శ్రీనివాస్ వాసుదేవ్ కవిత-కొత్తగొంతుకలో ____________________________________ అస్తిత్వ వాదంలో "స్వేచ్చను"మానవ వాస్తవికత గా చెప్పారు.ఇది దాని చుట్టూఉండే పదార్థాలు,వర్గాలు,మూసలను చేదించుకుని వస్తుంది.మనుషుల్లో అభ్యుదయ వాదులు,విప్లవ వాదులు బయట పడటానికి కారణం ఇదే.స్వేచ్చ అనేది నిర్వచనానికి చిక్కని అంశం.అది వాస్తవము,యథార్థత కాదు.కాని అలా నిర్వచించుకోక పోతే ఆలోచించటం,తెలుసుకోవటం కష్టం. వ్యాకూలతని అనుభవిస్తున్నప్పుడుస్వేచ్చయొక్క ప్రాక్తన,అగాధ శీలం ముందు నిలబడి వ్యాకూలత పొందినప్పుడు ఈషన్మాత్రంగా దర్శనమిస్తుంది.మాటలనే మూసలలోనికి స్వేచ్చ చిక్కదు..ఏదైనా ఒక విషయం ద్వారానే స్వేచ్చను మనిషి గుర్తించ గలుగుతాడు,ఈ దృష్టిలో చుట్టూ ఆవరించిఉన్న అణుమాత్రపు భాగమంతా స్వేచ్చచుట్టుపేనవేసుకొని ఉన్నదే.శ్రీనివాస్ వాసుదేవ్"కొత్త గొంతుకలో"-ప్రాక్తన జీవితం చిద్రపడ్డస్పృహనుంచి వ్యాకూలత చెందుతున్న స్వరం ఉంది.ఒక సంఘటన జరిగిన తరువాత ఆరాజకీయాంశం గురించి స్పందించిన కవిత,ధ్వనిమయంగా ఒక స్థాయి వినిర్మాణంలో ఈ కవిత కనిపిస్తుంది. జరుగవలసింది జరిగాక మళ్లీ ఎప్పటి జీవితాన్ని పొందేందుకు గతాన్ని,గమనాన్ని కలిపి భవిష్యత్తుని ఆశించటం ఇందులో ఉంది. "వికసించిన చీకట్లలో వెలుగుని ముద్దాడాను వికటించినవాటిల్లో ఫీనిక్స్ అస్థికలకోసం వెతికాను రెండూ దొరికాయి..... మరో కొత్త గొంతు మొహమ్మీదకొచ్చింది అదే గళం, అదే స్వరం కానీ మాటమార్చాల్సొచ్చింది గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం! ఓ కొత్తగొంతుకలో...." అస్తిత్వ దృక్పథం నుంచి స్వేచ్చ పెనుగులాడేదీ ఇందుకే..బేర్డియేవ్ రెండురకాల స్వేచ్చగురించి చెప్పాడు. ఒకటి ప్రాక్తన,అహేతుక స్వేచ్చ.ఇది మంచీ చెడులకు ముందు ఉండేది(జరగక ముందే భయపెట్టి సంఘర్షణకు గురిచేసేది,లేదా హెచ్చరించేది.)రెండోది చర్యను అనుసరించేది.అంతిమ హేతుబద్ధ స్వేచ్చ.(జరిగిన దానిని తార్కికంగా అర్థం చేసుకుని సంఘర్షణను అనుభవించేది)అందువల్ల ప్రతీ విషయంలో స్వేచ్చ ఆరంభబిందువు,మార్గము,లక్ష్యం కూడా. వాసుదేవ్ కవిత రెండవ జాడలనుండే వచ్చిందని తేలికగార్థమయ్యే విషయం.ఈ కవితలో రాకీయాంశని పట్టిచ్చే అంశాలుకొన్ని ఉన్నాయి. "గుమ్మానిక్కట్టిన చామంతులన్నీ ఒకే పాటందుకున్నాయి.... మా కంట్లోంచి జారిన కన్నీళ్ళని పట్టే కెమేరా ఉందా అని!" "రెండు పూలమధ్యైనా రెండు తొడల మధ్యైనా అదే వాసన కోర్కె వాసన....స్వార్ధపూరిత కోర్కె వాసన జీసస్‌ని శిలువేసిన ఆ జెస్టింగ్ పైలేట్ కీ అదే సమస్యనుకుంటా నిజాన్ని చెప్పనివ్వకుండానే వెనుతిరిగాడు" "గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం!" రెండుపూలు/జాతిరంపపు కోతలు/మా కంట్లోంచి జారిన కన్నీళ్లని పట్టే కెమేరా ఉందా...ఇవన్నీ రాజకీయాంశని పట్టిస్తాయి... ఈకవితని అర్థం చేసుకోడానికి ఇందులో అనుసరించిన నిర్మాణం ఒకటి కొంత అడ్డుపడుతుంది. వస్తువు+సంఘర్షణ+ శాస్త్రీయవచనం..అనే సూత్రం ఒకతి కనిపిస్తుంది..సాధారణంగాప్రతీకలు,అంతర్గతవచనం లాంటివి ఇలాంటి నిర్మాణంలో కనిపిస్తాయి..ఇందులో శాస్త్రీయమైన వైఙ్ఞానికాంశాలున్నాయి.గ్రాఫిటీ,ఫీనిక్స్,ఐన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతం..ఇవన్నీ అలాంటివే...నిజానికి ఇందులో అస్తిత్వ వాద సంఘర్షణని ప్రస్తావించేది ఇదే. "రాత్రిలాంటి నల్లచీరకట్టుకున్న నింగీ, ఒళ్ళారబెట్టుకుంటున్న నేలా రెండూ సాపేక్షసిధ్ధాంతాలకతీతమే ఐన్‌స్టీన్ మళ్ళీ వెనక్కెళ్లాల్సిందే...మనిషి మనుగడలోకి!" సాపేక్ష సిద్ధాంతంలో ఒకటి విశ్రాంతిలో ఉంటే మరొకటి చలనంలో ఉండటం అన్న సూత్రాన్ని..కాదని రెండూ ఉంటాయని నిరూపించాడు..సుమారుగా అస్తిత్వమూ ఇదే మార్గంలో వెళ్లింది. ఈ తరహా కవితా నిర్మాణాలు పాశ్చాత్యసాహిత్యంలో ప్రయోగాత్మకంగాకనిపిస్తాయి.ఎక్కువ ఙ్ఞానాన్ని అపేక్షించినట్టుగా కనిపించే ఈకవిత వర్తమానాన్ని గురించిన భారమైన అంశాన్నిప్రస్తావించింది..నిజానికి హృదయభారాన్ని చెప్పడానికి ఇలాంటినిర్మాణమూ అవసరమేనని పిస్తుంది.
by ఎం.నారాయణ శర్మ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1prkeik
Posted by Katta
by ఎం.నారాయణ శర్మ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1prkeik
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి