కె.ఎన్.వి.ఎం.వర్మ//అంతేనా!?// అజ్ఞాతమంటే ఇదేనా? అఖండ సాగరాలకి ఖండానికో పేరు పెట్టి పేరు మార్చుకొని అడవుల్ని శోధించి శోధించి, శోధించీ ఆరోగ్యం క్షీణించి సేఫ్టీజొన్ నుంచి బయటకొచ్చి అర్ధరాత్రి కాలేజీ గ్రౌండు చెట్టు కింద నువ్వూ నేనూ ఎదురైనప్పుడు నా నిద్ర రాని కధ విని నవ్వావు వ్యవస్థ మార్చాలనుకున్నవాడవు పోలీసు కాక నక్సలైటు ఎందుకయ్యావన్న ప్రశ్నకి నీ సెతస్కోపు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు నాడి పట్టుకుని మందులివ్వగలవాడివి నాదే కాదు సమాజానిదీ నాడి నీకు చిక్కలా! అర్ధరాత్రి కనిపించకుండా పోయిన గుమ్మ దగ్గర తలితండ్రుల్లా నేనూ చాలా రాత్రులు నీకోసం వెదికాను ఓనాటి వార్తాపత్రికలో ఎంకౌంటర్ వార్త హ్యూమన్ రైట్స్ కమిటీ సబ్యుల ఖండన ఇదేనా అజ్ఞాతమంటే!? Written in 1996....posting date in KS 07.04.2014.
by Nvmvarma Kalidindi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e5RoSN
Posted by Katta
by Nvmvarma Kalidindi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e5RoSN
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి