థాంక్యూ మస్తిష్కం ||జ్యోతిర్మయి మళ్ళ|| ఎందుకో రాలాయి రెండు నీటిబొట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటీ కలిసి నీరై ఏరై వాగై వరదై నింగి నుండైతే ఏమో కంటి కొలను నుండి రాలిన వాన ఎందుకూ పనికిరానిది దుఃఖం ద్రవిస్తే వస్తుందా ఇది? గుండెకీ కంటికీ కాంట్రాక్టేమో! కొట్టుకోవడం మీద వత్తిడి హృదయానికి లబ్‌డబ్‌లు నోరుమూసుకున్నాయి బాధా నిరాశా ఘర్షణపడి పుట్టిన ఉరుములదే పైచేయి ఎగసిపడడాన్ని ఎవరాపుతారు? అల్పప్రాణానికి అర్ధాంతరంగా ఆయువు తీరిపోతుందేమోనని మనసుమాట వింటే మసైపోడం ఖాయమని తుఫానుగా మారితే ప్రమాదమని ఊహించి.. తెలివైన మస్తిష్కం పూనుకుని ఊరడిస్తే.. అప్పుడాగాయి ఉరుములూ వానా రెండూ
by Jyothirmayi Malla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oB0DLq
Posted by Katta
by Jyothirmayi Malla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oB0DLq
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి