పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అద్భుతమైన, నాకు చాలా ఇష్టమైన పాట "ఆదిభిక్షువు నాడినేమి కోరేది". ఆ పాటలోని పాదాలు మరొక దృక్పథంనుంచి చూడమని నన్ను ప్రేరేపించాయి. నాకు స్ఫురించిన భావం ఇదిగో ----- నచ్చితే చెప్పండి నచ్చకపోతే నా ఈ దుస్సాహసానికి క్షమించేసేయండి. ఖండ నడకలో ప్రాసతో వ్రాసే ప్రయత్నం చేసాను ఆదిభిక్షువు వాడినేమి కోరేది బూడిదిచ్చేవాడినేమి అడిగేది అడుగకయె అవసరము లనుదీర్చి తోడుండు నడుగడుగు వాడాది భిక్షువైతేనేమి (తోడుండును అడుగడుగు) అడగడమె ఆలస్యముగ వరములిచ్చేసి పొడిబూడిదొకచెటికె చిలకరించితెనేమి తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేమి కోరేది (నిగనిగలాడే నల్లరంగంటే చాలా ఇష్ఠమైనవాళ్ళలో నేనొకడిని) నింపె మాధుర్యమును గళమందు ఒకవైపు సొంపైన అమవస నిశీధిశాల్వొకవైపు (నిశీధి శాలువ లేదా నిశీధందమొకవైపు) కెంపులను కనులలో పోదిగెనింకొకవైపు ఎంచి అందములన్ని కోకిలమ్మకెనిచ్చె కరకు గర్జనల మేఘముల మేనికి మేరపు హంగు కూర్చినవాడినేమి అడిగేది యెదలదురు ఉరుములతొ మేఘములు వచ్చినచొ పొదినున్న పసిపిల్ల లదిరిభయ పడెదరని యెదనత్తుకొనురంచు తల్లులకు తెలుపంగ పెద్దవెలుగులుకొన్నిపంపేను ముందుగనె తేనెలొలికే పూబాలాలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేమి కోరేది ముచ్చటగ మూడుదినములజీవనములోనె విచ్చితమ పరిమళము జగమెల్లవెదజల్లి వచ్చితన పదములకడచేరు భాగ్యమ్ము నిచ్చేటిముక్కంటి వాడినెటు పొగిడేది? బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేమి అడిగేది కొండలుగ యుగయుగము లుంచినను శాశ్వతము గుండేటి తనరూపు విగ్రహముగామార్చి పొందమని తనవంతు వేవేల పూజలను దండిగా దీవించు వాడినెటు పొగిడేది?

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCaKPL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి