కె.ఎన్.వి.ఎం.వర్మ గారు రాసిన కవిత ||//నాలోనే!!కవిత్వ విశ్లేషణ ప్రస్తుతం జరుగతున్న వాస్తవాలను కవితా వస్తువు గా అది కూడా సామాజిక అంశం తో ముడిపడి ఉండటం అనేది కవి లో ని సామాజిక బాధ్యత ని తెలియచేస్తుంది...చిన్న చిన్న పంక్తులలో అర్థవంతం గా చెప్పటం బాగుంది, తను చూసిన నిజాలు, అక్షరం లో చెప్పే ప్రయత్నం చేస్సారు ! రియల్ ఎస్టేట్ మాయ ఎంతగా పాకి పొయింది అంటే..నాలుగు గింజలు ఇచ్చే పంట ని కూడా కాలనీ లు గా మార్చి పడేసింది ...!!! ఉన్న పొలం అమ్మినపుడు నాగరికత మరింత ముందుకే మరి ...అందుకే ఈ రోజుల్లో ఊర్లు కూడా పట్టణాన్ని తలపిస్తుంది ...మరి అలాంటి రియల్ ఎస్టేట్ ఊళ్ళకి ఊళ్ళే మాయం చేసి మన ఉనికి ని ఉన్నపళంగా తుడిచి వేస్తే ...ఆవేదన కలుగుతుంది కదా... చేను కాలనీగా మారి// ఊరు పట్టణం వేషం కట్టింది...>!!! ఘోరమైన రెండు నిజాలు, అలా అనటం కన్నా మానవ తప్పిదం అనొచ్చు ..మొదటిధీ ఏమో పశు సంపద ఓట్టి పోయినపుడు వ్యధ శాలకు (కబెళ) కు పంపడం ..., రెండోది మానవుడు తన ఇష్టానుసారం గా పర్యావరణాన్ని పాడు చేసి తనే కాకుండా జంతు జాలాన్ని కూడా బలి పెడుతున్నాడు ..ప్లాస్టిక్ వ్యర్దాలతో .., మొత్తానికి రెండు కారణాలతో పశు సంపదని నాశనం చేసుకుంటున్నాం ...ఆలోచింప తగినదే .. ఆవు// అల్ కబీర్ చేరి// పొట్టలోని//ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది ప్రంపంచం కుగ్రామం అయినపుడు ...వసుదైక కుటుంబపు భావన లు మనలో కలిగినపుడు ..నిజానికి అంతా ఒకటే అన్న భావన వచ్చి కలిసి పోవాలి చిత్రం గా ...ఎవరికి వారే యమునా తీరే అన్న చందం గా తయారు అయ్యింది , అలాగే పవిత్రమైన ప్రేమ ఇప్పుడు పార్కుల లో పొదలలో రొద చేస్తూ ..అందమైన భావన కి తూట్లు పొడిచేలా నేటి కాలపు ప్రేమ తగలడింది అని నిరసన ని తెలియచేస్తారు .. ప్రపంచం//వసుధైక కుటుంబంగా మారి//పక్కింటి//తలుపు మూసుకుంది పార్కు పొదలో దూరి//అవయవాలలో//నగ్నంగా తనని చూసుకుంటోంది నేను అన్న భావన నుంచి మనం లో కి ఎప్పుడు రాగలం ..., మనసు మనుషుల తో యుద్ధం చేస్తూ ...దూరంగా పారిపోతే బాగుండు అని తలపోస్తుంది ...నేను లో నుంచి మనం గా మారినపుడే అందరు కలిసి ఉండగలం ...ఒక ఆశ పెనవేసుకుంటుంది నిజంగా ఇది జరిగితే ఎంత బాగుండు ... మనసు//మనుషులతో పోరి జనారణ్యంలో//అడివిని వెదుక్కోంటొంది నేను/నాలోనే ఏమారి//నీలో మార్పు కోసం కలగంటోంది. NVM వర్మ గారి కవితల్లో సున్నితత్వం, హాస్యం, వ్యంగం కనిపిస్తూ వుంటుంది ..ఈ మధ్య లో సామాజిక అంశాల పై వారు తీసుకుంటున్న వస్తువు వైవిధ్యం గా ఉంటుంది, మనిషి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూనే...వ్యక్తి పరివర్తనలో ...మార్పు రావాల్సిన ఆవశ్యకత ను తెలియచెప్తారు, చిన్న కవిత అయిన కుడా పలు సమస్య ల ను బహు చక్కగా కళ్ళకు కట్టేలా చూపించిన వర్మ గారు అబినందనీయులు ...వారు మరిన్ని సామాజిక అంశాల తో ముందుకు రావాలని కోరుతూ .. సెలవు .. పుష్యమి సాగర్.. ---- కె.ఎన్.వి.ఎం.వర్మ//నాలోనే// చేను కాలనీగా మారి ఊరు పట్టణం వేషం కట్టింది ఆవు అల్ కబీర్ చేరి పొట్టలోని ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది ప్రపంచం వసుధైక కుటుంబంగా మారి పక్కింటి తలుపు మూసుకుంది ప్రేమ పార్కు పొదలో దూరి అవయవాలలో నగ్నంగా తనని చూసుకుంటోంది మనసు మనుషులతో పోరి జనారణ్యంలో అడివిని వెదుక్కోంటొంది నేను నాలోనే ఏమారి నీలో మార్పు కోసం కలగంటోంది.. == ఏప్రిల్ 16, 2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qEYYpB
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qEYYpB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి