పహ్‌లా గులాబ్ హీ పహ్‌లా కాంటా! ```````````````````````````````````` సైకిలేసుకొని టౌనంతా చక్కర్లు కొట్టేది నూనూగు మీసపు నా తొలి యవ్వనం కాలేజీ బెల్లవ్వగానే రోడ్డంతా గులాబీలు చూపుల దారం చాలేది కాదు... బెదురు బెదురుగా పారిపోయే ఒక కల- కాంచనమాల అలలు అలలుగా ఉబికే సెలయేటి పాట- లెనీనా పెంగ్విన్ పక్షిలా కదిలిపోయే ఒక జరీనా బేగం ఎన్ని జంటల కనుపాపల్లో కాపేసే వాళ్లమో...! *** నువ్వు తారసపడ్డ తొలిరోజు నీ కళ్లుండే చోట రెండు సుందర ప్రపంచాలు దొరికాయి నాకు ... ముఖం కేంద్రంగా నీ దేహం ఒక సౌర కుటుంబంలా తోచేది ... గల్లీ చివర నువ్వు - వెనుదిరిగి చూసిన రోజు మనసు మానస సరోవరమై మంచుఖండాల అంచులు దాటింది సంశయించీ.. సందేహించీ.. అధైర్యించీ.. చివరాఖరికీ నిన్ను పలకరించిన రోజు నీ నవ్వు నయాగరాలో తానమాడాను కనురెప్పకింద నా కలల పాపల్లే అల్లరి పెడుతుంటే పక్కమీద ఎంతగా దొర్లేవాడినో... తెల్లారి చూస్తే పైజమాపై రాత్రిలేని ఓ తెల్లపువ్వు ! *** కాలేజ్ రోడ్లోకి మళ్లగానే నీ కళ్లల్లో నేనో మెరుపు మొగ్గనై... కళ్ల పడగానే లయ విరిగే నా గుండెల్లో పెరిగిన శ్వాసవై... ఎన్ని కాంతి సంవత్సరాల్ని ఈదాకో పూదోట సుబూత్ గా నేనందుకున్న తొలి గులాబీ సాయంత్రం మన మధ్య ఓ నాలుగు పాలపుంతలు దొర్లిపోయాయో లేదో నా పేరు విడమర్చగానే సూర్య నక్షత్రం చప్పున ఆరిపోయి నా నిషానూ మెరుపునీ స్వప్నదరహాసాల్నీ బ్లాక్‌హోల్ లా లాక్కుని వెళ్లిపోయిన నీ చివరి చూపుకి ఛిద్రమై S..K...Y..O..U..S..U..F...B..A..B..A..
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx9mG
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx9mG
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి