పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మే 2014, శనివారం

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||ఏకాంకిక || నీవున్నావ్ కనుకే నేనున్నాను నేనున్నాను కనుకే నీవున్నావ్ నిన్ను నన్ను ఒకటిగా కట్టేసారెందుకో లేదు లేదు ఒకరిలో ఒకరిని పాతరపెట్టేసారు నిన్నయునా నన్నయునా తవ్వుకొనేందుకు నిన్ను నేను నన్ను నీవు అనుమతించాలిగా నీవు అలికిడి చేసినంతకాలం నేను నేను అలికిడి చేసినంత కాలం నీవు ....ముడుచుకుపోతాం కదా తెలియని ఇంకెక్కడో నిన్ను నన్నూ మడతపెట్టి పొట్లం కట్టారెవరో సరిహద్దులు రెండూ ముచ్చట్లాడుకొంటున్నప్పుడు ముళ్ళకంచెలమధ్య రంగుల తేడాతో నీలోకి నేను నాలోకి నీవు ప్రవహిస్తూవుంటాం ఎంతవింతో కదా నా అంగీవి నీవు ..నీఅంగీని నేనూ అయి ...ఒకరి లోపల మరోకరం... వేయు వొక్కలుగా పగిలిపోతూ తిరిగి రెండుగా అతుక్కుంటాం .... ఒక్క రెండు రెండే ...రెండొకట్లూ రెండే ...మనకాంతిలో మనమే మననీడలో మనమే వజ్రం లో చిక్కుబడ్డ సూర్యకిరణంలా నేను తలలు చెక్కబడ్డ వజ్రం లా నీవు ఇంకోసారి నాలా నీవు నీలానేను ఇప్పటి వరకూ ఎప్పుడూ నిన్ను నీవు ..నన్ను నేను చూసుకోలేదు కాబట్టే నీవుగా నేనుగా విడిపోయామేమో ఒకే దేహానికి రెండు వేషాలకోసం కట్టిన మాయతెరలు మననిలా విడదీసాఏమో నాటకం పూర్తయ్యేదెన్నడో వేషం చెరిపేసుకొనే దెన్నడో

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sx4AmA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి