సొన్నాయిల నరేష్కుమార్ //ఏం మనిషో// కెరీర్ గ్రాఫ్ లో ఈమూలనుంచీ ఆ మూలదాకా సాగిన గీత ముడతలు పడకుండా మాంజాదారంలా బిగదీసుకుపోయి మనసులెండినా ప్రవహించటం మానని మనుషులు.. చల్ హట్..! పోరా నాయనా..! ఎవడికీ కాళ్ళు లేవిప్పుడు కార్లొచ్చాక చే గువేరా మొహమ్ముందు పొగలు కక్కే సిగార్... కాదురా బాబూ అది బండి సైలెన్సర్... ఆ సామ్రాజ్యవాద వ్యతిరేకిని అవమానిస్తూ గుప్పున ఎగిసిన నల్ల పెట్రోల్ పొగ.. రేకుడబ్బాలకీ,బీరు కీశేలకీ సల్లటి ఐస్కిరేయ్.... రేయ్..రేయ్..!! మురికి నా...డకా..! ఇక్కడెవడూ చీకడు నీది ఇప్పుడు కలర్ పేపర్లో పొట్లం కట్టిన శీతాకాలం యాభై రూపాయలే... అదిగో... నడీ రోడ్డు మీద పుచ్చ పువ్వులా విచ్చుకొని వెచ్చని రక్తాన్ని ఉమ్మేసిన మెదడొకటి ట్రాఫిక్ అంతరాయానికి సంతోషిస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ తో టీవీ గాడు... ఎర్రని లైటొకటి పసుపుగా బిక్కమొకమేయగానే ఆగరా.. ఇంకా దానికళ్ళు పచ్చ బడనేలేదు ఆగరా...నీ... డిజిటల్ కెమెరాలో బండి పృష్టాన్ని బందిస్తూ ఒక్కసారిగా పెళ్ళుబికిన లోహభూత ధూమ భూయిష్ట ప్రవాహానికి వెనకడుగేసిన శాంతి వర్ణపు దేహమొకటి.. పాంథుడా...! చూడకు చూడకటు నీలో ఎక్కడో ఉన్న మనిషిని లేపే బిచ్చగాడొస్తాడేమో ఆశగా.. నీ జేబుని ఈర్షగా చూస్తూ "చుట్టూ పక్కా చూడకురా చిన్నవాడ" .... చచ్చిపోతున్న సూర్యుడు కృష్ణ లోకింకి పోయాక ఇంటికొచ్చి అశాంతంగా సంతోష జీవితాన్ని ఆస్వాదిస్తుంటే హూహ్... ! అతనేంటీ..!? రోజూ ప్రేమ కావాలీ.., మనుషుల ఆప్యాయతాళింగనం కావాలీ అంటూ... ఇంకా మనిషిలానే ఉండిపోయాడు పాపం హవ్ ఫన్నీ మాన్ హి ఈజ్ ఒహ్..! గాడ్..!! బ్లెస్ హిం ప్లీస్ రేయ్...! గార్డ్...!! త్రో హిం ఔట్... 28/02/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jE1kSm
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jE1kSm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి