పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మే 2014, శనివారం

Yasaswi Sateesh కవిత

యశస్వి ||అలకలో ఉన్న అమ్మతో..|| అంతతేలికైతేనా! ఎంతైనా వివరిస్తాను తూనికరాళ్ళు నీవైనప్పుడు మొగ్గు ఎటో మాటలెందుకు అందుకే మౌనానికే కట్టుబడివున్నా.. వస్తూనే ఎంతేడిపించానో .. అదంతా..పిచ్చినవ్వుల్లోకి మార్చిన విద్య నాది కాదమ్మా! నీ పేగుబంధానిదే మరో అమ్మ చేతిలో పెట్టాక.. మరబొమ్మనేగా దాగని ఇబ్బందుల నడుమ ఎంచక్కా నవ్వుతున్నానని లటక్కున కనిపెట్టేశాననుకున్నావ్ అలాగే ఉంటుందిలే!.. నీకన్నా నేనే నీకెక్కువైనప్పుడు.. నీ మనోనేత్రానికి భూతద్దాన్ని కట్టేశాక.. చందమామలో మచ్చలే నచ్చలేదని నాతో మాట్లాడొద్దన్నావ్, ఇప్పుడన్నా నిద్రపడుతుందా!! అంత కానిదేమి కోరావని తీర్చలేకపోతున్నా నేను!! సుఖంగా బతకమనేకదా తిట్టావ్ నీ నిర్వచనాలకందే సుఖం నీ ఒడిలోనే వదిలేసొచ్చాను కదా ఈ ఎండమావి జీవితంలో నే సేదతీరే ఒయాసిస్సు నువ్వేనమ్మా నా గుండెలయల్లో మెదిలేది నీ నవ్వేనమ్మా. = 10. 5. 14 = రేపటిరోజు కోసం...

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1glwYRt

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి