పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

పిట్టంత మనిషి ఉత్తరం నుండి దక్షిణానికి తూర్పు నుండి పడమటికి ఎటునుంచెటైనా పక్షి ఎగిరిపోతుంది గూడే ఖాళీ అంతంత దూరం ఎట్ల తెలుస్తదో యేమో అక్కడ రుతువు ఎదురుచూస్తుందని, ఇక్కడ గూడు గుండె పగిలిపోతుంది పాట మనసు రగిలిపోతుంది కాలం నైమిత్తికమై కర్కశంగా వలసబతుకు వలపోస్తుంది అడిగినంత మాత్రాన కుశలమేనా పండ్లబిగువున దుఃఖం రెక్కలూపి పోతుంది అదృశ్యమై చేసిన బాసల కవతల ఇంకని కన్నీటి సముద్రాలున్నాయిరా పిచ్చివాడా నువ్వొక్కడివేనా, నేను ముక్కలైన కలనై ఏండ్లుగదరా ఎగిరేసేదాకనే నీది పతంగి పేంచిపడి తెగిపోతే, డీలయి ఎగిరిపోతే వుత్త దారంకండె నీకు పోగులు పోగులై నీ మనసులెక్క చేను నీదే పంటనీదే, కోసినంక ఎవనికి రుణముంటే వానికి దూప నీదే, చెలిమె ఎవరిదో ఎగిరిపోయేటివి ఏయి నీయిగావు నేల మీదనే నీ బతుకంతా గా మొగులు మీద ఎవడో తెగిన పోగులతుకుడే జిందగీః ఆకాశరమ్యాల అనంతానందద్వీపాల సామ్రాజ్యం కాదురా జీవితం బుడ్డ బురదగుంటలో ఈదులాట రంగులకలలందరికి వుంటయి నువ్వేమన్న పెద్ద తురుంఖానువా పిడికెడు ప్రేమ, దోసెడు మమకారం కోసమే బతుకంత పెద్ద ఎడారి దీవానా లెక్క ఎదురు చూస్తున్నది నువ్వు పిడికెడు ఒయాసిస్సువయ్యె దమ్ముంటే ఏదన్నా కోరుకో ఏదన్న దొరుకనపుడు ఎవడైన ఏడుస్తడు నువ్వు అందరి దుఃఖాల జంబివయిన్నాడు నీ కష్టానికి అందరు కండ్లనీండ్లు పెట్టుకుంటరు ఎగిరిపోయిన పిట్ట ఇగ పోదు నిన్నిడిసి పిట్టకు పాటెరుకె పాటకు పిట్ట కావాలె

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qfeCWs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి