పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మే 2014, బుధవారం

Mohan Rishi కవిత

మోహన్ రుషి // రెండుగురం // నాకు నేనుగా కలిసిందీ కాదు. నువ్వు నన్ను పిలిచిందీ కాదు. అకస్మాత్తుగా, అనివార్యంగా. చూళ్ళేదని తప్పించుకోడానికి వీల్లేని ఒక క్షణంలో జరిగిందది. పేలిన మాటలు, జరిగిన గొడవ, తెగిన స్నేహం... ఒక రీల్ లా గిర్రున తిరగడం లాంటిదేదీ సంభవించలేదు. కనీసం నాకైతే. సందిగ్ధంలోనే ఒక అసంకల్పిత ప్రతీకార చర్యలా పలకరించుకోడం. దాన్ని దాటి ముందుకెళ్ళాలో లేదో తెలీని పునరాలోచనలో పడ్డం. మెదడులో ఉక్కపోత. మనసులో యుద్ధం మోత. తప్పుకుపోదామనే నిశ్చయం దిశగా. ఆ అడుగులు నీవా, నావా?! అంతలోనే తడబాటు, ఆలోచనల గ్రహపాటు. జరిగిందేదో జరిగిపోయిందన్న ఒక తేలిక వాతావరణానికి తెర తీస్తే... మరుక్షణం మనమెక్కడ?! మనదైన ఆరామంలో ఉన్నాం. ఆరాంగా ఉన్నాం. గతమంతా ఇప్పుడు కేవలం ఒక 'గ్యాప్'కం గా మిగిలున్నాం! 21.5.2014

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko9IqQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి