నిన్ను చూస్తూనే ఉన్నాను ---------------------------------- అత్యంత ఎత్తున తడిసిన ఆ శిఖరాగ్ర భాగం నుంచి నేను ఎందుకు నిన్ను ప్రశాంతంగా చూస్తూ ఉన్నాను వర్షం నీ ముఖాన్ని తడిపినప్పుడు పువ్వులు నీ దేహాన రాలినప్పుడు చెట్ల మాటల ముచ్చట్లను నువ్వు తదేకంగా గమనించినప్పుడు గాలి చేతులు స్వతంత్రంగా నిన్నుకౌగలించుకున్నప్పుడు నిన్ను కప్పేసిన మేఘాల నుంచి నువ్వు బయటకు తొంగి చూచినప్పుడు నేను నిన్ను రెప్పవాల్చకుండా చూస్తూనే ఉన్నాను ప్రశాంతంగా అతి ప్రశాంతంగా మహా ప్రశాంతంగా నువ్వొక లోయవై దిగి వచ్చి అదృశ్యమయ్యే వరకు .... నిన్ను చూస్తూనే ఉన్నాను రెప్పవాల్చక ... - తమిళ మూలం కవి పళని భారతి - అనుసృజన యామిజాల జగదీశ్ ------------------------------------ 10.5.2014 -----------------------------------
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVU9H1
Posted by Katta
by Jagadish Yamijala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fVU9H1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి