పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // జీరో డిగ్రీ! // అతను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కానీ మనుషుల్లో కొద్దిగా ఒరిజినాలిటీ కోసం వెతికాడు- మాటల్లోనూ, చేతల్లోనూ, అడుగుల్లోనూ, అనుకోకుండా ఎదురయ్యే ఒక బిచ్చగాడికి ఔదార్యంతో స్పందించే తీరులోనూ. ప్రేమలోనూ, కోపంలోనూ, రాగంలోనూ, ద్వేషంలోనూ, పాత బస్ స్టాండ్ లో అనేకానేక సంవత్సరాల తర్వాత తారసపడ్డ ప్రియురాల్తో జరిపిన సంభాషణలోనూ. "ఉహూ... లాభం లేదు. అనుకరణ ఆకాశం నుండి అవని దాకా కమ్మేసింది" అంటూ గొణుక్కున్నాడు. పిల్లాడికి పీచుమిఠాయి బండి గంట వినిపించినంత ప్రియంగా తోచేది, ఒకప్పుడు మనుషులు వస్తున్న అలికిడి. తేరిపార చూడ్డం, కొంత వాళ్ళకు తెలిసీ, మరికొంత వాళ్ళకు తెలీకుండా ఫాలో అవడం, ఫాయిదా లేదని తెల్సుకుని మనాదించడం... "ముసుగులే ఎక్కువ లొసుగుల్ని చూపిస్తాయి మేకప్పే మేని వికృత స్వరూపాన్ని పట్టిస్తుంది లేనివి ఉన్నవిగా చూపెట్టే కొద్దీ ఉన్నాయని అనుకుంటున్నవి లేనివిగా తెల్సిపోతుంది" బయటకే అన్నాడు. చుట్టూ ఎవరూ కనిపించలేదు కానీ, అతనికి "చుప్ బే సాలే" అని ఎవరో గట్టిగా కసిరినట్టు వినిపించింది! 17.11.2012

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cENBJg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి