//జయ రెడ్డి బోడ // ఉనికి // అమ్మా నాన్నను.. అనుకరించి పెద్దరికపు అభినయంతో స్వచ్చంగా సాగిన ఆ పసితనం అరమరికలు లేని పిచ్చుక గూల్లై ఆ ఇసుక తిన్నెల్లో ... కాలపు అలల తాకిడికి, భాస్వరంలా కరిగిన బాల్యం... ఇక ఇప్పటి యవ్వనమంతా తెరలపై నటనంలో తమను తాము మేకప్పుల్లో చూసుకొని, చాటింగుల్లో చలనం లేకుండా చలన చిత్రాల్లో లీనమయి స్వంత సామర్థ్యాన్ని కోల్పోయి ,,, యవ్వనులు అలా కాలం గడుపుతుండగా .. ఇక మధ్య రకం బ్రతుకులో తృప్తి లేని మనిషి,, ఓ ధనికుడు తానూ తినకుండా వేరొకరికి పెట్టకుండా దాచుకున్న ధనరాసుల్ని చూసి, కాస్త ఈర్ష్య పడుతూ ఇంకాస్త భాద పడుతూ .... టీ కొట్టు లో బాలున్ని బెదిరిస్తూ,, బారు లో బీరు త్రాగుచు బాయ్ ని భూతులు తిడుతూ అప్పు తెచ్చిన సొమ్ము టిప్పులు వేస్తూ, ప్రగల్భాలు పలుకుతూ తన ఉనికిని చాటుకుంటూ..శ్రమను మరచి ఓ అభాగ్యుడు నేనేమో వెలుతురే లేని చీకటి రాత్రిళ్ళు, పోగుట్టుకున్న విలువైన కాలాన్ని వెదుక్కుంటూ తలలోని నరాలను గోలపెట్టించి,ఎప్పుడో తోడుకొని దాచుకున్న కొన్ని జ్ఞాపకాలను తవ్వి తీసి తీపి భావాలుగా మలిచి అక్కడ కవుల రసమయ అంగళ్ళలో కుప్పగా పోసి ఆశగా ఎదిరి చూస్తాను ఏదో ఒక ఓదార్పు వాఖ్య కోసం జారిపోయే అక్షర పూలను ఏరుకుంటూ పదాలుగా పేర్చి దోసిళ్ళలో పట్టుకొని ఓ అనామక దశ నుండి నిలదొక్కుకొని, మళ్లీ కవిత్వ రంగు పులుముకొని వచ్చే పోయే కవి మహా రాజుల మెప్పు కోసం నిరీక్షణ చేసి ఏదో ఒక పెద్దరికపు ఓదార్పు పొంది పట్టుదొరకని అక్షర మాలిగ లోంచి తొంగి చూస్తూ, నన్ను నేను కర్ణ పాత్రగా పోషించుకుంటూ నాలోని నన్ను మీ ముందు పరుచుకుంటూ... నా సజీవత్వాన్ని కాపాడుకుంటూ ఇక మానసిక తృప్తే లేని అభాగ్యులెందరో ఒకరు కుటిల రాజకీయ చాణుక్యులు అయి,ఇంకొకరు తమ డబ్బు దర్పం కౌటిల్యం ప్రదర్శించి, మరొకరు కాగితాలపై తమ హోదాను ఘింకారంగా చూపించి జ్ఞ్యానులు ఎందరో తమ చిట్ట చివరి లక్ష్యాన్ని మరచి.. ఘర్షణ పడి గగ్గోలు పెట్టి ..ఇంగితం కోల్పోయి నానా రకాల ఎరలు వేస్తూ.. ఏదో తమకే తెలియని తమలోని అహాన్ని సంతృప్తి పరుచుకుంటూ తమ ఉనికిని చాటుకుంటూ..ప్రసవించి విసర్జించే కాలపు ఘర్భంలో ఉనికిని కోల్పోతూ ... (08-06-2014)
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Smbxtu
Posted by Katta
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Smbxtu
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి