పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Mukharjee Madivada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mukharjee Madivada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జూన్ 2014, సోమవారం

Mukharjee Madivada కవిత

మందమతి// "నిర్లక్ష ప్రళయం" ప్రపంచాన్ని నిర్మించాల్సిన ప్రాణాలు నిర్లక్షానికి నిర్లజ్జగా సమిధలయ్యె స్వప్నమింకా కనని మూసుకున్న కళ్ళని చూసి ఎడ్వకుండానే నా గుండెలవిసిపోయె. ఉన్నత చదువులాసించి ఉన్నదంతా ఊడ్చి పొట్ట కొట్టుకొని వెట్టి చాకిరి చేసిన తల్లిదండ్రుల గుండెలు పిండగా వచ్చిన రక్త చినుకులతోటి భరత మాత కళ్ళు మళ్ళి మళ్లీ తడిసె. 9.6.2014.

by Mukharjee Madivada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kSreoX

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Mukharjee Madivada కవిత

మందమతి//"ఒక బరువైన ప్రేమ కథ" గిరి అంత నే బరువున్నానని బరి తెగించి నువ్వు హేళన చేస్తే సిరి నీదా నే తిన్నదని సరి కాదా నే ప్రశ్నిస్తే? వ్యక్తమైన నీ భావం కాదు దాగున్న వెకిలి నవ్వే నను బాధిస్తోంది తుచ్చమయిన నీ ప్రశ్నలు కాదు ఆత్మ న్యూనతే నా మది తొలిచేస్తోంది మేరు లాంటి నా మేను కాదు నే కోరుకుంది తగ్గాలన్న తపన నాలో కాష్టంలా కాలుతోంది జన్యు లోపం నన్నివాళ దోషి లాగా నిలబెట్టింది ఆత్మహత్యే శరణ్యమని నా మనసు కూడా ఘోషిస్తోంది నన్ను నన్నుగా ప్రేమించావని ఆత్మది అందం గమనించావని నిన్న వరకూ నే నమ్మితి గాని కానలేదు నువ్వు మరిచావని నాకంటూ మరి మనసోకటుందని. 07-06-2014

by Mukharjee Madivada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q4p30u

Posted by Katta

26, మే 2014, సోమవారం

Mukharjee Madivada కవిత

నీ నిజాయితీకి నెత్తుటి మరకలున్నా, నీ కీర్తనతో నా రక్తం మరగదెందుకు? విజయోన్మాదంతో నువ్వు వికటాట్టహాసం చేస్తుంటే, నీవెవరో మరువని నా మనసు గొంతెత్తి అరవదెందుకు? ధనమరిగిన పొట్టలూ, ధనమెరిగిన మెదళ్ళూ, ధనం మరిగిన నీ మిత్రులూ నీ చేత కవిత్వాలు చదివిస్తుంటే, నా హృదయ కుడ్యాలు పగలవెందుకు? నీ కక్ష్యలు వీక్షిస్తూ, నీ భక్షణ కాంక్షిస్తూ, నీ శిష్యులు కక్షలలో నీ చుట్టూ పరిభ్రమిస్తుంటే, నా చక్షువుల నిప్పులు రాలవెందుకు? బహుశా మనిషిగా, నే చనిపోయి చాలా రోజులయిఉండవచ్చు! బానిసగా నే మిగిలిపోవడం చాలా నిజమయి ఉండవచ్చు! కానీ, ఒక్కటే సందేహం! నీ అబద్దాల సంద్రంలో ఒక భయానక నిజం దాగుందేమో? నీ అవినీతి రక్తం నా గుండెలో కూడా ప్రవహిస్తుందేమో? నా మీద తొలిసారి నాకే అసహ్యం! నీ విలువల్లేని అభివ్రుద్ధి కోసం అర్రులు నేనూ చాస్తున్నానేమో? "ఒక మందమతి"

by Mukharjee Madivada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S8lKdf

Posted by Katta

24, మే 2014, శనివారం

Mukharjee Madivada కవిత

గుండె లోతుల్లో అంతులేని బాధ నా కణాల్లో, కళ్ళల్లో, కలలలో, కణజాలాల్లో, అపరితమయిన అంధకారం! కారణాలేమయినా, గాయం ఒక్కటే, యుగాలైనా వీడని చిక్కుముడే! నీ కళ్ళల్లోకి చూడలేను నీ హృదయంలో నే ఉండలేను నీ తోడుగా నే నడవలేను నీకు దూరంగానూ ఉండలేను నీ నవ్వుకు కారణం కానప్పుడు అసలు,నేను బ్రతికున్నా, లేను. నీటి లోంచి బలవంతంగా బయట పడిన చేపను నేను. కాటి కంటూ చేరలేని బ్రతికున్న శవాన్ని నేను. నీ వేదన నా వల్లే నా ప్రేమే నీ శాపం నీ హృదయం, నా రుధిరం మన కలయిక ఇక కల్లే. నిశ్శబ్ద స్దబ్థత కు నే చెరువయ్యే వేళలో, గుండె లోతుల్లో అంతులేని బాధ!

by Mukharjee Madivada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tx0VG3

Posted by Katta