పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Prabhakar Mandaara కవిత

ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన నేపథ్యంలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసే ఒక సమగ్ర పత్రిక ఆవశ్యకత ఎంతైనా వుంది. తెలంగాణ ప్రభుత్వం పూనుకుంటే తప్ప అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదు. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖవారు ‘‘ఆంధ్రప్రదేశ్‌’’ పేరిట ఒక మాస పత్రికను ప్రచురిస్తుండేవారు. అదే పద్ధతిలో ఇప్పుడు ‘‘తెలంగాణ’’ పేరిట మాస పత్రికకు బదులు ఒక పక్ష పత్రికను తెలుగు, ఉర్దూ భాషల్లో విడివిడిగా తీసుకువస్తే చాలా ప్రయోజనకరంగా వుంటుంది. ఈ ప్రతిపాదనను తక్షణమే పరిశీలించ వలసిందిగా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి గారిని ఫేస్ బుక్ మిత్రుల తరఫున సవినయంగా కోరుతున్నాను.

by Prabhakar Mandaara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6bXLa

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి