పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మే 2014, శనివారం

Krishna Mani కవిత

తెలియని లోకం ______________________________________ కృష్ణ మణి గగన శిఖరాన్ని ఎక్కాలని కాని ఏ దారిలో ఎంత దూరం పోవాలో తెలియదు తామరాకుపై నీటి బిందువునై తిరగాలని కాని గాలివాటానికి ఆకు ఒంగుతుందేమోనని భయం ! భూగోళం మధ్యలో జరుగు విలయాన్ని చూడాలని కాని ఎలా వేళ్ళాలో తెలియదు ! పువ్వులో పడుకోవాలని కాని తేనెటీగ వస్తుందేమోనని భయం కొబ్బరిలో నీటినై ఒదగాలని కాని గమ్యం చేరే దారి తెలియదు ! తెప్పలపై తేలియాడాలని కాని నన్ను మోస్తాయో లేవోనని భయం ఎదుటివారి మనసును చూడాలని కాని ఏ గాజు వాడలో తెలియదు ! తెలియని లోకంలో పయణం అడుగడుగునా భయం ! కృష్ణ మణి I 10-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ogDX5K

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి