@ ఒడువని రణం @ _ కొత్త అనిల్ కుమార్ తెలంగాణా అచ్చిందని సంబురపడుడు గాదు ఎట్లచ్చిందని ఓ సారి యాజ్జేసుకోవాలే వందేండ్ల పోరు ముగిసింది... అరవయ్యేండ్ల పెత్తనం నేల కూలింది భాష పేరుతో కలిసిన వాళ్ళు చూపించిన దురహంకార ప్రదర్శన ముగిసింది ఈ ముగింపు సామాన్యమైనది కాదు.. ఈ ముగింపుకేన్నో కరాలు..పాదాలు దోహదపడ్డాయి..అవును మరి వలసవాద పీడనను నిలువరించి.. స్వయంపాలన పోరాట విజయానికి చేయి కలిపిన శక్తులను కొనియాడే సమయమిది ఇది మన అస్తిత్వ విజయోత్సాహం ఇది.. నింగి నేలను ఒక్కటి చేసిన కొట్లాటలో ఎత్తిన పిడికిల్లనిప్పుడు ముద్దాడాలే పర పాలన పీడను హతమార్చిన సంకల్పానికిప్పుడు జేజేలు పాడాలే అస్తిత్వ ద్వంసకుల మధమనిచిన కందలకిప్పుడు కంకణాలు తోడుగాలే ప్రాంతేతర పెత్తానాన్ని పరుగెత్తించిన పిక్కలకోక్కసారి మొక్కి తీరాలె భాషా దురహంకార కోరలు పీకిన మని కత్తుల మహత్తును స్మరించుకోవాలే ఆత్మ గౌరవం అణచి వేసిన నీచులను అణగదోక్కిన నాయకులను కొనియాడాలే నిదుల కోసం నిప్పులు చెరిగిన మన నాయకత్వాన్ని యాదుంచుకొవలె నీళ్ళు తెచ్చి నేలను తడిపిన నిపుణుల నొకసారి అభినందించాలి అహర్నిశలు తెలంగాణమే అని ఉద్యమించిన అధికారులను మెచ్చుకోవాలే కలం పట్టి అక్షర పోరు చేసిన చేతులనిప్పుడు గుండెల్లో దాచుకోవలె గజ్జె కట్టి ఎగిరి దునికిన కాల్లనిప్పుడు కండ్లల్ల పెట్టుకోవలె నిరసించి ఎండిన కడుపుల్ల సల్ల పోసి అలుముకోవాలే నిరంకుశత్వానికి మండిన గుండెలను ఓదార్చి గట్టిగ హత్తుకోవాలే నినదించి ఎదురు తిరిగిన గొంహులకు శనార్దుల మాలలేయ్యలె శ్వాసను రాగాలు చేసి పాటలు పాడిన ఆ కంటాలకు మందార మాలలేయ్యలె విరిగిన లాతీలకు వెన్ను చూపని మొండి తనాన్ని చేతులెత్తి మొక్కలే పేలిన తూటాలకు రొమ్ము చూపిన గుండె దైర్యానికి పూజలు చేయాలే చైతన్యమై ఎదురు తిరిగి నిలిచిన విప్లవ స్పూర్తికి అరుణవందనం చేయాలే నిలువెల్లా గాయపడి శోకించిన యుద్ద వీరుఅల్కు గేయాల ఒదార్పునియ్యాలె వలస వాద కోట గోడలను కూల్చిన పిడికిళ్ళను పాటలతో ఎత్తుకోవలె రణరంగం లో రంకెలేసిన యువఫిరంగులకు పట్టాభిషేకం చెయ్యాలే యుద్ధభూమిలో తుపాకులై మొలిచిన విద్యార్తులకు మనం రుణ పడి ఉండాలే కదన రంగంలో అసువులు బాసిన అమరుల ఆశయాలకు మనం వారసులం కావలె రోదించి నీరింకిన మాతృమూర్తుల కండ్లల్లో మల్లా వెలుగులు నింపాలే.. రేపటి మన స్వయం పాలనకు మాల్లా మనమే సైనుకులం కావాలె నిన్నటి మన గోస ఒడవని ముచ్చట ఇయ్యలటి సంబురం గెలిచిన ముచ్చట ఈ వ్యధకు నిన్న ముగింపు కావచ్చు రేపటి మన ప్రాంత దోపిడీ దారులకు రహదారి కావచ్చు. కొట్లాడి తయారుగానే ఉన్నాం.. మళ్ళా కొట్లాడుతానికి తయరైదాం.. జై తెలంగాణా .. ( తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ కవిత అంకితం ) 7 / 6 / 2014
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tpk6EV
Posted by Katta
by Kotha Anil Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tpk6EV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి