పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Mukharjee Madivada కవిత

మందమతి//"ఒక బరువైన ప్రేమ కథ" గిరి అంత నే బరువున్నానని బరి తెగించి నువ్వు హేళన చేస్తే సిరి నీదా నే తిన్నదని సరి కాదా నే ప్రశ్నిస్తే? వ్యక్తమైన నీ భావం కాదు దాగున్న వెకిలి నవ్వే నను బాధిస్తోంది తుచ్చమయిన నీ ప్రశ్నలు కాదు ఆత్మ న్యూనతే నా మది తొలిచేస్తోంది మేరు లాంటి నా మేను కాదు నే కోరుకుంది తగ్గాలన్న తపన నాలో కాష్టంలా కాలుతోంది జన్యు లోపం నన్నివాళ దోషి లాగా నిలబెట్టింది ఆత్మహత్యే శరణ్యమని నా మనసు కూడా ఘోషిస్తోంది నన్ను నన్నుగా ప్రేమించావని ఆత్మది అందం గమనించావని నిన్న వరకూ నే నమ్మితి గాని కానలేదు నువ్వు మరిచావని నాకంటూ మరి మనసోకటుందని. 07-06-2014

by Mukharjee Madivada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q4p30u

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి