Si Ra// ఓ కవిత గురించి కవిత // 8-6-14 ఇవిగో ఈ అక్షరాలు అంత గొప్పవేమీ కాదు ఈ కవిత చదవకపొయినా నష్టం ఏమీ జరగదు. ఇది కేవలం విసిరేయబడ్డ పదాల సమూహం యాద్రుచ్చికంగా కలిసిన అక్షరాలన్ని అతుక్కోవటం వల్ల ఏర్పడిన నైరూప్య గీతం. దీని అర్థమంటావా, నీల్ల అలజడులకు, శరదౄతువులో రాలిపడుతున్న ఆకులకు, యుద్దంలో తెగిపడే తలలకూ, నిద్రలో ఏడుస్తున్న ముసిలావిడ కన్నీటికి, ఏం అర్థం ఉంతుంది. అందుకే చెప్తున్నా, ఈ కవితని అంతగా పట్టించుకోకు, ఇది నువ్వు చదవాలి అనుకుంటున్న కవిత కాదు. బాధల గురించి, కష్టాల గురించి, ఛిద్రమైన జీవితాల గురించి విప్లవాల గురించి, మార్పుల గురించి, మరో ప్రపంచం గురించి, రొడ్డు పక్కన ప్రవహిస్తున్న ప్రపంచాన్ని చూస్తూ ఇలాంటి అనర్థాల గురించి నిత్యం తనలోతాను మాట్లాడుతూ గడిపే పిచ్చిది ఈ కవిత. ఎప్పుడైతే ఒక వ్యవస్త నిన్ను చింపి ముక్కలుముక్కలు చేస్తుందో ఒక పద్దతి నిన్ను నీ నుండి దూరం చెస్తుందో, ఒక వాస్తవం నీ స్వప్నాలన్నిటినీ కాల్చేస్తుందో నీకు మాత్రమే తెలిసిన జ్ఞానన్ని ప్రపంచపు అజ్ఞానం మింగేయలని చూస్తుందో అప్పుడు వొచ్చి ఈ కవితను చదువు, ఈ కవితలోని అర్థం, రూపం, రాగం అవంతకవే బోధపడుతాయి. అప్పటివరకు ఈ కవిత నీకు రహదారిలో ప్రతి వాహనాన్ని వెంటబడే కుక్కలాగనే కనిపిస్తుంది.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SoX9AL
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SoX9AL
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి