పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Satya Gopi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Satya Gopi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

Satya Gopi కవిత

నా మొదటి ప్రేమలేఖ // సత్య గోపి // పాదాలు ఇసుక రేణువులతో సంభాషిస్తూ.. మాటలు మౌనాన్ని హత్తుకుని నా కనుపాప నిండా నీవుంటావు.. అలల ప్రేమతో నిండిన గాలులను మోసుకొస్తాను నీకోసం.. నీ చిరునవ్వు కన్నా విలువైన పువ్వు దొరుకుతుందా...? నీ చూపులతో ఎన్నెన్ని అక్షరాలను అందిస్తావు..! వాటిని ఒడుపుగా పట్టుకోగలిగాను నిశ్శబ్దంగా ఓడిపోతున్న వేళ నిను గెలిచాను ఆ క్షణం సముద్రపు ఒడ్డున రాళ్ళు నునుపుదేరినవి నీ శ్వాసను తాకి.. నీ మాటలను కలిపాను కలంలోకి సిరా తక్కువై.. నీ నవ్వులను వెదజల్లాను కాగితంపై పరిమళంలా పరుచుకుంది... అడుగు కదిలి కొన్ని వేల అడుగులై పరిగెడుతోంది హృదయం నిను చేరటానికి.. ఎన్ని స్వప్నాలను పోగేసుకున్నాననుకున్నావ్...? ఎన్ని ఊహలను దాచిపెట్టాననుకున్నావ్...? ఎన్ని విరహాలను దూరంగా పారేశాననుకున్నావ్...? అన్ని నీకోసమే.. ఇవన్ని కూడానూ మన కోసమే... 22-06-2014

by Satya Gopi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWaHzk

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Satya Gopi కవిత

---------------------------{ప్రయత్నం చేశాను} /సత్య గోపి/ నీటి ప్రవాహాన్ని పక్కకు తోసి సులభంగానే వచ్చేశాను.. నా స్నేహితులెవరు కనపడలేదు ఆశ్చర్యపోయాను ఇప్పుడే కదా అందరం కలిసి ఆడుకున్నాం, కేరింతలు కొట్టాము...! మెల్లగా దిగులుగా నడుచుకుంటూ ఆ బండరాళ్లను దాటుతున్నా... ఒక తల్లి, గుండె పగిలి చిమ్మే కన్నీటిని ఆపడానికి కొంగుని నోట్లోకి కుక్కింది నాకర్థం కాలేదు వెళ్ళి "ఎందుకేడుస్తున్నారు" అని అడిగా సమాధానం రాకపోవడతో బాధేసింది... పక్కన నా స్నేహితుడి తమ్ముడిని అడిగా "ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు" అని తను కూడా ఏం మాట్లడటంలేదు.. చుట్టు చూశా ఎవరో కొంతమంది నీటిలోకి దూకి వెతుకుతున్నారు.. మిగతా వారిని వదిలి నేనొక్కడినే వచ్చానని నాతో మాట్లాడ్డం లేదు అనుకున్నా... ఏడవకండి అని అతని చేతిని పట్టుకోబోయా అంతే ఒక్కసారి నా శరీరం నిప్పును తాకిన నీటి చుక్కలా వణికింది.. ఇది నిజమా కాదా అని నా చేతిపై గిల్లి చూసుకున్నా నాకెమీ తెలియటంలేదు ఏం చేయాలో ఎక్కడికెళ్ళాలో ఒక్కసారిగా గుండె కన్నీటితో తడిసిపోయింది మెదడుని యంత్రంలో వేసి తిప్పినట్టుగా... మరి నావాళ్లంతా ఏరి ఎక్కడికెళ్ళారు నా స్నేహితులు అని వెతికా పరిగెత్తుతూ నేను లేచిన చోటునుండి ఇంకాస్తా దూరం వెళ్లా.. వెతుకుతున్న వాళ్ళ చోటుకి చాలా దూరంలో మా వాళ్లంతా కొన ఊపిరి కొనలని పట్టుకుని వ్రేలాడుతున్నారు... వేగంగా వెళ్లి వారిని కాపాడుదామని చేయి అందించా ఇక్కడా నేను అందలేదు వారికి వారిని తాకలేకపోతున్నాను నిస్సత్తువ ఆవహించింది... భూమిలోకి కృంగినట్టుగా ఒక్కసారిగా ప్రపంచమంతా ఏకమైనంత కోపం వచ్చింది... ఏమిచేయలేక నిశ్శహాయుడిగా చేతగానివాడిలా రోజు మొత్తం వేచి చూశా వారేమో అక్కడే వెతుకుతున్నారు వీళ్ళు ఇక్కడున్నారు దేవుడా అని కూడా అనలేని ద్వేషం నాలో ఉబికింది... నిరాశగా వాళ్ళలాగే ఉండిపోయా... ఎంతసేపైనా ఎవ్వరూ రాలేదు కోపం క్రోధం భరించలేనంత బాధ అక్కడ వారిని అలా చూస్తూ నిలవలేకపోయా... పరిగెత్తుతూ వెళ్లి మళ్ళీ ఒకసారి నీళ్లలోకి దూకాను మునుపటి కంటే ఇప్పుడు ధైర్యంగా ఉన్నా చావటానికి... 10-06-2014

by Satya Gopi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uQbK6L

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Satya Gopi కవిత

నిద్ర /సత్య గోపి/ కనురెప్పల తలుపులు మూసి చీకటి తాళం వేసి అలా తాత్కాలిక మరణంలోకి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెడతాను... ఇక్కడ నాకు వెలుగుతో పనిలేదు..! నాకు నచ్చిన వ్యాపకాన్ని మదిలో మెదిలిన రూపకాన్ని నా రాజ్యాన్ని నేనే సృస్టించే నా సామ్రాజ్యాన్ని నేనే శాసించే ప్రదేశం అదొక్కటే... కనుల ముందున్న నల్లటి తెరపై వేలి కుంచెతో అందమైన రూపాన్ని గీస్తాను.. చిరునవ్వుతున్న నన్ను గీస్తాను... సిగ్గుగా కొంటెగా గంభీరంగా వెకిలిగా ఎన్నో గీస్తాను... దానికి కళ మారుపేరు...! చీకటి అలానే ఉంటుంది... నడుస్తూ...నడుస్తూ... చుట్టూ పచ్చని చెట్లు కొమ్మల్లో దాగున్న పక్షులు నిర్మానుష్యమైన దారులు సెలయేటి శబ్దాలు ఇదే నా ప్రపంచం... మరో మనిషి లేకుండడమే నా ప్రపంచం... వొంటరిగా నడవడం... విహంగాల్లా వొళ్ళు విరుచుకోవడం... దీనికి కల మారుపేరు... ఆ ప్రపంచంలోనే ఊహిస్తాను నగ్నంగా మబ్బులపై పడుకున్నట్టుగా నల్లటి ఆకాశాన్ని కప్పుకున్నట్టుగా నక్షత్రాలని కనులలో నింపుకున్నట్టుగా నిశిథీనే జయించినట్టుగా ఇంకా ఎన్నో ఎన్నేన్నో... అన్నిటికి నిద్ర నిజరూపం..! అందులోనే నా నిజజీవితం..! ఇప్పుడున్నది స్వాప్నికజీవితం...! 08-06-2014

by Satya Gopi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx6XR

Posted by Katta