పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జూన్ 2014, శనివారం

Rajasekhar Gudibandi కవిత

ఏడాది క్రితం అవి నేను కొత్తగా ఫేస్బుక్ లోకి అడుగుపెట్టిన రోజులు.."వాడ్రేవు చినవీరభద్రుడి" గారి కవిత్వం చదువుతూ భావోద్వేగానికి లోనవుతూ ఎదో రాయాలనే తాపత్రయంతో ఆప్పుడప్పుడు వారి కవితకి కామెంట్స్ గా నేను రాసుకున్న కొన్ని మాటలు....ఇవి వారి కవిత్వం లోంచి పుట్టినవే..ఇలా రాస్తూ రాస్తూ... రాయటం కన్న ముందు చదవటం నేర్చుకున్నాను...వారికి నా కృతజ్ఞతలు.... రాజశేఖర్ గుదిబండి (చంద్రం) ||తొలకరి కవిత్వం || 07.06.2014|| పసిరిక నిండిన సెలయేళ్ల మధ్య నో , పచ్చని పంట పోలాలు మధ్యని ఇళ్ళలోనో పెరగటం అలవాటైన మేము, ఒక్కసారి ఈ నగరం లో పడి, మా చుట్టూ ఒక కాలుష్య, అమానవీయ విష వలయాన్ని సృష్టించుకున్నాము. చూస్తూండగానే స్పందించడం మర్చిపోయిన మనస్సు స్పందించడం మాత్రమె తెలుసుకున్న హృదయం కాంతిని కన్నీళ్ళని గుర్తించని కళ్ళు. రాగం మర్చిపోయిన గంధర్వుడు. ఆలాంటప్పుడే తొలకరి జల్లు లాంటి ఈ కవిత్వం మమ్మల్ని చేరి దిగులు పొరల్ని కడిగేస్తుంది, నగరానికి ప్రకృతిని పరిచయం చేస్తుంది. ఇప్పుడు మా చుట్టూ అక్షర ఒయాసిస్సు. June 3, 2013 at 6:06pm Vadrevu Ch Veerabhadrudu గారి కవిత A poem for today: కుండీలో కలబందమొక్క,రాళ్ళమధ్యనో, ఎడారిలోనో పెరగటానికి అలవాటైన ప్రాణి, ఈ వేసవివేడిగాడ్పులకి నల్లగా మాడిపోయింది, లోపలకి ముడుచుకుపోయింది తనున్నచోటే తనచుట్టూ ఒక ఊషరక్షేత్రం సృష్టించుకుంది చూస్తూండగానే మట్టిరంగులో కలిసిపోయిన కొమ్మరంగు. పచ్చనితోటబదులు చుట్టూ ఇనపకంచెమిగిలినట్టుగా అంచుల్లో ముళ్ళమరక.కొండగుహముందు నిలబెట్టిన బండరాయి,రాగాన్ని వెనక్కు చుట్టేసిన వయొలిన్ తీగ అప్పుడు పడింది లేతవాన, సముద్రాన్నీ,నగరాన్నీ కలుపుతూ.ఎక్కణ్ణుంచి వచ్చిందో లేతపసుపు వన్నె ఈనెలపొడుగునా. కొండలన్నీ అడవులుగా మారిపోయే ప్రాచీన ఇంద్రజాలం,ఇప్పుడు కుండీచుట్టూ ఒయాసిస్సు.

by Rajasekhar Gudibandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLMOdf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి