కె.కె.//గుప్పెడు మల్లెలు-72// ****************************** 1. దీపం ఉంటేనే వెలుగివ్వగలమా? దీపాన్ని అద్దంలో చూపించినా వెలుగే, మనసుండాలంతే... మార్గాలెన్నో 2. పచ్చిమాంసం తినేవాడికి, బచ్చలికూర రుచిస్తుందా? వాగ్దానాలు ఎన్నిజేసినా... 3. అర్ధంకాని పద్యంలో అలంకారాలు ఎన్నుండి ఏం లాభం? పై,పై మెరుగులతో రాదులే ఆత్మసౌందర్యం 4. చీకట్లను తోలే పొద్దంటే, గుడ్లగూబకు చిరాకే, మంచిజేసినా మాటొస్తది, ఒదిలేయ్. 5. సుష్టుగాతిని తొంగుంటే అది భోగం, పక్కనోళ్లు కాకుల్లా పొడుస్తున్నా, పక్కమీద ఒళ్లుమరిస్తే, అదే యోగం. 6. జుట్టన్నాక చిక్కుపడుతుంది, సర్దుకుంటే పాపట కుదురుతుంది, అదేపనిగా దేవుడ్ని చిరాకెట్టీక 7. చెట్టు పచ్చగుంటుందా, చీడ వేరుచేరాక, బడికెళ్లే బచ్చాగాడికెందుకోయ్, కులం కాలమ్మ్... చెరిపేయ్. 8. దొంగరాకుండా కట్టడిచేస్తావ్, దుస్వప్నం రాకుండా ఏం జేస్తావ్? మంచోడిగా బతకాలంతే... వేరే దారేలేదు. 9. ఎద్దు వీపుమీద పుండుని, గెద్ద,కాకి ఎందుకు పొడుస్తాయ్? నోటిదురదకి మందులేదు, ఎదవల్ని వెలేసెయ్. 10. పుట్టిన బిడ్డని, కుట్టిన గుడ్డని చూసినప్పుడు ఎవరికైనా తృప్తే, ఎవరు ఆనందించరోయ్ కె.కె, మంచిమాట చెప్తే. ========================== Date: 07.04.2014
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kC7G48
Posted by Katta
by Kodanda Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kC7G48
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి