నిద్ర /సత్య గోపి/ కనురెప్పల తలుపులు మూసి చీకటి తాళం వేసి అలా తాత్కాలిక మరణంలోకి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెడతాను... ఇక్కడ నాకు వెలుగుతో పనిలేదు..! నాకు నచ్చిన వ్యాపకాన్ని మదిలో మెదిలిన రూపకాన్ని నా రాజ్యాన్ని నేనే సృస్టించే నా సామ్రాజ్యాన్ని నేనే శాసించే ప్రదేశం అదొక్కటే... కనుల ముందున్న నల్లటి తెరపై వేలి కుంచెతో అందమైన రూపాన్ని గీస్తాను.. చిరునవ్వుతున్న నన్ను గీస్తాను... సిగ్గుగా కొంటెగా గంభీరంగా వెకిలిగా ఎన్నో గీస్తాను... దానికి కళ మారుపేరు...! చీకటి అలానే ఉంటుంది... నడుస్తూ...నడుస్తూ... చుట్టూ పచ్చని చెట్లు కొమ్మల్లో దాగున్న పక్షులు నిర్మానుష్యమైన దారులు సెలయేటి శబ్దాలు ఇదే నా ప్రపంచం... మరో మనిషి లేకుండడమే నా ప్రపంచం... వొంటరిగా నడవడం... విహంగాల్లా వొళ్ళు విరుచుకోవడం... దీనికి కల మారుపేరు... ఆ ప్రపంచంలోనే ఊహిస్తాను నగ్నంగా మబ్బులపై పడుకున్నట్టుగా నల్లటి ఆకాశాన్ని కప్పుకున్నట్టుగా నక్షత్రాలని కనులలో నింపుకున్నట్టుగా నిశిథీనే జయించినట్టుగా ఇంకా ఎన్నో ఎన్నేన్నో... అన్నిటికి నిద్ర నిజరూపం..! అందులోనే నా నిజజీవితం..! ఇప్పుడున్నది స్వాప్నికజీవితం...! 08-06-2014
by Satya Gopi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx6XR
Posted by Katta
by Satya Gopi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx6XR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి