ధ్యానం మెత్తని పూల మత్తడి దూకిన నీ వాసనల చెలిమిగంధాలు పూసుకున్న గాలినోట కలుపుగోలు పులకింతలరాగాల పాట వెన్నెలో, ఎండలో, కాల్చేసే వడగాళ్ళో, వేల్చుతున్న మలయానిలమో కంటిచూపు పిలుపో, ముందు నడక ఇషారో కొండవాగు ఒడ్డున నేను ఒంటరిగా ఏకాంతంగా కాదు కొద్దిగా దోసిట్లోకి ఇన్ని జ్ఞాపకాలని ఎత్తుకోగానే నిన్ను అభిషేకిస్తున్నాయి నా కన్నీళ్లు కొంచెంసేపు ఎదురు చూపులకే నీ ముందర కొలనవుతుంది దేహం నీవు కాసేపు, నేను కాసేపు ఈదులాడుతాం ఇంకా ఈ బతుకుసింగిడిని రంగులమయం చేయాలని కలలన్నింటిని పరిచి వాదులాడుతాం ఎక్కడెక్కడికో కొట్టుకుపోతాం, మళ్ళీ రెండుచేతుల దరులకు చేరిపోతాం నేనెప్పటికీ సగమే, నువ్వూ అంతేనేమో ఇద్దరం మన జీవితానంతరం ఒక్కటి కాగలమేమో కాలం వనవాటికలో ఆత్మీయాశ్రమంలో అద్వైతానంద సమాధి సిద్ధ సమావేశం నీ రూపకాలను నువ్వు, నా దాపరికాలను నేను వొదిలేసి వొద్దాం రా రా మన సమయం వొచ్చింది ఇపుడే వసంతం ప్రవేశించింది కోకిలవు, పాటవూ నువ్వే నేను నీ పెదవుల జంటను
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mniVgc
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mniVgc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి