పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Pardhasaradhi Vutukuru కవిత

ప్రియమైన కృష్ణా తరంగాలు సభ్యులు , మిత్రులు , శ్రేయోభిలాషులకు విజయ నామ సంవత్సరం లో మొదలు పెట్టి , జయ నామ సంవత్సరం లో కూడా అలాగే మన చిత్రం - కవితల సంబరాల పోటీ జరుపుకుంటున్నాం . దానికి స్పందించిన ప్రతి ఒక్క సభ్యునికి శతసహస్ర వందనాలు . చాల చక్కగా స్పందించారు , ప్రతి ఒక్కరు ఇది నాది అన్నట్లు , కొంతమంది నాకు ప్రత్యెక అనుబందం కుడా ఏర్పడినది . తెలుగు భాషకు , కవిత తల్లికి మనం చేయగలిగిన చిరు సేవ చేయగలిగాం అన్న సంతృప్తి కుడా నాకు మిగిలింది . ఇది కేవలం కవులను ,కవితలను మన ముఖపుస్తాకానికి పరిచయం చేయటం , వారిని ఇంకా వారి కవితలలో ఇంకా వాడి పెంచుకోవాలి అన్న కోరిక పెంచాటమే ముఖ్య ఉద్దేశ్యం . ఇప్పటి వరకు 70 పోటీలలో 70 మంది కవులను పరిచయం చెయ్యగలిగాం . నా వరకు నేను ఎంతో సంతృప్తి చెందాను . నేను మొదలుపెట్టిన ఈ చిన్న ప్రయత్నం , ఇంత గొప్పగా ఘనం గా విజయవంతం అవటానికి కారకులు ముఖ్యం గా పాల్గొన్నా కవులే . నాకు తెలుసు అందరు మహాకవులే , పెద్ద పెద్ద కవులు విరాట రాజు కొలువులో పాండవులు రహస్యం గా జీవించినట్లు , ఈ కృష్ణా తరంగాలు లో కుడా అతి సామాన్యం గా కనిపిస్తూ అద్బుతమైన కవితలు రాసిన కవులు ప్రతి ఒక్కరు నాకు తెలుసు . ఇది ఇంకా ఎంత కాలం కొనసాగాలి అన్నది నా చేతిలో ఏమి లేదు . , మీ అందరి ఆదరణ , అభిమానం ఉన్నంత కాలం ఇలాగే కొనసాగుతుంది , మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నది కుడా నా ఉద్దేశ్యం . మీ స్పందన కవులు పాల్గోన్నంత కాలం ఈ పోటీ జరుగుతుంది . లేని రోజు విశ్రాంతి తీసుకుంటుంది మన ఈపోటీ . ఒక స్నేహితుడు నిన్ననే తెలియచేశారు పాల్గొనలేదు ఎవరు అంటే , నీ ప్రయత్నా లోపం అయివుండవచ్చు ఇంకా కృషి చేసి , పట్టుదల తో అభివృద్ధి చెయ్యాలి అని . ఈ పోటీలు ఇంత అద్బుతం గా రావాటానికి నా కృషి ,పట్టుదల ఏమి లేదు , కేవలం 100 శాతం మీ అభిమానం మాత్రమే . నేను నిమిత్తమాత్రుడిని . అందరు బాగుండాలి , మనవలన ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు అన్నదే నా ఉద్దేశ్యం . దీనిమీద మీ అబిప్రాయములు నిర్మొహమాటం గా తెలియచేయవచ్చు . మరల మీకు ధన్యవాదములు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం సాధించినందులకు . హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరేరామ రామ రామ హరేహరే మహామంత్రం జపించండి .... ఆనందంగా జీవించండి మీ అడ్మిన్ కృష్ణా తరంగాలు పార్ధసారధి ఊటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e59Mez

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి