార్యులు వారు ఎక్కడ వున్నా ...ఇలాంటి మంచి కవితలను రాసి సామాజిక స్పృహను తేవాలన్నది అభిలాష ...ఇప్పుడు "పత్రిక ! (మాస ) ...వెలువడుతున్నదో లేదో నాకు తెలియదు కాని ...ఈ పత్రిక మరల పునః ప్రచురణ పొందితే నేను చాల సంతోషిస్తాను ..మరోసారి ఇంత మంచి పత్రిక ను అందించన మిత్రుడు కి ధన్యవాదాలు ... బాల్యం నేతల /కోతల్లో నే కాదు ఉన్నవారి చేతల్లో / కూడా బంది అయింది ! లేత బాల్యం వీపు పై //పుస్తకాల బరువు పర్వాలేదు ఫ్యూచర్ లో //కూలి నెంబర్ వన్ !!! డబ్బు కరిచిన బాల్యం //గుండెకు చిల్లు పొడిచింది ... ప్రేమాబ్ఘిమానలతో //పూడ్చాలి ... లేత బాల్యం వీపు పై //పుస్తకాల బురువు పర్వాలేదు ఫ్యూచర్ లో //కూలి నెంబర్ వన్... కన్పించని శ్రమ జీవి /బాల కార్మికుడు కన్పించే బాల కూలి //కాన్వెంటు విద్యార్ధి ___ శేషం సుప్రసన్న చార్యులు సెలవు పుష్యమి సాగర్ (మే 1, 2014)

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o70NKi

Posted by Katta

Panasakarla Prakash కవిత

కదా..! నిత్య౦ నేను నా ప్రేమలో మునిగిపోతూనే ఉ౦టాను ఎల్ల‌ప్పుడూ నేను నా ఊహల్లో తేలిపోతూనే ఉ౦టాను ఎక్కడైనా సరే నేను నాతోనే ఉ౦టాను ఎ౦దుకో నన్ను నేను బాగానే అర్ధ౦ చేసుకు౦టాను ఒప్పు చేసినప్పుడు నన్ను నేనే అభిన౦ది౦చుకు౦టాను తప్పు చేసినప్పుడు నన్ను నేనే క్షమి౦చేసుకు౦టాను నాలా నన్ను ప్రేమి౦చడ౦ ఎవ్వరికీ చేత కాదు ఎవ్వరినో నా అ౦త‌ ప్రేమి౦చడ౦ నాకూ చేతకాదు స్వార్ధ౦తో ప్రేమి౦చే కొన్ని వ౦దలమ౦ది మధ్యలో నన్ను నిస్వార్ధ౦గా ప్రేమి౦చేవాడిని నేనే........... పనసకర్ల‌ 1/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fBRRwK

Posted by Katta

Venu Madhav కవిత

నా మదిలో నీ హృదయ స్వరాలూ సాగర అలలు వాలే సవ్వడి చేస్తు సంగీతం పలికిస్తుంటే, మాటలే పలుకుని నా హృదయం నీ మధుర భావాలతో సప్త స్వరాలూ పాడుతూ ఆ సాగర అలల ఒడిలో నా మనసు తడిసి అలిసిపాయింది మీ వేణు

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lDqwKK

Posted by Katta

Kranti Virasam కవిత

నా దగ్గరకు రావడానికి విసుగు చెందనివాడు నేను వెళ్ళినప్పుడు ముఖం తిప్పుకోనివాడు ఏ కూడలి వద్దనో నన్ను చూడడం కోసం ఆపేక్షగా ఎదురు చూసే ఒక్క మిత్రుడుంటే బాగుండేది - ఆశా రాజు

by Kranti Virasam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i1NjKA

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవితలు: 1. ....|| గులాబి ॥.... గులాబి గుండెలోని గుప్త నిధి నీ ఎద సంపదే. వెదజల్లు దాన్ని రోజా లా అంతే, నీ బాధ ఆమె స్వంత బాధై పోతుంది . ఒక పాటలోనో ఒక మహా ప్రణయాభీష్టం లోనో చల్లు ఆ నిధిని. ఆపకు ఆ గులాబీని ఆపావా , ఆ అగ్నిలో నీవు ఆహుతి. ( ఆదివారం ఆంధ్రప్రభ Dt:13.04.2014లో ప్రచురితం) 2. ....॥మలిసంజ ॥.... నా హృదయం మైనమౌతున్నది మెత్తగా ,కరిగే కొవ్వత్తిలా . నా రక్త నాళాలు చిక్కని తైలాలు ద్రాక్షాసవ ప్రవాహాలు కావు . అణచబడిన నా మెతక బ్రతుకు పారిపోతున్నది గజెల్లా జింకలా. 3. ....||పరంజ్యోతి ॥.... వృధాగా యత్నిస్తున్నావు నా పాట పీక నొక్కాలని లక్షలాది పిల్లలు నా పాటను ఏక కంఠం తో పాడుతున్నారు కోరుస్ గా సూర్యుని కింద. వృధాగా శ్రమిస్తున్నావు నా గీతాన్ని విరిచెయ్యాలని: ఎంతో ఆర్తి తో పాడుతున్నారు పిల్లలు దేవుని చెంత. ('సూర్యుడు' భగవంతునికి, 'పిల్లలు' తన అభిమానులకు ప్రతీకలు) (ఆదివారం ఆంధ్రప్రభ Dt:20.04.2014 ) మూలం :గాబ్రియేలా మిస్ట్రాల్ (చిలీ దేశ నోబెల్ లారియెట్ ) . తెలుగు సేత : నాగరాజు రామస్వామి. ---Dt: 01 .05.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHgJOj

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అంతరంగ తరంగం -------------------రావెల పురుషోత్తమరావు నన్ను క్షమించండి. నా కవితను మన్నించండి. తరత్రాలుగా చెల్రేగుతున్న అంతరంగాలను అన్వేషించండి. అంగళ్ళలో రతనాలను అమ్మిన తరం నాదికాదు. అంగనల అంగాంగ సౌందర్యాన్ని బహిరంగా అమ్ముకుంటూ నిలువుదోపిడీ ని నిరంతరం సాగిస్తున్న దోపిడీ గావిస్తున్న నిష్కృష్టపు తరం నాది. సమాజపు సౌశీల్యానికి సాహిత్యపు పౌరోహిత్యం నిర్వహిస్తూ సోదరభావాన్ని నెరపిన తరం నాదికాదు. సన్మానపు సం రంభంలో అశ్లీలానికీ అసభ్యానికి సాగిలబడిపోతున్న తరం నాది. తిమిరంతో సమరం జరిపి జగతిని వెలుగు వెన్నెలకు వేదికగా నిలిపుకున్న తరం నాది కాదు. విశాలాంధ్ర భావాలకు వెన్నుఫోటు పొడిచి స్వార్ధాన్నీ సంకుచితత్వాన్నీ సమూలంగా పెనవేసుకున్న నంగి నంగి మాటల నాజూకు తరం నాది. =================01-05-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1u8P5TK

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి కుండ నాకు నవ్వుతూనే ఉండాలని ఉంటుంది నవ్వుతూ ఉంటే నాకు సంతోషమే కావచ్చు కానీ నాలో ఉండే మనసుకి కాదు కదా అందుకే రోధిస్తూ ఉంటాను నాలో ఉండే కుండ ఖాళీ అవుతూ ఉండాలి కదా తనకి దు:ఖం వచ్చినప్పుడు కన్నీటితో నిండడానికి; అందుకే గుండెలో నీళ్ళు నిండడానికి, నవ్వినప్పుడు కూడా కళ్ళల్లోంచి నీటిని ఒంపుతూ ఉంటాను నాలో ఉండే అనంతమైన దాహార్తిని సంతృప్తి పరుచుకోవడానికి రోధిస్తూ ఉంటాను నన్ను నేను ఖాళీ చేసుకుంటూ........ కన్నీటి ప్రవాహానికి నన్ను నేను తెరుచుకుంటూ! 01May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rSj3cG

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ట్రాన్స్ఫార్మర్ హార్ట్ !! మితిమీరిన ఆశలకు కళ్ళెంవేస్తూ జీవితపు సరిహద్దులు చేరపనీయక సున్నితపు అనుబంధాలకు సన్నని రాగితీగల బంధనాలతో చుట్టబడి ఆలోచనా చలానాలను నియంత్రిస్తూ తార్కికాయస్కాంతత్వానికి లోబడి స్పందించే ట్రాన్స్ఫార్మర్ హృదయం నాది!! మెదడూ మనసుల భావజాల వికేంద్రీకరణకు అనుక్షణం అడ్డుకట్ట వేస్తూ అంతులేని కోర్కెలకు మనోకారాగారంలో నిరాశావాద ఖడ్గంతో శిక్షిస్తూ చిరునవ్వును కవచంగా ధరించి అనంతానంత దూరాలు సంచరిస్తున్నా!! శూన్యాన్ని శరీరంలో దాచుకొని సన్యాసిభావాల ఆత్మకి సహనంతో సమాధి కట్టి సుదూర తారలను చేజిక్కించుకోవాలని నా హృదయ దారాల నిచ్చెన జారవిడుస్తున్నా!!

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rIJoru

Posted by Katta

Chi Chi కవిత

_డోలు_ తల్లి తండ్రులు కన్యాత్ములు..తాత బ్రహ్మచారి వాళ్లంశలో పుట్టిందో గూడచారి గుట్టు గోడలు కాళ్ళకింద రట్టు చేసుకుంటూ ఊరెళ్ళబెట్టిన నోరేస్కుని గాలితో కాపురం చేస్తుంటే తుమ్మిన ఉమ్మునెతుక్కుంటూ తిరుగుతున్న ఓ రాయి గూడచారి కంట్లో పడింది!! గాలినొదిలేసి రాయెంట పడుమ్ముతుంటే రాజుకున్న రాయి రాజయితే అయ్యింది కానీ తిరగడమాగింది!! తాను తుమ్మిన ఉమ్మిదేనా అన్న దిమ్మ తెగుల్లో రాజు నిమ్మకు నీరెత్తనట్టుంటే అడవి తోలునంతా పీకి అంటించుకుని కనిపించిన రాళ్లమీదంతా పడి డోలై మోగుతూ ఒళ్ళు తెలియకుండా పోయి ప్రాణం జారి రాజు మీద పడబోయిందా గూడచారి ఉమ్మేస్తూ.. రాజు కదిలే!! అడివినొదిలి పోతుంటే అడిగిందా డోలు మెడకు తగిలించుకోమని అడవంతా తగలేసిన డోలే తప్ప మరేమీ కనిపించక గొడవకొచ్చిన గాలి దెబ్బకి ఇంకో తుమ్మొచ్చ్చి ఉమ్మునెతుక్కుంటూ పోయాడా రాజైన రాయి డోలైన గూడచారిని గాలికే వదిలేసి!! అయినా డోలుకి సందివ్వలేని రాజెందుకు..సందులే లేని గాలుండగా

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mhhdCZ

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SdtgUQ

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ఎటు! నీ గమ్యం ఎటు? _________________రావెల పురుషోత్తమరావు వాధ్రా వైపా గోధ్రా చూపా? కటకటాల రుద్రయ్యా? కర్రెంట్ కాల్పుల చంద్రమా? ఎటు! నీ గమ్యం ఎటు? --01-05-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R3mrnT

Posted by Katta

Kompella Sarma కవిత

మహాకవి మహారాజశ్రీ శ్రీ శ్రీ ఆకృతి సామాన్యం, వ్యక్తిత్వం అసామాన్యం అప్పలకొండ దంపతులకు వంశాకురం శ్రీరంగం కుటుంబానికి దత్తత పార్శ్వం ఫలితంగా ‘శ్రీరంగం శ్రీనివాసరావు’ పోట్టిపేరు శ్రీశ్రీ, పేరులోనే విన్నూత్నం ‘శ్రీ’ కి ‘శ్రీ’ కి మధ్య దూరం అగణితం. చదువు సంధ్యలు, విసిరేసే విశాఖ తీరాన ఒకటిన్నర దశాబ్దపు ప్రాయంలోనే వివాహం దత్తపుత్రుడికి దత్తకూతురు జీవన ప్రవేశం అర్థపుష్కరకాలం తర్వాతే జంతుశాస్త్రంలో చదువు డిమాన్స్ట్రేటరు, ఎడిటర్ తొలి కొలువులు రేడియో, మిలిటరీ, నిజాం నవాబు, ఆంధ్రవాణి జీవనయానానికి ఉపయోగిత ఉద్యోగాలు కలాయుదులు ఊహలతో కాగితంపై రాసుకుంటూ పోతారు బరకడం, గీకడం తో తెల్లకాగితాన్ని నలుపు చేసుకుంటారు వెయ్యేళ్ళకోసారో, వేలకొక్కరు వేలుతో కలంకుంచె కదుపుతారు కవితను, కవితాత్మను వేదికపై ఖచ్చితంగా ఆవిష్కరిస్తారు అసంకల్పితచర్యలా హిమగిరి ప్రతిభారోహణం చేసేస్తారు సాహితీ శిఖరాగ్రాన కవనపు మహాప్రస్థాన గానం చేస్తారు ఆ గాననాదఝరికి జగన్నాథుని రథచక్రాలూ కదులుతాయి విదేశాలు కూడా గళాన్నిస్తాయి, దశదిశల్ని మార్చివేస్తాయి. శీశ్రీ లో, రచనల్లో, చిత్రగీతాలు, కవితలు, ప్రహేళికలు, వ్యూలు, రివ్యూలు, ఉపన్యాసాలూ, కథలు, కథనాలు విశ్వసించిన సిద్ధాంతాన్ని రాద్దాంతం చేయక రాపిడిపెట్టి సమైక్యవాదాన్ని సగర్వంగా నమ్మిన కృషీవలుడు విదేశాలకు తన వాదాన్ని వేదంలా అందించాడు వారేవః కేకలను వింటూ వాడి వేడితనాల్ని పంచాడు అరసం, విరసం వేదికేదైనా ‘గురజాడ అడుగుజాడ’న్నాడు సంప్రదాయాన్ని ‘ప్రభవించి’ గ్రాంథిక చందోవిహారం చేయించాడు బాటసారి, భిక్షువర్షీయసి అంటూ ‘హరోంహర’ మహాప్రస్థానం చేశాడు ఖడ్గసృష్టితో చరమరాత్రిని నిర్మించి, ఒకటికింకొకటిని కలిపినా ఒకటేనన్నాడు వ్యూలు, రివ్యూలు, ప్రివ్యూలతో రెక్కవిప్పిన రివల్యూషన్ సృష్టించాడు విశాలాంధ్రలో ఉక్కుపిడికిలి, అగ్నిజ్వాలతో ప్రజారాజ్యాన్ని వీక్షించాడు తెలుగువీరుని మేలుకొలిపి, సంఘ శతృవుల్ని ఖబడ్డారన్నాడు మనసున మనసై, ‘హలో హలో’ ఓ అమ్మాయి! అంటూ దరి చేరాడు హృదయంలో నిదురించే చెలిని వయారి మయూరిలా ఆరాధించాడు వ్యాసక్రీడల్ని ఆడిస్తూ, వ్యక్తికి బహువచనం శక్తన్న సాహితీ అగ్రగణ్యుడు అల్పంలో అనల్పాన్ని, శిల్పశ్లేషప్రాసల్ని జోడీకరించాడు శబ్దప్రయోగాల్లో నవ్యత, ప్రజతో శతచాతురోక్తుల్ని విసిరాడు అష్టావర్షప్రాయంలోనే కవితాప్రచురణా దన్నుని చూపించాడు స్వదస్తూరితో, స్వీయగాలంతో మహాప్రస్థానాన్ని సుస్థిరం చేశాడు తనను తాను సమీక్షించుకొని దార్శనికతని స్వీయదర్శన మొనర్చాడు సౌదామినిని సంపంగితోటకు తరలించి మరోప్రపంచాన్ని చూపించాడు ఊరికేనా అంటే ఊరికే, ఒక నాటిక రాయమంటే ఏనాటికైనా రాస్తానన్నాడు తెలుగు జాతీయ భాష దురభిమానం లేని అభిమతం అన్న భాషాభావకుడు హాల్డేన్ భావాభిరామాల్ని నల్దిక్కులా ప్రతిభా ప్రచారం కావించిన ప్రవీణుడు తిక్కవేమగురజాడలను కవిత్రయపు హోదాలో నిలిపిన భాషాప్రేమికుడు అక్షరాల్ని ముత్యాలసరాలుగా ముగ్ధసమ్మోహన పరచిన నిత్యాక్షరమూర్తి సాటితోటి కవుల్లోని సశాస్త్రీయాన్ని, కృష్ణశాస్త్రీయాన్ని చవిచూశాడు ప్రపంచపు బాధ అంతా తన బాధ అంటూ యోగ్యతాపత్రాన్ని పొంది చావ ఉంటేనే చదవాలన్న చలం సవాల్ విసిరేలా చేసిన చైతన్యమూర్తి తేదీలు, దస్తావేజులు చరిత్రసారం కాదంటూ చెణుకుల్ని చెరిగాడు తెలుగు సాహిత్యాన్ని ఆయన శాసేస్తే, తెలుగు సభల పరాభవం పొందాడు ఆరేడుపదుల వసంతోత్సవాలకు విశాఖ కాకినాడ వాడల పుణ్యం సరిసములులేనితనంతో కావన సాహితీజీవనం, అనంత ఆత్మకథనం రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషా శ్రవణం శతాబ్దపు కవన ప్రకంపనాన్ని తూచక అనుభవించి పలవరించమన్నాడు తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం, పొరుగింటి పుల్లకూర బహురుచి శ్రీవాణీతో తెలుగుసాహితీభారతి శుభారంభం, శ్రీశ్రీవాణి యుగపు మలుపు నూతన కవితా భగీరధుడు, సాహితీ మార్క్స్, మానవత్వ ప్రవాహ నదం గురుజాడ త్రివేణీసంగమ గురజాడ, చలంల సహచరుడు, కవి, మనీషి, ప్రపంచాగ్నికి, విశ్వసృష్టికి, భువనఘోషకి నేను సైతం అంటూ సొంతగొంతు నిచ్చిన నాద విద్వాంసుడు, ఆధునికాంధ్ర రథసారధి తన భావనా కవిత్రయాన్ని పరకాయప్రవేశం కావించుకున్న మంత్రగాడు తన రచనల్లో లోక ప్రతిఫలం, తన తపస్సు ఫలించే, జాతిజనుల గీతమంత్రకారుడు వినుతించే, విరుతించే, వినిపించే నవీనగీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం సర్వనాద మూల బిందువైన ఋతమే ప్రణవమన్న ప్రవచకుడు ‘ఆలోచన నా ఉనికికి సూచన’ అన్న మరణం లేని శ్రీశ్రీ, జనన మరణాల మధ్య విరామం శ్రీశ్రీ మరల అవతరిస్తాడన్నది తథ్యమైతే, మరో తోకచుక్క పొడవక తప్పదన్నది సత్యం శ్రామిక ప్రజా జైత్ర యాత్రాపతాక కాకా తప్పదు అన్నదీ కానున్న వాస్తవమే. శ్రీశ్రీ మరో మహాప్రస్థానాన్ని సృష్టించి, తప్పక అందిస్తాడు, అవశ్యం చదివిస్తాడు, విశ్వప్రజ మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి మరో యోగ్యతాపత్రానికి . ఏమో, ఎవరికెరుక? శ్రీశ్రీ-చలం అచలంగా, అచంచలంగా యుగళంగా దర్శనం ఇస్తారేమో! ‘అశీతి’ సంబరాలు జరుపుకుంటున్న వైనంలో మహాప్రస్తానపు మహోన్నత ఘనం ఏ శాతాబ్దంలోనైనా ఏకైక తెలుగు మహాకావ్యం – మహాప్రస్థానం సాగించే మహా ప్రస్థానం శ్రీ శ్రీ జయంతి సందర్భంగా – కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించే ప్రయత్నం రాబోయే దీపావళి కాంతులు ‘శ్రీశ్రీలా విరజిమ్ముతూ, తారాజువ్వల్లా అంబరాన్ని ముద్దాడాయి. శ్రీశ్రీది మహా వ్యక్తిత్వం – శ్రీశ్రీది మహాకావ్యం – మహాప్రస్థానం, మరోప్రపంచం శ్రీశ్రీది సాహితీ జగతిలో మహాభినిష్క్రమణం – పురిపండా అప్పలస్వామి మధుగుళికలు. మహాకవికి శతసహస్ర ప్రనామాలతో అక్షర నీరాజన నమస్సుమాంజలులు ‘మనిషితనపు మహాస్రవంతి’ మహారాజశ్రీ శ్రీ శ్రీ కి వందనాలర్పిస్తూ – “ప్రపంచమును పరిహసిస్తాం – భవిష్యమును పరిపాలిస్తాం” (కొంపెల్ల శర్మ – తెలుగురధం – సాహిత్య్హ,సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్)

by Kompella Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PTnjdv

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా.........మానవుడు అఖండ దొ0గ చరిత్ర మొదలవుతున్న బ్రహ్మండ రాత్రి చె0డాడి ఖండ ఖంఢలుగా విభజి0చి హత మార్చబడిన శరీరాలు.... పారతో వరం చెక్కినట్టు చెక్కలు చెక్కలుగా కొయ్యబడ్డాయి.... వాళ్ళు సూర్యుళ్ళు చీకటి సూర్యుళ్ళు నియంతత్వం వహి0చి ప్రపంచాన్ని పాలిస్తున్న సూర్యుళ్ళు దోసిటిలో వెలుగుని ని0పుకొని,ఎవరికి కనిపి0చకు0డా... బ్రతికేలా భయపెట్టే కృర చీకటి సూర్యుళ్ళు. మానవుడు నరసి0హుడి అవతారం ఎత్తి పేగులు బయిటికి తీసి చెట్టుకి వేలాడదీసి వినోది0చాడు. ఇప్పుడు మానవుడు సాక్షత్ ముక్కోటి దేవుడు. 01-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rIiCzr

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా.........మానవుడు అఖండ దొ0గ చరిత్ర మొదలవుతున్న బ్రహ్మండ రాత్రి చె0డాడి ఖండ ఖంఢలుగా విభజి0చి హత మార్చబడిన శరీరాలు.... పారతో వరం చెక్కినట్టు చెక్కలు చెక్కలుగా కొయ్యబడ్డాయి.... వాళ్ళు సూర్యుళ్ళు చీకటి సూర్యుళ్ళు నియంతత్వం వహి0చి ప్రపంచాన్ని పాలిస్తున్న సూర్యుళ్ళు దోసిటిలో వెలుగుని ని0పుకొని,ఎవరికి కనిపి0చకు0డా... బ్రతికేలా భయపెట్టే కృర చీకటి సూర్యుళ్ళు. మానవుడు నరసి0హుడి అవతారం ఎత్తి పేగులు బయిటికి తీసి చెట్టుకి వేలాడదీసి వినోది0చాడు. ఇప్పుడు మానవుడు సాక్షత్ ముక్కోటి దేవుడు.

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rIiAYx

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

జరా... _________________________ సారవంతమైన దుఃఖాన్ని నిర్మించాక పడకగదినీ ,మంచాన్ని వదిలి వర్షం ఒంటరిగా వెళ్లిపోతుంది ఏవో కొన్ని క్షణాలు వర్తమానాన్ని భరించలేక కళ్ళుమూసుకున్నట్టు నటిస్తూ ఎవరికీ తెలియకుండా అలామిగిలిపోతాయి మరణించడానికి తుఫానెందుకు..? నిన్ను నికు దూరం చేసే కొన ఊపిరి చాలదూ..? మూర్ఖంగా పొద్దున్నే రాత్రిని కడిగేసుకుంటాం గానీ వెంటనీడలా రాకుండా ఒక్కడుగన్నా వేయగలమా..? మిడిల్ పిన్నులో ఎంతకాలం దాక్కుంటావ్ నిన్నెప్పుడో కొసలు జార్చిపడేసాయి చూసీ చూసీ కళ్ళులోపటికెళ్ళిపోయి చూపుచుట్టూ గడ్డం పెరిగినట్టు చీకట్లు ఆకాశానికీ నాకూ దూరం పెరిగి పోయింది తుదిశ్వాసను సాధన చేస్తూ ఇప్పుడు ఆసుపత్రిలో వెలుగుతో ఆత్మహత్య చేసుకున్నమంచం ..

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0ggGJ

Posted by Katta

Lingareddy Kasula కవిత

ఏకాంత మధుసేవ|| డా// కాసుల లింగారెడ్డి || 01-05-2014 సహచరులెవ్వరు లేకుండానే పూకొమ్మల మధ్య ఒంటరిగా కూర్చొని మధుపాత్ర చేతికి తీసుకుంటాను నేను చెయ్యెత్తి చంద్రునికొక ఛీర్సుకొడతాను అప్పుడు, తను,నేను, నా నీడ కలిసి ముగ్గురమవుతాము. కాని, చంద్రుడు త్రాగడు నా నీడ నిశ్శబ్దంగా నన్ను అనుసరిస్తుంది నా నీడతో, చంద్రుడితో నేను సంతోషంగా వసంతకాలపు అంచులదాకా ప్రయాణిస్తాను. నేను పాడితే చంద్రుడు నాట్యం చేస్తాడు నేను నృత్యిస్తే నా నీడ కూడ నాట్యం చేస్తది. మేము నిశ్చింతగా జీవన సంతోషాల్ని పంచుకుంటాము తాగిన తర్వాత తమతమ దారుల్లో విడివడుతుంటాము నిత్య సంచారులమే అయినప్పటికీ మేము నిరంతర స్నేహాలము మరొక వెన్నెల వీధిలో మళ్ళీ కలుస్తాము. -డా|| కాసుల లింగారెడ్డి 1 ఎఫ్రిల్‌ 2014 సెల్‌: 8897811844 ( LIPO ‘DRINK ALONE’ అను కవితకు స్వేచ్చానువాదము)

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5JXeO

Posted by Katta

Maheswari Goldy కవిత

|| హి మ నీ జ ల తా ర లు || మహేశ్వరి గోల్డి. మానస సరోవరిలో మధురస హిమనీ జలధారలతో తడిసిన మల్లెపూల వనములు పట్టుపూల కాంతి తోరణాలతో అల్లిన ఊహల ఊయలలు పారవశ్యపు నదీ తీరాన వెన్నెల కాసారపు ఒడిలో వసంత కోయిల గీతాలాలాపనకు ఊపిరి వేణువులయి శ్వాసిస్తున్న,,,,,,,,,,,,,,,,,, చలువరాతి కవనాలయంలో చంద్రవదన సమీరాలు నటరాయుని కొలువున నవలావణ్య కిశోరాలు అమరావతి నదీ తీరాన ఆణిముత్యములు....!! పాలసంద్రంలో ప్రణయ సుధను సేవించిన ప్రాణశిలలకు నగిషీలద్దాలని...!! ఆశతో నేలకు రాలిన మిన్నంటిన అక్షర నక్షత్రాలు...... ప్రభాతాన సూర్యకాంత పుష్పాలుగా విరిసి రమణీయ కుంచెలతో చేస్తున్న వెన్నెల సంతకాలు.........!! పంచెవన్నెల రామచిలుకల గుహలో రాగ దీపాలయి కవ్విస్తూ అక్షర సాగరాన నవనవల కాంతిలో విరాజిల్లే తారా దీపాలు........!! మన ప్రేమదీవిలో నిక్షిప్తమయిన అమరదీపాలేనా ఓ ప్రియధరా...!! 01/05/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iG3KMP

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

అంతులేని దౌర్భాగ్యం. 1 ఒకప్పుడు మంచి పంచ రాజకీయాలుండేవి ఇప్పుడు కోట్ల కేట్ల రాజకీయాలొచ్చాయి 2 నిక్క రేసుకున్నా నిక్కచ్చి కార్యకర్తలానాడు లిక్క రేసుకుని కిక్కులో ముక్కి మూల్గే ఉపాది కార్యకర్తలీనాడు 3 నాడు ఓటును అమ్మలా నమ్ముకునే వాళ్ళు నేడు నోటుకు వాజమ్మలా అమ్ముకుంటున్నారు 4 అది దేశానికి సౌభాగ్యం ఇదీ దేశానికీ దేహానికీ అంతులేని దౌర్భాగ్యం. 5 ఇంకా చూస్తూ కూర్చుంటే లాభం లేదు గొంతు కేవలం తింటానికేనా.. !?

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iG3I7t

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

అంతులేని దౌర్భాగ్యం. 1 ఒకప్పుడు మంచి పంచ రాజకీయాలుండేవి ఇప్పుడు కోట్ల కేట్ల రాజకీయాలొచ్చాయి 2 నిక్క రేసుకున్నా నిక్కచ్చి కార్యకర్తలానాడు లిక్క రేసుకుని కిక్కులో ముక్కి మూల్గే ఉపాది కార్యకర్తలీనాడు 3 నాడు ఓటును అమ్మలా నమ్ముకునే వాళ్ళు నేడు నోటుకు వాజమ్మలా అమ్ముకుంటున్నారు 4 అది దేశానికి సౌభాగ్యం ఇదీ దేశానికీ దేహానికీ అంతులేని దౌర్భాగ్యం. 5 ఇంకా చూస్తూ కూర్చుంటే లాభం లేదు గొంతు కేవలం తింటానికేనా.. !?

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ScULxO

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

ఏప్రిల్ 20 న ఆంధ్ర నాటక కళా సమితి, విజయవాడ వారు ప్రదానం చేసిన శ్రీమతి తటవర్తి వరలక్ష్మి స్మారక పురస్కారం అందుకుంటున్న డాక్టర్ సి. భవానీ దేవి.

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pRfiGO

Posted by Katta