పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Sree Kavita కవిత

||ఏడేడు జన్మల అనుబంధం|| 'శ్రీకవిత' శ్రీ కారం నొసగు నా చెలి సుందర వదనం ఎందెందు వెతికినా కాన రాదు ఈ పరిపూర్ణ బింబం కనులార్పక ఆధ్యంతం తిలకించినా తనివితీరనిది నా చెలి ముఖారవిందం !! ఇంతటి సొగసు ఎవరి తరము !! శారద రాత్రుల శశివో, పున్నమి రాత్రుల నెలవంకవో మెరిసే మేఘాంతరాల మధ్యలో మేరిచే లతవో కాశ్మీర కమనీయ అందాల సోయగాల సొగసరివో ప్రకృతికి హరిత వర్ణాలు తెచ్చే వసంతానివో !! మది పులకించును నా చెలి తలపులు !! వసంతుని రాకతో చిగురించిన మామిడి వృక్షం కొమ్మలందున పువ్వులనడుమ చివురు మేయుచూ గొంతు నెత్తిన కోయిలమ్మల కొసరు పాటల మిసిమి పల్లవి నా చెలి పలుకులు కలిగించును !! తేనె తాగిన అనుభూతులు !! నా చెలి పలుకే రమ్యం, కులుకే సింగారం మేళవింపుల మధుర గీతం నా చెలి నిర్మల మనసు పలికించును సప్త స్వరాల సమ్మోహన రాగం నా చెలి పులకిస్తే పల్లవించును రసరమ్య మాధూర్యాల ప్రణయ రాగం నా చెలి తలపే సరిగమలు వలపే శృతి లయలు కలిసి సాగే సహచర్యం ఆలపించును !! అనురాగాల జీవన సంగీతము!! బంతి పువ్వులోని నిండుతనము, గులాబిలోని గుంభనము సన్నజాజిలోని మేని వంపులు, కనకాంబరంలోని సౌరభవర్ణాలు చేమంతి లోని సరసం, సంపంగిలోని పరిమళం మల్లెలలోని శ్వేత వర్ణం, కలువలోని కోమలత్వం కలగలుపులతో నాచెలి !! మురిపించే మమతల (కు)సుమం !! నా చెలి చీర సింగారంలో కనిపించును పదహారణాల తెలుగు తనం, సాంప్రదాయాల సౌభాగ్యము నా చెలి చెలిమి కలిగుంచు అమర కలిమి,వెల కట్టలేని విలువైన చెలిమి నా చెలి సాంగత్యంలో సృష్ఠిలోని ప్రతిదీ కళ్ళకు మనోహరమే...మరింత..ఆందంగా నా చెలి తో గడపిన ఒక్కొక క్షణం అమరం అనుభూతుల బంధం !! ఏడేడు జన్మల అనుబంధం !!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRPjd4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి