జాస్తి రామకృష్ణ చౌదరి విరుద్ధము ఆ పుష్పమంటే నాకిష్టం తనలా తన లోకంలో తిరుగుతూ ఆడుతూ ఉంటే కళ్ళప్పగించి చూడడం చాలా ఇష్టం తనలా కెరటాల కొమ్మల మీద గెంతుతూ ఉంటే తిలకించడం ఇంకా ఇష్టం అలా తనని చేతులతో పట్టుకుని దోసిలిలో పెట్టుకుని ముద్దాడడం మరీ ఇష్టం అలా తనని నా ప్రేమలో ముంచేస్తుంటే తనలా నా మనసులో ఈదుతుంటే ఎంతో ఇష్టం ఆ పుష్పం అలా ఎంతో ఆనందంతో నా ఆలోచనల్లో నా చూపుల్లో, నా నవ్వుల్లో, నా రహస్యస్మృతుల్లో అమాయకంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుంది కానీ ఏమవుతుందో ఏమో నాలో ఆ క్షణం ఒక విరుద్దస్పృహలో నాలోంచి నేను వేరైపోయి నాకిష్టమైన ఆ పువ్వుని అమాంతం నమిలి మ్రింగేస్తాను అలా ఎన్ని పుష్పాలు నాలో నలిగిపోయాయో నా మోసపు చూపులతో మోసపోయాయో నా అంతరంగంలో నాకూ పుష్పానికీ మధ్య యుద్దం కానీ నేను మాత్రం ఇంకా ఆ పుష్పం మీద ఉండే ప్రేమ కోరికల మధ్య భేదంలో నశిస్తూనే జీవిస్తున్నా అసలు నేను ఉన్నట్టా లేనట్టా..... ఏమిటీ నాలో ఈ వైరుద్యం? ఎందుకు నాలో భావ సారూప్యత లేని ఈ స్వరూపం? 10May2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l8XjXh
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l8XjXh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి