నరేష్కుమార్ //ప్రేలాపన// ఎలా చెప్పమంటావ్ నేనిపుడు అనంత కృష్ణానంత శర్వనినని స్నేహితా...! నిజమే పగిలిన కాలంలోంచి జారిపడ్డ క్షణాలని మళ్ళీ కోశాగారానికెత్తలేను కాలి రాలిన ధూపపు ధూమాన్ని మళ్ళీ మునుపటిలా మూటకట్టలేనుకదా అందుకే రాలిపడని మాటలనీ కూలిపడ్డ కోటగోడలనీ మళ్ళీ నిర్మించలేను నేను వెలివేసిన వెలుగును దాటి ఈ శాశ్వత చీకటి నుండి బయల్వెడలని తామసి తనయున్నయాక ఇంకెందుకు..!? నీ అశాశ్వత వెలుగు కిరణాల మూటలు నాకు నేనిపుడో కాలిపోయిన దేహాన్ని కావొచ్చు వెలుగుని భహిష్కరించిన దేశాన్ని కావొచ్చు కానీ....... ఇప్పుడు నేనో నిజాన్ని అబద్దపు వెలుగు రేకలకావలి నిశ్శబ్దపు కృష్ణ వర్ణపు రాతిరిని ఊహించకెపుడూ ఇకనా జ్వాజ్వల మానపు రక్త జ్వలనా కాంతులని కుహూరుత శీకరాల రవాలని వెలిగి వెలిగీ ఆరిపోయిన చితిని. 17/4/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eShnbp
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eShnbp
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి