పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Ravela Purushothama Rao కవిత

ఉష్ట్రపక్షి రావెల పురుషోత్తమ రావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ అతనెప్పుడూ అంతే గతంలోకి తలదూర్చి భావికాలాన్ని ఊహిస్తాడు వర్తమనాన్ని వరుమానంగా భావిస్తుంటాడు ఎవ్వరేమన్నా యేమాత్రంపట్టించుకోడు ఎవ్వరెన్ని విధాలా చెప్పినా యేమాత్రం వినిపించుకోడు జీతం తన జీవితగమనాన్ని ఉచ్చు వేసి ఉరిబిగించినా వక్రమార్గం వైపు ఎన్నడూ ఓర కంటితోనైనాచూపుమరల్చడు. ఊపిరాడ కున్నాసరే ఉలకడుపలకడు బ్రహ్మచెవుడు నటిస్తాడు. తనుగీసుకున్నగిరిలోనే తనధ్యాసనిముడుస్తాడు ఎదుటిమనుషుల వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యంచేసుకోడు ఎదుటివారిని మెచ్చుకోడు ఆత్మస్తుతి నందుకోడు. శతాబ్దాలక్రితం జన్మిస్తే శతసహస్రంగా ఎదిగేవాడు రాతియుగపు భావనలో రాణకెక్కిన మనీష అతడు ఇరవయ్యొకటో శతాబ్దంలో యిలా ఇరుకుబతుకునీడుస్తున్నాడు కాలంతోబాటు అతడు తన వాలకాన్ని మార్చుకోడు అతనెవరినీ అనుసరించడు ఎవరిమాటా చెవికెక్కించుకోడు. భావికాలపు గతినితెలుసు కోని బహుదూరపు బాటసారి అతడు అతనెప్పుడూఅంతే ఆధునికంగా ఆలోచించడు పాత చింతకాయ పచ్చడిలా పధ్యానికి మాత్రం పసందుగా పనికొస్తాడు ఉన్మాదిమాత్రంకానేకాడు ఉష్ట్రపక్షికోవకిందకొస్తాడు ----------------------------------7-6-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TqFQjO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి