ప్రక్రుతి ప్రకోపం..సర్కార్ శాపం! ------------------------------- నీకు ఏమైతేనేం వాళ్ళ మానాన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అదే పది వేలు రేయనక పగలనక నువ్వు మట్టిలోనే కలిసిపోతే కాసిన్ని మెతుకుల కోసం నీవు నేలరాలి పోతే వాళ్ళకు ఎందుకు వాళ్ళు బాగుంటే చాలు రోజుకో మాట ..పూటకో అబద్దం తమ పదవులు తమకుంటే చాలు నువ్వు ఏమై పోతేనేం అప్పుడే కుర్చీల కోసం కొట్లాట నీకు యేపదవి నాకు ఏ పదవి భూమిని భుజానికి ఎత్తుకుని గుండెల్లో దుఖాన్ని బిగపట్టుకుని నీవు కన్నీళ్ళతో సాగుతూ ఉంటే వాళ్ళు మాత్రం హామీల వర్షాన్ని కురిపిస్తారు మాయ మాటలతో మేస్మరైస్ చేసేస్తారు ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణా ఇందుకేనా మనం కడుపు కాలి అప్పులు తీర్చలేక రాలిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం సొల్లు కబుర్లతో సద్ది కథలతో పొద్దు గడుపుతూ అరచేతుల్లో స్వర్గం చూపిస్తూ గారడీ చేస్తూ .. పిట్టల దొరల్లా వేషాలతో వెకిలితనంతో తెలంగాణా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ఇక చాలించండి ..మీ సాయం మాకొద్దు మమ్మల్ని మనుషులుగా చూడండి చాలు !!
by Bhaskar Palamuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVZfi1
Posted by Katta
by Bhaskar Palamuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVZfi1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి