|| వానలోకం || ఊహించనిరోజున ప్రియమైనవ్యక్తి ఎవరో నీ గుమ్మంలో నిలబడినట్టు ఈ వేసవి ఉదయం లేచేసరికి నీ ఇంటిచుట్టూ వానపంజరం చెట్ల ఆకులమీద వాన, కొమ్మలమీద వాన, వాన నీటిమీద వాన, నీటిలోని ప్రతిబింబాలమీద వాన వాననెమలి నీ ఇంటిచుట్టూ పురివిప్పి తిరుగుతున్నపుడు నీ ఇల్లు అరణ్యంలో వున్నట్లూ సరిహద్దులులేని మరోలోకంలోకి నువ్వు ప్రవాసం వెళ్ళినట్లూ వుంటుంది మూగవెలుతురులో మునిగిన ప్రపంచం ఇప్పుడు ఆటలన్నీ కట్టిపెట్టి వానధ్యానంలోకి తనని కోల్పోతుంది కాసేపు జీవితమంటే నీ మనోలోకాల గోల కాదని వెళ్ళిపోతున్న ఆకాశాన్ని కన్నార్పక చూడమనీ చెప్పీ, చెప్పీ విసుగు పుట్టినట్టు చల్లని చినుకై చరిచి నీకంటిన నల్లని కాలాన్ని కడుగుతుంది వాన నువ్వు మనిషిలా రాకపోయి వుంటే వానవై పుట్టేవాడివనుకొంటాను బహుశా, లోకపు ఏ కొలతలోనో నువ్వొక వానవయ్యే వుంటావు లేకుంటే వాన కురిసినపుడల్లా నీకు దిగులు ముసురుకొన్న చల్లని సంతోషం ఎందుకు కలుగుతోంది __________________________ ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి 22.6.14 http://ift.tt/Uukkew http://ift.tt/Uukjax
by Bvv Prasad
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rlxhC7
Posted by Katta
by Bvv Prasad
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rlxhC7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి