ఒక కవిత దగ్గర విజయకుమార్‌గారి ఆలోచన విన్నాక, మళ్ళీ నేను కొన్ని విషయాలు పునరాలోచిస్తున్నాను. మనిషికి రెండు ప్రపంచాలున్నాయి. బాహ్యమూ, ఆంతరమూ. రెండింటిలోనూ సుఖదు:ఖాలున్నాయి, బోలెడంత కన్ ఫ్యూషన్ ఉంది. బోలెడు చీకటి ఉంది. బాహ్య ప్రపంచ కవిత్వాన్ని సామూహిక/ సామాజిక కవిత్వమని, అంత:ప్రపంచ కవిత్వాన్ని వ్యక్తిగత కవిత్వమనీ.. అంటున్నాము. అవగాహనా సౌలభ్యం కోసం ఇలా విడదీస్తాము కాని, సామూహిక సమస్యల వల్ల కలిగే వేదనని
ఒక వ్యక్తి (కవి) కేవలం తన దు:ఖం గా మార్చుకొన్నపుడు మాత్రమే అతనిని నుండి శక్తివంతమైన కవిత్వం వస్తుంది. ఇది మనకందరకూ తెలుసు. అంటే సామూహిక వేదన వైయక్తిక వేదన అయింది కదా. అలాగే, ఒక వ్యక్తి తన లోపలి ప్రపంచంలో కలిగిన వేదనని, సమాజం లోని ఇతరవ్యక్తుల లోపల కలిగె వేదన గా మార్చినపుడే కదా, అది చదివిన ఇతరులూ అతనిలా దు:ఖిస్తారు. అంటే కవి ఏడుస్తున్నాడని ఏడవక, తన లోపలి వేదనని కవి కనుగొన్నాడని కదా, అతనికి ఆ కవిత చదివినపుడు వేదన కలుగుతుంది. కొందరు social to personal కొందరు personal to social ప్రయాణిస్తారు. అంతిమం గా, ఈ రెండు పద్దతులూ, మానవ హృదయాన్ని తాకేందుకు, ఈ రెండు సరిహద్దుల్నీ తాక వలసే ఉంటుంది కదా. అప్పుడు ఏది personal ఏది social. ఒక కవిత ఉన్నతిని నిర్ధారించేందుకు, అది personal or social అనేవి గీటురాళ్ళుగా వాడవద్దని ఈ మాటలు. అయితే మరేవి నిర్ధారిస్తాయి? ఒక social pain ని కవి ఎంత personal చెయ్యగలిగాడు, లేదా ఒక personal pain ని కవి ఎంత social చెయ్యగలిగాడు అనేవి కవి అనుభూతి సాంద్రతనీ, ప్రతిభనీ పట్టిస్తాయి గనుక, How deeply effective or How much intensity expressed అనేవి ఉత్తమ కవిత్వానికి ఒక లక్షణమని నా నమ్మకం. రెండవది, How thoughtful it is and How constructive, it will be అనేది. ఒకడు సామూహిక కవితని కొట్టు, నరుకు, చంపు అనిరాస్తే, దాని పర్యవసానాలు, సమాజం పై ఎలా ఉంటాయి. అలాగే ఒక ఆంతరిక కవి తన శృంగారవాంచని ఉద్రేకం కలిగించేలా రాస్తే, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి. ఉపరితల ఉద్రేకాలని ప్రేరేపించే ఏ కవిత్వమైనా అంతిమం గా సమాజ వినాశనానికే దారితీస్తుంది. సమాజం లోని అసమానతల పట్ల దు:ఖం కాని, మనిషి లోలోపల మెదిలే జీవితమంటే ఏమిటి, దీనికి లక్ష్యమేమిటి అనే అస్తిత్వ వేదనతో నిండిన దు:ఖం కాని, కవి సమస్త మానవుల్నీ తన కుటుంబంగా, తన తోడబుట్టిన వారిగా, తన బిడ్డలుగా భావించి.. కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నంత జాగ్రత్తగా, బాధ్యతగా, వివేకంతో, పర్యవసానాల పట్ల ఎరుకతో వ్యక్తీకరించినపుడు అది తప్పనిసరిగా ఉత్తమ సృజన అవుతుంది కాని, social or personal అనే labels ఒక కవితని గౌరవనీయమైనదిగా చేయలేవని నా నమ్మకం.
s సంబంధించి, personal poetryలో ఒక సౌలభ్యం వుంది అనిపిస్తుంది నాకు .... .....ఈ కవితలలో కవి తన వ్యక్తిగత అనుభవాలనీ/అనుభూతులనీ relatively సునాయాసంగానే పోయెం చేసుకుంటూ పోతాడు/పోతుంది .... అదే ఒక సామాజికాంశాన్ని కవిత్వం చేయాలనుకున్నపుడు, personal poetry రాసినపుడు ఫీలయిన ఒక సౌకర్యం లాంటిది (రాసిన దాంట్లో 'కవిత్వాంశ' మెరవడం) ఏదో మిస్ అయినట్టు వుంటుంది .."
ఒకానొక కవితను చదివిన సందర్భం లో నేను నా వ్యాఖ్య పోస్ట్ చేసాను ... ఆ సందర్భాన్ని మినహాయించి, నా వ్యాఖ్యల్ని 'isolated ' గా ప్రస్తావిస్తే కొంచెం ఆశ్చర్యపోయాను...అంతే!...నా
మొత్తం కామెంట్ కి కేంద్రకం లాంటి ఈ వ్యాఖ్యని ఇక్కడ మళ్ళీ యిస్తున్నాను (చదవని మిత్రుల కోసం)
"అయితే, ఇన్నేసి కవితలు చదివే క్రమం లో నన్ను వెంటాడిన ప్రశ్న..... 'ఏ సామాజిక అంశాలూ ఈ తరాన్ని కదిలించడం లేదా?' అని... 'ఆధునిక కాలంలో వ్యక్తిగత కవిత్వమూ, సామాజిక కవిత్వమూ వేరు వేరు కాదు' అనే వ్యాఖ్య 'కొంతవరకూ మాత్రమే' నిజమని నా భావన....
ఉదాహరణకు, స్త్రీ వాద కవయిత్రి 'వంటిల్లు' గురించి రాస్తే అది పైకి వైయక్తిక కవిత్వంలా తోస్తుంది గానీ అది సామాజిక కవిత్వం కదా!...అలాగే, ఒక దళితుడు తాను కుల పరంగా ఎదుర్కొన్న అవమానాలని గురించి పోయెం లో చెప్పుకుంటూ పోయినపుడు కూడా ! .....కానీ, సఫలం కాని తన ప్రేమని గురించి కవిత్వం రాస్తే?....బహుశా, నా ఈ ఆలోచనల నేపథ్యంలోనే అనుకుంటా...... Sreekanth Aluru కవిత నన్ను ఆకర్షించింది ....."
మీ మాటల్లో నా వ్యాఖ్యని చెప్పాలంటే 'personal to social ' ప్రయాణాలు కనిపించినట్టుగా 'social to personal ' ప్రయాణాలు కనిపించడం లేదు ఎందుకన్నదే ప్రశ్న!....అంతః ప్రపంచం లోని చీకటి/దుక్కమూ కవిత్వం అయినంతగా బాహ్య ప్రపంచం లోని చీకటి /దుక్కం కవిత్వం ఎందుకు కావడం లేదన్నదే సందేహం!
"ఒక social pain ని కవి ఎంత personal చెయ్యగలిగాడు, లేదా ఒక personal pain ని కవి ఎంత social చెయ్యగలిగాడు అనేవి కవి అనుభూతి సాంద్రతనీ, ప్రతిభనీ పట్టిస్తాయి".....& "social or personal అనే labels ఒక కవితని గౌరవనీయమైనదిగా చేయలేవని నా నమ్మకం" అన్న మీ వ్యాఖ్యల తో కవిత్వం లో కాస్తో, కూస్తో ... చిన్నదో, పెద్దదో దూరం ప్రయాణించిన నాకు ఏకీ భావం లేకుండా ఎలా వుంటుంది?.....అందుకే కదా "ఏ కవిత్వం అయినా అంతిమంగా కవి తాను 'ఇక కవితగా మారి, బయటకు రాకుండా ఉండలేని స్థితి' నుండే వొస్తుంది /
రావాలి" అన్నాను.....................
..........................
.................., ఒక అర్థవంతమైన, అవసరమైన చర్చను ముందుకు తీసుకు వెళ్ళినందుకు మీకు, యితర మిత్రులకు ధన్యవాదాలతో...!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి