చాంద్ || ప్రయాణం || రెండు శ్వాసల మద్య వంతెనలా అడుగులను పేర్చుకుంటూ సాగిపోవాలి తెలియని దూరాన్ని ఆలోచనకు అందినంత కొలుచుకొని అలిసిపోతే వెనుక పోగేసుకున్న జ్ఞాపకాలతో మనసు తడుపుకొని చుట్టూ చీకటిలో నీలో దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తపడాలి ******* వద్దనుకున్నా పులుముకున్న రంగులను అప్పుడప్పుడూ కన్నీటితో కడుక్కుంటూ నిన్ను నిన్నుగా చూసుకునేందుకు గుండెల్లో ఒక అద్దాన్ని దాచుకోవాలి తీపో, కారమో ఏ రుచీ నీ దారిలో కడదాకా కొనసాగాదని సర్దిచెప్పుకుంటూ ఎడారిలో నీళ్ళ కోసం కాదు దప్పికను ఒర్చుకోవడం నేర్చుకోవాలి ******* ఎన్నో అడుగులు నీతో జత కలిసి ముందో వెనుకో ఆగిపోయినా ఒంటిరిగానే ముగించాల్సిన పరుగును నిన్ను కట్టుకుంటూ ఇలాగే పూర్తిచేయాలి ఎన్నో సార్లు నువ్వు కరిగిపోయిన చోటే తిరిగి చెక్కబడుతున్న శిలగా ఘనీభవించాలి వీలైతే నీ గుర్తులను పదిల పరుస్తూ వెళ్ళు ఏదో ఒక పాదాలకు అవి సరిపోవచ్చు చాంద్ || 21.04.2014 || ( " వాకిలి " మే 2014 పత్రికలో ప్రచురితమైన నా కవిత )
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ry80sj
Posted by Katta
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ry80sj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి