రాంప్రసాద్ బిస్మిల్ రాసిన ఈ గజల్ అష్ఫాఖుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, షహీద్ భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య యోధుల నోట్లో ఎప్పుడూ ఉండేది.నిజంగా వాహెద్ భాయ్ అనువాదానికి నేను శిరసువంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాం ప్రసాద్ బిస్మిల్ గారి గొప్ప దేశ భక్తి గీతానికి , మీ గొప్ప అనువాదం తోడైంది. ఎంత గొప్ప గజల్ ఇది . ప్రతి భారతీయుడూ తప్పక చదివి నిత్యం మననం చేసుకోవాల్సిన గీతమిది. subhash Koti గారు రాంప్రసాద్ బిస్మిల్ రాసిన ప్రముఖ గజల్ అనువాదం రాయమని చెప్పారు. సాధ్యమైనంత వరకు బిస్మిల్ రాసిన గజల్ భావాన్ని ఇక్కడ ఇస్తున్నాను. సుభాష్ గారు పోస్టు చేసిన వర్షన్లో కేవలం 6 షేర్లున్నాయి. కాని బిస్మిల్ రాసిన కవిత చాలా పెద్దది. నాకు లభించినంత వరకు ఆ కవితను సేకరించి ఇక్కడ పోస్టు చేస్తున్నాను. సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై దేఖ్ నా హై జోర్ కితనా బాజు యే ఖాతిల్ మేం హై (సర్ ఫరోషీ అంటే అర్ధం తలను తెగనమ్ముకోవడం. భావార్ధం ప్రాణాలు ధారబోయడానికి కూడా సిద్ధం కావడం. తిరుగుబాటుకు పూనుకోవడం) ప్రాణాలు త్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది హంతకుడి భుజాల్లో బలం ఎంతుందో చూద్దాం ఏక్ సే కర్తా నహీం క్యోం దూసరా కుచ్ బాత్ చీత్ దేఖతాహూం మేం జిసే ఓ చుప్ తేరీ మెహఫిల్ మేం హై (ఓ దేశమా) ఒకరితో ఒకరు ఏదీ మాట్లాడరేమిటి నీ గోష్ఠిలో ఎవరిని చూసినా మౌనంగానే ఉన్నారు రహ్ బరే రాహే ముహబ్బత్ రహ్ న జానా రాహ్ మేం లజ్జతె సహ్రానవర్దీ దూరి యే మంజిల్ హై (లజ్జత్ అంటే మజా. సహ్రానవర్దీ అంటే ఎడారిలో తిరుగాడడం) ప్రేమదారిలో మార్గదర్శీ నువ్వు దారిలో ఆగిపోకు ఎడారిలో తిరుగాడే మజా గమ్యం దూరంగా ఉన్నప్పుడే బాగుంటుంది యుం ఖడా మక్తల్ మేం ఖాతిల్ కహ్ రహా హై బార్ బార్ క్యా తమన్నా యే షహాదత్ భీ కిసీ కే దిల్ మేం హై వధ్యస్థలిలో హంతకుడు నిలబడి పదే పదే అడుగుతున్నాడు అమరత్వం పొందే కోరిక ఎవరి హృదయంలోనైనా ఉందా అంటున్నాడు యే షహీదె ముల్కో మిల్లత్ మైం తేరే ఊపర్ నిసార్ అబ్ తేరీ హిమ్మత్ కా చర్చా గైర్ కీ మహఫిల్ మేం హై దేశం కోసం బలిదానం చేసిన వారికి తలొంచుతున్నాను ఇప్పుడు మీ ధైర్యసాహసాల చర్చ పరుల (శత్రు) గోష్ఠిలో జరుగుతోంది వక్త్ ఆనే దే బతాదేంగే తుఝే అయ్ ఆస్మాం హమ్ అభీ సే క్యా బతాయేం క్యా హమారే దిల్ మేం హై సమయం వచ్చినప్పుడు ఆకాశమా నీకు చెప్పేస్తాం ఇప్పుడే మా గుండెలో ఏముందో నీకేం చెప్పాది? ఖీంచ్ కర్ లాయీ హై సబ్ కో ఖతల్ హోనే కీ ఉమ్మీద్ ఆషికోంకా ఆజ్ జమ్ ఘట్ కూచ యే ఖాతిల్ మేం హై హతమవ్వాలన్న ఆశే అందరినీ లాక్కుని వచ్చింది ప్రేమికుల గుంపు నేడు హంతకి వీధిలో ఉంది హై లియే హతియార్ దుష్మన్ తాక్ మేం భైఠా ఉథర్ ఔర్ హమ్ తయ్యార్ హై సీనా లియే అప్నా ఇధర్ ఆయుధాలతో శత్రువు కాపు కాసి ఉన్నాడక్కడ మేమూ మా రొమ్ము విరుచుకుని సిద్ధంగా ఉన్నామిక్కడ ఖూన్ సే ఖేలేంగె హోలీ గర్ వతన్ ముష్కిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై దేశం కష్టాల్లో ఉంటే నెత్తుటితో హోలీ ఆడతాం ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది. హత్ జిన్ మేం హో జునూన్ కట్ తే నహీ తల్వార్ సే సర్ జో ఉఠ్ జాతే హై ఓ ఝుకతే నహీం లల్ కార్ సే దేశప్రేమ ఉన్న చేతులు కరవాలాలతో తెగి రాలవు లేచిన తలలు బెదిరింపులతో కిందికి వాలవు ఔర్ జో భడ్కేగా షోలా సా హమారే దిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై మా గుండెల్లో ఉన్న నిప్పుకణం ఇంకా భగ్గుమంటుంది ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది హమ్ తో నికలే హీ థే ఘర్ సే బాంధ్ కర్ సర్ పే కఫన్ జాం హథేలీ పర్ లియే లో బఢ్ చలే యే ఖదమ్ (కఫన్ అంటే శవవస్త్రం. సమాధి చేసే ముందు మరణించిన వ్యక్తిని రెండు తెల్లని వస్త్రాల్లో చుడతారు. దాన్ని కఫన్ అంటారు. సర్ పే కఫన్ బాంధ్నా అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడడం. జాం హథేలీ పర్ లేనా అంటే ప్రమాదాలను ఎదిరించడం. తెలుగులో అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అన్న సామెత ఇక్కడ పొసగదు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అంటే భయపడుతూ బతకడం అన్న భావం ఉంది. జాం హథేలీ మేం లేనా అంటే ప్రమాదాలను ఎదిరిస్తూ ప్రాణాలు ధారబోయడానికి సిద్ధపడడం అన్న భావం ఉంది) మేం ఇంటి నుంచి ప్రాణత్యాగానికి సిద్ధపడే వచ్చాం ప్రాణం చేతపట్టి అడుగులు ముందుకు వేస్తున్నాం జిందగీతో అప్నీ మెహమాం మౌత్ కీ మహ్ఫిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై జీవితం ఒక అతిథి మాత్రమే, మనం మృత్యు గోష్ఠిలో ఉన్నాం ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలోనే ఉంది. దిల్ మేం తూఫానోంకి టోలీ ఔర్ నసోం మేం ఇంక్విలాబ్ హోష్ దుష్మన్ కే ఉఢాదేంగే హమేం రోకో న ఆజ్ (హోష్ ఉఢాదేనా అంటే నిర్ఘాంతపోయేలా చేయడం) గుండెలో తుఫానులు, నరనరాన విప్లవం శత్రుగుండెలో నిద్రపోతాం, ఆపకండీ రోజు దూర్ రహ్ పాయే జో హమ్ సే దమ్ కహాం మంజిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై మాకు దూరంగా ఉండేంత ధైర్యం గమ్యానికి లేదు ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలోనే ఉంది. ఓ జిస్మ్ భీ క్యా జిస్మ్ హై జిస్ మేం న హో ఖూనె జునూన్ తూఫానోం సే క్యా లఢే జో కష్తీ యే సాహిల్ మేం హై దేశప్రేమ లేని శరీరం కూడా ఒక శరీరమేనా ఒడ్డునున్న పడవలో తూఫానులతో పోరాటమా (చివరి షేర్ లో బిస్మిల్ పేరు తఖల్లుస్ గా కనబడుతుంది, చాలావర్షన్లలో ఈ షేర్ లేదు. సుభాష్ గారు పోస్టు చేసిన వర్షన్లో ఉంది.) అబ్ న పహలే వల్వలే హై ఔర్ న అర్మానోం కి భీడ్ ఏక్ మిట్ జానేకి హసరత్ అబ్ దిలే బిస్మిల్ మేం హై మునుపటి ఉత్సాహము, కోరికలు ఇప్పుడు లేవు బలై పోవాలన్న ఆశే ఇప్పుడు బిస్మల్ హృదయంలో ఉంది.
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWtqWm
Posted by Katta
by Subhash Koti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWtqWm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి