పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, ఏప్రిల్ 2014, సోమవారం

Yasaswi Sateesh కవిత

యశస్వి|| ఫామిలీ స్టంట్|| నీ జీవితంలోకి నేనొచ్చానో.. నా జీవితం లోకి నువ్వొచ్చావో ఇప్పుడిక అప్రస్తుతం. ఇది గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రస్తుతం మన అస్థిత్వాలకై తారాడు ఆడుతున్నాం ఎవరికి వారు బలహీన వర్గమనుకుంటేనే ఉద్యమించగల కాలం సంపాదించేవాడిది అభివృద్ధి మంత్రం ఖర్చుపెట్టే చేతిది సంక్షేమ పధకం ఏక కేంద్ర వృత్తాల్లా ఉండాలనుకున్న పెళ్ళినాటి కల..వెన్ చిత్రమెప్పుడైందో.. ఒలింపిక్ రింగుల్లా ఎప్పుడు దూరం జరిగామో! లెక్కా-పద్దూలేని జీవితంలో మిగులు కలైనప్పుడు లోటుబాంబు మాటల తూటాలనే ఉసిగొల్పుతుంది ఏ కోరికల ఎజెండా .. నా గుండెల్లో గుచ్చుతున్నావు అవసరాలను ఎవరి అసమర్ధతకు ఆపాదిస్తున్నావు ఇదేమైనా బాగుందా.. ఇల్లాల్లా! నిందారోపణలే..నీ ప్రచార పర్వం అయినప్పుడు ఎవరి తోడుతో ఖండించను! ‘నోటా’ ని గుర్తించమని ఏ న్యాయపీఠానికి నివేదించను ఆరో ప్రాణమా! అన్నీ నీకే అరువెట్టుకున్నాకా ఏమిచ్చి మళ్ళా నీ ఓటు కొనుక్కోగలను!! ఏ ఏకరువు నన్ను నీ గుండె గద్దెక్కించగలదు!! నాతిచరామి ఏమైనా ఎన్నికల నినాదమా? పునరాలోచించుకోవడానికి చేతిని విడిచేదెన్నడు!! కలసి నడవాలి గాని... = 7.4.14= (ఎన్నికల సంఘాన్ని.. కోర్టు.. NOTA కు గుర్తును కేటాయించమని ఆదేశించిన వేళ.. సరదాగా )

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iksI4y

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి